Gudumba Shankar లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Gudumba Shankar లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

11, నవంబర్ 2021, గురువారం

Gudumba Shankar : Emantaro Song Lyrics (ఏమంటారో )

చిత్రం: గుడుంబా శంకర్ (2008)

రచన: చంద్ర బోస్

గానం: యస్.పి.చరణ్, హరిణి

సంగీతం: మణి శర్మ


ఏమంటారో నాకు నీకున్న ఇదినీ.. ఏమంటారో నువు నేనైన అదినీ.. ఏమంటారో.. మారిపోతున్న కథనీ.. ఏమంటారో.. జారిపోతున్న మదినీ.. చూసె పెదవినీ మాటాడే కనులనీ.. నవ్వే నడకనీ కనిపించే శ్వాసనీ.. ఇచ్చి పుచ్చుకున్న మనసుని.. ఇద అద యద విధ మరి..  ఏమంటారో నాకు నీకున్న ఇదినీ.. ఏమంటారో నువు నేనైన అదినీ.. ఏమంటారో మారిపోతున్న కథనీ.. ఏమంటారో జారిపోతున్న మదినీ.. ఎదురుగ వెలుగుతున్న నీడనీ.. బెదురుగ కలుగుతున్న హాయినీ.. తనువున తునుకుతున్న చురుకునీ.. మనసున ముసురుకున్న చెమటనీ.. ఇష్ట కష్టాలని ఏమంటారొ ఇపుడేమంటారో.. ఈ మోహమాటాలని ఏమంటారొ మరి ఎమంటారో.. స్వల్ప భారాలని ఏమంటారో ఇపుడేమంటారో.. సమీప దూరాలని ఏమంటారో అసలేమంటారొ.. జారె నింగిని దొరలాంటీ దొంగనీ.. పాడె కొంగునీ పరిమలించే రంగునీ.. పొంగుతున్న సుధా గంగని .. ఇద అద అదె ఇద మరి.. ఏమంటారో మారిపొతున్న కథనీ.. ఏమంటారో జారిపోతున్న మదినీ.. జాబిలై తలుకుమన్న చుక్కనీ.. బాధ్యతై దొరుకుతున్న హక్కునీ..హెయ్ హెయ్.. దేవుడై ఎదుగుతున్న భక్తునీ.. సూత్రమై బిగయనున్న సాక్షినీ.. పాతలొ కొత్తనీ ఇపుడేమంటారో.. పోట్లాటలొ శాంతిని మరి ఏమంటారో.. తప్పులొ ఒప్పునీ ఏమంటారొ ఇపుడేమంటారో.. గత జన్మలొ అప్పుని ఏమంటారొ అసలేమంటారొ.. నాలొ నువ్వుని ఇక నీలొ నేనునీ.. మాకెమేమనీ మన దారె మనదనీ.. రాసుకున్న ఆత్మ చరితనీ అద ఇద ఇదె అద మరి..  ఏమంటారో నాకు నీకున్న ఇదినీ.. ఏమంటారో నువు నేనైన అదినీ.. ఏమంటారో మారిపొతున్న కథనీ.. ఏమంటారో జారిపొతున్న మదినీ..

4, జులై 2021, ఆదివారం

Gudumba Shankar : Chitti Nadumune Song Lyrics (చిట్టి నడుమునే చూస్తున్నా)

చిత్రం: గుడుంబా శంకర్(2013)

సంగీతం: మణి శర్మ

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: మల్లికార్జున్, ప్రేమజీ అమరన్ 


