Dharma Chakram లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Dharma Chakram లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

22, డిసెంబర్ 2023, శుక్రవారం

Dharma Chakram : Sogasuchuda Song Lyrics (సొగసు చూడ హాయి హాయిలే)

చిత్రం: ధర్మచక్రం (1996)

రచన: వేటూరి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర

సంగీతం: ఎం.ఎం.శ్రీలేఖ


పల్లవి :

సొగసు చూడ హాయి హాయిలే తెలిసె నేడు ఇంత హాయి... హాయి... హాయి చెలియ చూపు నీకు హాయిలే చెలిమిలోన ఉంది హాయి హాయి అందాలు చూడ జన్మ చాలునా అందించగానె ఆశ తీరునా అహో ఇదెంత వింత మోహమో చరణం : 1

నువ్వంటే నేనంటు నేనంటే నువ్వుంటు నీవెంట నేనుండనా నీ నవ్వే ముద్దంటు ఇంకేమి వద్దంటు ముడిపడనా నీకోసం పుట్టాను నీ దారే పట్టాను నీమీదే ఒట్టేయనా నా చేత చేయ్యెట్టు నన్నిట్టా జోకొట్టు ఒడిలోన చెట్టా పట్టా కట్టేదెట్టో ఇట్టే చెప్పేయాలమ్మా చెట్టు పుట్ట చూసే వేళ తప్పేదెట్టయ్యా కుమారి చెంపకెన్ని కెంపులో వరించు కళ్లకెన్ని రంగులో అహో ఇదెంత వింత మోహమో చరణం : 2

నా పాలబుగ్గల్లో దీపాల సిగ్గుల్లో నీపాలు పంచివ్వనా ఈ వెండి వెన్నెల్లో నీ గుండె చప్పుళ్లు వినలేనా హద్దుల్ని దాటాలి వద్దన్న చూడాలి నీ కన్నె కవ్వింపులు కాదన్నా లేదన్నా కౌగిట్లో పాడాలి పదనిసలు నిన్న మొన్న లేనేలేని వైనం ఎంతో బాగుంది వన్నె చిన్నె ఊరించాకే ప్రాణం లాగింది సయ్యాటలాడ ఎంత తొందరో వయ్యారి ఈడుకెన్ని చిందులో సుఖాల తీరమెంత దూరమో

31, డిసెంబర్ 2021, శుక్రవారం

Dharmachakram : Dheera Sameere Yamuna Teere Song Lyrics (దీరసమీరే యమునా తీరే ..)

చిత్రం: ధర్మచక్రం (1996)

రచన: వేటూరి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర

సంగీతం: ఎం.ఎం.శ్రీలేఖ


దీరసమీరే యమునా తీరే ... వసతి వనే వనమాలి.... గ్రామసమీపే ప్రేమకలపే.. చెలీ తగునా రసాకేళి... ఆకాశమే నాహద్దుగా... నీకోసమోచ్చ ముద్దుగా తెచ్చానురా ఇచ్చానురా గిచ్చేయి మెచ్చిన సొగసులు.. దీరసమీరే యమునతీరే... వసతివనే వనమాలి... గ్రామసమీపే ప్రేమకలపే... చెలీ తగునా రసాకేళి... వేసంగి మల్లెల్లో సీతంగి వెన్నెల్లో.. వేసారి పోతున్నారా రారా.... హేమంతమంచుల్లో ఏకాంత మంచంలో వేటాడుకొంటున్ననే నిన్నే.... మొటిమ రగులు సెగలో... తిరగబడే మడమ తగులు వలలో.. చిగురు వణుకు చలిలో.. మధనుడికి పొగరు పెరిగే పొదలో.. గోరింటపొద్దుల్లోన పేరంటాలే ఆడే వేళా ధీరసమీరే యమునతీరే .... వలచితినే వనమాలి.... గ్రామసమీపే ప్రేమకలపే... ప్రియ తగునా రసాకేళి... లేలేత నీఅందం నాగీతగోవిందం. నారాధ నీవేలేవే రావే.... నాగిల్లిగజ్జలు జాబిల్లి వెచ్చలు నాఉట్టి కొట్టేస్తున్న రావా.... వయసు తెలిపే ఒడిలో..ఎద కరిగి తపన పెరుగు తడిలో.. మనువు కుదిరే మదిలో, ఇంకెపుడు చనువు ముదురు గదిలో.. వాలరు సందేల్లోనా,వయ్యారలే తాకేవేళా దీరసమీరే యమునాతీరే.... వలచితినే వనమాలి...ఆ ఆ ఆ గ్రామసమీపే ప్రేమకలపే... ప్రియ తగునా రసాకేళి... ఆకాశమే నాహద్దుగా, నీకోసమొచ్చ ముద్దుగా.. తెచ్చానురా ఇచ్చానురా... గిచ్చనురా నచ్చిన సొగసులు... ధీరసమిరే యమునతీరే ... వసతివనే వనమాలి... ఆ ఆ ఆ ఆ గ్రామసమీపే ప్రేమకలపే... చెలీ తగునా రసాకేళి...

30, జూన్ 2021, బుధవారం

Dharmachakram : Cheppana Cheppana Chinna Mata Song Lyrics (చెప్పనా చెప్పనా చిన్న మాట)

చిత్రం: ధర్మ చక్రం(1996)

సంగీతం: M.M.శ్రీలేఖ

సాహిత్యం: చంద్రబోస్

గానం: బాలసుబ్రహ్మణ్యం , M.M.శ్రీలేఖ 


చెప్పనా చెప్పనా చిన్న మాట చెప్పుకో చెప్పుకో ఉన్న మాట చెప్పనా చెప్పనా చిన్న మాట చెప్పుకో చెప్పుకో ఉన్న మాట హా కళ్ళలో మనసులో ఉన్న మాట కన్నులే మనసుతో చెప్పకే చెప్పుతున్న మాట చెప్పనా చెప్పనా చిన్న మాట చెప్పుకో చెప్పుకో ఉన్న మాట నువ్వు నేను ఏకమంట నాకు నువ్వు లోకమంట కళ్ళలోన ఇల్లు కట్టనా ఇలాగే తడబడి రానా భలేగా ముడిపడిపోనా వెన్నెలింట వద్దకొచ్చి కన్నెపైట కానుకిచ్చి వన్నెలన్ని అప్పగించనా ఫలించే తపనల వెంట భరించి త్వరపడమంట హో సరేలే సరసాలమ్మో స్వరాలే పలకాలమ్మో చలేసే నీరెండల్లో కన్నెగుండెలో చెప్పనా చెప్పనా చిన్న మాట చెప్పుకో చెప్పుకో ఉన్న మాట తేలిపోయే లేతఒళ్ళు వాలిపోయే చేపకళ్ళు ఆకతాయి చేయి తాకితే అదేదో తెలియని హాయి ఇదంటూ తెలిసిన హాయి అరెరె ఒద్దికైన చోటు ఉంది హద్దులేని చాటు ఉంది ముద్దులిచ్చి పొద్దుపుచ్చనా కులాసా కులుకులలోన భరోసా తెలుపగ రానా హో ఎదల్లో సరదాలయ్యో పదాలే ఎదిగేనయ్యో చలాకీ నీ సందిట్లో ఎన్ని విందులో చెప్పనా చెప్పనా చిన్న మాట చెప్పుకో చెప్పుకో ఉన్న మాట హ కళ్ళలో మనసులో ఉన్న మాట కన్నులే మనసుతో చెప్పకే చెప్పుతున్న మాట చెప్పనా చెప్పనా చిన్న మాట చెప్పుకో చెప్పుకో ఉన్న మాట