చిత్రం: గుడుంబా శంకర్(2013)
సంగీతం: మణి శర్మ
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం: మల్లికార్జున్, ప్రేమజీ అమరన్
చిట్టి నడుమునే చూస్తున్నా
చిత్రహింసలో చస్తున్నా
కంటపడదు ఇక ఎదురేమున్నా
చుట్టుపక్కలేమవుతున్నా గుర్తుపట్టనే లేకున్నా
చెవిన పడదు ఎవరేమంటున్నా
నడుమే ముడుమై నను పట్టుకుంటే జాణ
అడుగే పడదే ఇక ఎటుపోదామన్నా
ఆ మడతలో మహిమేమిటో వెతకాలి తొంగి చూసైనా
ఆ నునుపులో పదునేమిటో తేల్చాలి తప్పు చేసైనా
నంగనాచిలా నడుమూపి
నల్లతాచులా జడచూపి
తాకిచూస్తే కాటేస్తానంది
చీమలాగ తెగ కుడుతుంది
పాములాగ పగ బడుతుంది
కళ్ళు మూసిన ఎదరే ఉందీ
తీరా చూస్తే నలకంత నల్లపూస
ఆరా తీస్తే నను నమిలేసే ఆశ
కన్నెర్రగా కందిందిలా నడుమోంపుల్లో నలిగి
ఈ తికమక తేలేదెలా ఆ సొంపుల్లో మునిగి
ఎన్ని తిట్టినా వింటానే
కాల తన్నినా పడతానే
నడుము తడమనీ నన్నొకసారి
ఉరిమి చూసినా ఓకేనే
ఉరే వేసినా కాదననే
తొడిమి చిదిమి చెబుతానే సారీ
హాయిరే హాయిరే ఏ ప్రాణ హాని రానీ
హాయిరే హాయిరే ఇక ఏమైనా కానీ
నిను నిమరక నా పుట్టుక పూర్తవదు కదా అలివేణి
ఆ కోరిక కడ తీరగా మరు జన్మ ఎందుకే రాణీ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి