30, జూన్ 2021, బుధవారం

Dharmachakram : Cheppana Cheppana Chinna Mata Song Lyrics (చెప్పనా చెప్పనా చిన్న మాట)

చిత్రం: ధర్మ చక్రం(1996)

సంగీతం: M.M.శ్రీలేఖ

సాహిత్యం: చంద్రబోస్

గానం: బాలసుబ్రహ్మణ్యం , M.M.శ్రీలేఖ 


చెప్పనా చెప్పనా చిన్న మాట చెప్పుకో చెప్పుకో ఉన్న మాట చెప్పనా చెప్పనా చిన్న మాట చెప్పుకో చెప్పుకో ఉన్న మాట హా కళ్ళలో మనసులో ఉన్న మాట కన్నులే మనసుతో చెప్పకే చెప్పుతున్న మాట చెప్పనా చెప్పనా చిన్న మాట చెప్పుకో చెప్పుకో ఉన్న మాట నువ్వు నేను ఏకమంట నాకు నువ్వు లోకమంట కళ్ళలోన ఇల్లు కట్టనా ఇలాగే తడబడి రానా భలేగా ముడిపడిపోనా వెన్నెలింట వద్దకొచ్చి కన్నెపైట కానుకిచ్చి వన్నెలన్ని అప్పగించనా ఫలించే తపనల వెంట భరించి త్వరపడమంట హో సరేలే సరసాలమ్మో స్వరాలే పలకాలమ్మో చలేసే నీరెండల్లో కన్నెగుండెలో చెప్పనా చెప్పనా చిన్న మాట చెప్పుకో చెప్పుకో ఉన్న మాట తేలిపోయే లేతఒళ్ళు వాలిపోయే చేపకళ్ళు ఆకతాయి చేయి తాకితే అదేదో తెలియని హాయి ఇదంటూ తెలిసిన హాయి అరెరె ఒద్దికైన చోటు ఉంది హద్దులేని చాటు ఉంది ముద్దులిచ్చి పొద్దుపుచ్చనా కులాసా కులుకులలోన భరోసా తెలుపగ రానా హో ఎదల్లో సరదాలయ్యో పదాలే ఎదిగేనయ్యో చలాకీ నీ సందిట్లో ఎన్ని విందులో చెప్పనా చెప్పనా చిన్న మాట చెప్పుకో చెప్పుకో ఉన్న మాట హ కళ్ళలో మనసులో ఉన్న మాట కన్నులే మనసుతో చెప్పకే చెప్పుతున్న మాట చెప్పనా చెప్పనా చిన్న మాట చెప్పుకో చెప్పుకో ఉన్న మాట

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి