చిత్రం: గులాబీ(1995)
రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం: శశి ప్రీతమ్
సంగీతం: శశి ప్రీతమ్
ఏ రోజైతే చూశానో నిన్ను ఆ రోజే నువ్వైపొయా నేను ఏ రోజైతే చూశానో నిన్ను ఆ రోజే నువ్వైపొయా నేను కాలం కాదన్నా, ఏ దూరం అడ్డున్నా నీ ఊపిరినై నే జీవిస్తున్నాను... నీ స్పర్శే ఈ వీచే గాలుల్లో నీ రూపే నా వేచె గుండెల్లో నిన్నటి నీ స్ర్ముతులే, నన్ను నడిపిస్తూ ఉంటే ఆ నీ నీడై వస్తా నువెటువైపున్నా... నీ కష్టం లో నేను ఉన్నానూ కరిగే నీ కన్నీరవుతానూ చెంపల్లో జారి, నీ గుండెల్లో చేరి నీ ఏకాంతం లో ఓదార్పవుతానూ... కాలం ఏదో గాయం చేసిందీ, నిన్నే మాయం చేసానంటుందీ లోకం నమ్మి అయ్యో అంటుంది, శొకం కమ్మి జోకడతా అంది గాయం కోస్తున్నా, నే జీవించే ఉన్నా ఆ జీవం నీవని సాక్షమ్నిస్తున్నా... నీతో గడిపిన ఆ నిమిషాలన్నీ నాలో మోగే గుండెల సవ్వడులే అవి చెరిగాయాంటే, నే నమ్మేదెట్టా గా నువు లేకుంటే నేనంటు ఉండను గా... నీ స్పర్శే ఈ వీచే గాలుల్లో నీ రూపే నా వేచె గుండెల్లో నిన్నటి నీ స్ర్ముతులే, నన్ను నడిపిస్తూ ఉంటే ఆ నీ నీడై వస్తా నువెటువైపున్నా... నీ కష్టం లో నేను ఉన్నానూ కరిగే నీ కన్నీరవుతానూ చెంపల్లో జారి, నీ గుండెల్లో చేరి నీ ఏకాంతం లో ఓదార్పవుతానూ...