Ee Abbai Chala Manchodu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Ee Abbai Chala Manchodu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

23, డిసెంబర్ 2023, శనివారం

Ee Abbayi Chala Manchodu - Oh Sari Song Lyrics (ఓ సారి నీ చెయ్యే తాకి )

చిత్రం: ఈ అబ్బాయి చాలా మంచోడు (2003)

రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర

సంగీతం: ఎం. ఎం. కీరవాణి



ఓ సారి నీ చెయ్యే తాకి ఓ సారి నీ చెంపే నొక్కి ఓ సారి ఇంకేదో చెయ్యాల ఓ సారి నీ కాలే తొక్కి ఓ సారి నీ ఒళ్ళే రక్కి ఓ సారి ఏదేదో కావాల పొగరే దిగనీ సొగసే కందనీ అనుభూతి మనదైన వేళ ఓ సారి నీ చెయ్యే తాకి ఓ సారి నీ చెంపే నొక్కి ఓ సారి ఇంకేదో చెయ్యాల ముద్దాడనా.. పెదవిని వలదని నడుమును ముద్దాడుకో వాటేయ్యనా.. ఎదురుగ వలదని వెనకగ వాటేసుకో చిన్నంగ నీ చెవిని స్పృశియించనా నున్నంగా నీ వేళ్ళు నిమిరేయనా ఆ పై లంఖించి విజృంభించితి వరించనా నిదురా వద్దులే బెదురా లేదులే చూడాలి శృంగార మేళ ఓ సారి నీ చెయ్యే తాకి ఓ సారి నీ చెంపే నొక్కి ఓ సారి ఇంకేదో చెయ్యాల వేధించనా.. సరసవు సగమున విడిపడి వేధించుకో వడ్డించనా.. అడగని క్షణమున ఎగబడి వడ్డించుకో నా పట్టు వస్త్రాలు వదిలెయ్యనా నీ గట్టి ఒత్తిళ్ళు తరియించనా అంతా అయిపోతే తెగ సిగ్గేసి తల వంచనా వ్రతమే చెడనీ ఫలమే అందనీ చేరాలి స్వర్గాల మూల ఓ సారి నీ చెయ్యే తాకి ఓ సారి నీ చెంపే నొక్కి ఓ సారి ఇంకేదో చెయ్యాల ఓ సారి నీ కాలే తొక్కి ఓ సారి నీ ఒళ్ళే రక్కి ఓ సారి ఏదేదో కావాల



26, జూన్ 2021, శనివారం

Ee Abbayi Chala Manchodu : Chandamama Kadhalo Chadiva Song Lyrics (చందమామ కథలో )

చిత్రం: ఈ అబ్బాయి చాలా మంచోడు (2003)

సంగీతం: M.M.కీరవాణి

గానం: కళ్యాణి మాలిక్, సునీత


పల్లవి:


చందమామ కథలో చదివా రెక్కల గుర్రాలుంటాయని

నమ్మడానికి ఎంత బాగుందో !!

బాలమిత్ర కథలో చదివా పగడపు దీవులు ఉంటాయని

నమ్మడానికి ఎంత బాగుందో !!

నాకోసం రెక్కల గుర్రం ఎక్కివస్తావని

పగడపు దీవికి నువ్వే నన్ను తీసుకెళ్తావని

ఇక ఏనాటికీ అక్కడే మనము ఉంటామనీ

నమ్మడానికి ఎంత బాగుందో (2)


నువ్వే నాకు ముద్దొస్తావనీ

నేనే నీకు ముద్దిస్తాననీ

నమ్మడానికి ఎంత బాగుందో (2)


చరణం1:


వరహాల బాటలోన రతనాల తోటలోన

వజ్రాల మేడలోన బంగరు గదిలోన

విరితేనెల్లో పాలల్లో తానాలాడేసి

నెలవంకల్లో వెన్నెల్లే భోంచేసి

నలుదిక్కుల్లో చుక్కల్లే చిలకలు చుట్టేసి

చిలకే కొరికి దరికే జరిగి మురిపెం పెరిగి


మరి నువ్వే నాకు ముద్దిస్తావనీ

ముద్దుల్లోన ముద్దౌతాననీ

నమ్మడానికి ఎంత బాగుందో (2)


చందమామ కథలో చదివా రెక్కల గుర్రాలుంటాయని

నమ్మడానికి ఎంత బాగుందో (2)


చరణం2:


ఎగిరేటి ఏనుగొచ్చి పలికేటి జింకలొచ్చి

నడిచేటి చేపలొచ్చి అడవికి రమ్మనగా

ఆ కోనల్లో కొమ్మల్లో ఉయ్యాలూగేసి

ఆ కొమ్మల్లో పళ్ళన్నీ రుచిచూసి

అహ కళ్ళల్లో మైకంతో మోహం కమ్మేసి

చలిగా గిలిగా తొలిగా త్వరగా అటుగా ఇటుగా 


మరి నువ్వే నాకు ముద్దిస్తావనీ

తడివేదాలు ముద్రిస్తావనీ

నమ్మడానికి ఎంత బాగుందో


నీకోసం రెక్కల గుర్రం ఎక్కివస్తానని

పగడపు దీవికి నిన్నే నేను తీసుకెళ్తానని

ఇక ఏనాటికీ అక్కడే మనము ఉంటామనీ

నమ్మడానికి ఎంత బాగుందో (2)