చిత్రం : దొంగ పోలీస్ (1992) సంగీతం : బప్పీలహరి గానం : జేసుదాస్, చిత్ర
పల్లవి :
ఆ పూలరంగు నీ చీర చెంగు రాశాయి నాలో గీతాలు ఏవో నే పాడుకుంటానులే రాగాల లోగిళ్లలో అనురాగాల వాకిళ్లలో ఓ తేనె దొంగ నా సామిరంగ పుట్టాను నీకై పూసాను పూవై నీ వెంట ఉంటానులే నీ దాననౌతానులే మరి నీలోని గీతాన్నిలే సరి సరి గరిగపద... సరి సరి గరిగపద... చరణం : 1 పుసుపుగ విరిసిన పూవులు తలపై కురిసెను పలికెను ఉండాలనీ పచ్చగా... హోయ్ ఎర్రగ విరిసిన పూవులు ఎదపై కురిసెను పలికెను ఉండాలనీ ప్రేమతో... ఆ రంగుతోటి ఈ రంగు కలిసే నీ కాళ్ల పారాణిగా నా కళ్లలో రాణిగా... నా కళ్లలో రాణిగా... ఓ తేనె దొంగ నా సామిరంగ పుట్టాను నీకై పూసాను పూవై నే....పాడుకుంటానులే రాగాల లోగిళ్లలో అనురాగాల వాకిళ్లలో చరణం : 2 కలిసిన కనులకే తెలియును వలపుల మలుపుల సొగసులు ఏ ప్రేమబంధాలివో... నడిచిన అడుగులే కలుపును మనుసును మనసును ఒకటిగా ఏ రాగబంధాలివో... ఆ బంధమేదో అనుబంధమేదో పాడాలి భూపాలమై... అందానికే మూలమై అందానికే మూలమై ఆ పూలరంగు నీ చీర చెంగు రాశాయి నాలో గీతాలు ఏవో నే పాడుకుంటానులే రాగాల లోగిళ్లలో అనురాగాల వాకిళ్లలో