చిట్టి నడుమునే చూస్తున్నా

చిత్రహింసలో చస్తున్నా

కంటపడదు ఇక ఎదురేమున్నా

చుట్టుపక్కలేమవుతున్నా గుర్తుపట్టనే లేకున్నా

చెవిన పడదు ఎవరేమంటున్నా

నడుమే ముడుమై నను పట్టుకుంటే జాణ

అడుగే పడదే ఇక ఎటుపోదామన్నా

ఆ మడతలో మహిమేమిటో వెతకాలి తొంగి చూసైనా

ఆ నునుపులో పదునేమిటో తేల్చాలి తప్పు చేసైనా


నంగనాచిలా నడుమూపి

నల్లతాచులా జడచూపి

తాకిచూస్తే కాటేస్తానంది

చీమలాగ తెగ కుడుతుంది

పాములాగ పగ బడుతుంది

కళ్ళు మూసిన ఎదరే ఉందీ

తీరా చూస్తే నలకంత నల్లపూస

ఆరా తీస్తే నను నమిలేసే ఆశ

కన్నెర్రగా కందిందిలా నడుమోంపుల్లో నలిగి

ఈ తికమక తేలేదెలా ఆ సొంపుల్లో మునిగి


ఎన్ని తిట్టినా వింటానే

కాల తన్నినా పడతానే

నడుము తడమనీ నన్నొకసారి

ఉరిమి చూసినా ఓకేనే

ఉరే వేసినా కాదననే

తొడిమి చిదిమి చెబుతానే సారీ

హాయిరే హాయిరే ఏ ప్రాణ హాని రానీ

హాయిరే హాయిరే ఇక ఏమైనా కానీ

నిను నిమరక నా పుట్టుక పూర్తవదు కదా అలివేణి

ఆ కోరిక కడ తీరగా మరు జన్మ ఎందుకే రాణీ

Gudumba Shankar : Chiguraku Chatu Song Lyrics (చిగురాకు చాటు చిలక)

చిత్రం: గుడుంబా శంకర్(2013)

సంగీతం: మణి శర్మ

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: S.P.చరణ్,సునీత



చిగురాకు చాటు చిలక ఈ అలజడి ప్రేమేగా 

అలవాటు లేదు గనక మది సులువుగ నమ్మదుగా 

చిగురాకు చాటు చిలక తను నడవద ధీమాగా 

అనుకోని దారి గనక ఈ తికమక తప్పదుగా 

తను కూడా నాలాగా అనుకుంటే మేలేగా 

అయితే అది తేలనిదే అడుగుపడదుగా 

సరికొత్తగ నా వంక చూస్తోందే చిత్రంగా 

ఏమైందో స్పష్టంగా బయట పడదుగా 

చిగురాకు చాటు చిలక ఈ అలజడి ప్రేమేగా 

అలవాటు లేదు గనక మది సులువుగ నమ్మదుగా 


చెప్పకు అంటూ చెప్పమంటూ చర్చ తేలేనా 

తప్పనుకుంటూ తప్పదంటూ తర్కమాగేనా 

సంగతి చూస్తూ జాలి వేస్తూ కదలలేకున్నా 

తేలని గుట్టు తేనెపట్టు కదపలేకున్నా 

వణికే నా పెదవుల్లో తొణికే తడిపిలుపేదో 

నాకే సరిగా ఇంకా తెలియకున్నది 

తనలో తను ఏదేదో గొణిగి ఆ కబురేదో 

ఆ వైనం మౌనంలో మునిగి ఉన్నది 

చిగురాకు చాటు చిలక ఈ అలజడి ప్రేమేగా 

అనుకోని దారి గనక ఈ తికమక తప్పదుగా 


ఎక్కడి నుంచో మధురగానం మదిని మీటింది 

ఇక్కడి నుంచే నీ ప్రయాణం మొదలు అంటోంది 

గలగల వీచే పిల్లగాలి ఎందుకాగింది 

కొంపలు ముంచే తుఫానొచ్చే సూచనేమో ఇది 

వేరే ఏదో లోకం చేరే ఊహల వేగం 

ఏదో తీయని మైకం పెంచుతున్నది 

దారే తెలియని దూరం తీరే తెలపని తీరం 

తనలో కలవరమేదో రేపుతున్నది 

చిగురాకు చాటు చిలక ఈ అలజడి ప్రేమేగా 

అలవాటు లేదు గనక మది సులువుగ నమ్మదుగా 

చిగురాకు చాటు చిలక తను నడవద ధీమాగా 

అనుకోని దారి గనక ఈ తికమక తప్పదుగా 

తను కూడా నా లాగా అనుకుంటే మేలేగా అయితే అది తేలనిదే అడుగుపడదుగా 

సరికొత్తగ నా వంక చూస్తోందే చిత్రంగా 

ఏమైందో స్పష్టంగా బయట పడదుగా