చిత్రం: దాన వీర శూర కర్ణ (1977)
సంగీతం: పెండ్యాల
సాహిత్యం: సి. నారాయణ రెడ్డి
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం,పి. సుశీల
పల్లవి :- జయీభవ.. విజయీభవ.. జయీభవ.. విజయీభవ , చంద్రవంశ పాదోది చంద్రమా కురుకుల సరసీ రాజహంసమా...... జయీభవ.. విజయీభవ... చరణం 1 :- ధన్య గాంధారి గర్భశుక్తి ముక్తాఫలా మాన్య ధృతరాష్ట్ర తిమిరనయన తేజఃఫలా..ఆ... ధన్య గాంధారి గర్భశుక్తి ముక్తాఫలా మాన్య ధృతరాష్ట్ర తిమిరనయన తేజఃఫలా..ఆ... దిగ్గజ కుంభవిదారణచణ శతసోదరగణ పరివేష్టితా..... చతుర్ధశ భువన చమూనిర్ధళణ చటుల భుజార్గళ శోభితా. జయీభవ.. విజయీభవ... చరణం 2 :- కవిగాయక నట వైతాళిక సంస్తూయమాన విభవాభరణా నిఖిల రాజన్యమకుటమణి ఘ్రుణీ నీరాజిత మంగళచరణా మేరు శిఖరి శిఖరాయమాన గంభీర...భీరగుణ మానధనా క్షీరపయోధి తరంగ విమల విస్పార యశోధన సుయోధనా జగనొబ్బ గండ జయహో.. గండరగండ జయహో... అహిరాజకేతనా జయహో.. ఆశ్రిత పోషణ జయహో... జయహో.. జయహో.. జయహో...