24, జూన్ 2021, గురువారం

Donga Police : Aa Poola Rangu Nee Cheera Chengu song lyrics (ఆ పూలరంగు నీ చీర చెంగు)


చిత్రం : దొంగ పోలీస్ (1992) సంగీతం : బప్పీలహరి గానం : జేసుదాస్, చిత్ర


 పల్లవి :

ఆ పూలరంగు నీ చీర చెంగు రాశాయి నాలో గీతాలు ఏవో నే పాడుకుంటానులే రాగాల లోగిళ్లలో అనురాగాల వాకిళ్లలో ఓ తేనె దొంగ నా సామిరంగ పుట్టాను నీకై పూసాను పూవై నీ వెంట ఉంటానులే  నీ దాననౌతానులే మరి నీలోని గీతాన్నిలే సరి సరి గరిగపద... సరి సరి గరిగపద... చరణం : 1 పుసుపుగ విరిసిన పూవులు తలపై కురిసెను పలికెను ఉండాలనీ పచ్చగా... హోయ్ ఎర్రగ విరిసిన పూవులు ఎదపై కురిసెను పలికెను ఉండాలనీ ప్రేమతో... ఆ రంగుతోటి ఈ రంగు కలిసే  నీ కాళ్ల పారాణిగా నా కళ్లలో రాణిగా...  నా కళ్లలో రాణిగా... ఓ తేనె దొంగ నా సామిరంగ పుట్టాను నీకై పూసాను పూవై నే....పాడుకుంటానులే రాగాల లోగిళ్లలో అనురాగాల వాకిళ్లలో చరణం : 2 కలిసిన కనులకే తెలియును వలపుల మలుపుల సొగసులు ఏ ప్రేమబంధాలివో... నడిచిన అడుగులే కలుపును మనుసును మనసును ఒకటిగా ఏ రాగబంధాలివో... ఆ బంధమేదో అనుబంధమేదో పాడాలి భూపాలమై... అందానికే మూలమై  అందానికే మూలమై ఆ పూలరంగు నీ చీర చెంగు రాశాయి నాలో గీతాలు ఏవో నే పాడుకుంటానులే రాగాల లోగిళ్లలో అనురాగాల వాకిళ్లలో

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి