17, జులై 2021, శనివారం

Gulabi : Ee Velalo Neevu Video Song Lyrics (ఈ వేళ లో నీవు ఏం చేస్తూ ఉంటావో)

చిత్రం: గులాబీ(1995)

రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: సునీత

సంగీతం: శశి ప్రీతమ్



ఈ వేళ లో నీవు ఏం చేస్తూ ఉంటావో అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషమూ నేను నా గుండె ఏనాడో చేజారిపోయింది నీ నీడగా మారి నా వైపు రానంది దూరాన ఉంటూనే ఏం మాయ చేశావో ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషమూ నేను నడి రేయిలో నీవు నిదరైనా రానీవు గడిపేదెలా కాలము గడిపేదెలా కాలము పగలైనా కాసేపు పని చేసుకోనీవు నీ మీదనే ధ్యానము నీ మీదనే ధ్యానము ఏ వైపు చూస్తున్నా నీ రూపే తోచింది నువ్వు కాక వేరేది కనిపించనంటోంది ఈ ఇంద్రజాలాన్ని నీవేనా చేసేంది నీ పేరులో ఏదో ప్రియమైన కైపుంది నీ మాట వింటూనే ఏం తోచనీకుంది నీ మీద ఆశేదో నను నిలవనీకుంది మతి పోయి నేనుంటే నువు నవ్వుకుంటావు ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషమూ నేను ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి