చిత్రం : ఇడియట్ (2002)
సంగీతం: చక్రి
సాహిత్యం: భాస్కరభట్ల రవి కుమార్
గానం: ఉదిత్ నారాయణ్, కౌసల్య
లేలేత నవ్వుల పింగాణి బొమ్మల అందాలు అందితే అల్లుకోనా బాగుంది వెన్నెల కూ అంది కోయిల కౌగిళ్ళలో నిన్ను హత్తుకోనా ఏలో ఏలో ప్రేమా సరసాల సత్యభామ కోలో కోలో రామా నువ్వేలే కోనసీమ రంగేళి రూపమా బంగాళఖాతమా ఊరించి చేయకే హైరానా లేలేత నవ్వుల పింగాణి బొమ్మల అందాలు అందితే అల్లుకోనా బాగుంది వెన్నెల కూ అంది కోయిల కౌగిళ్ళలో నిన్ను హత్తుకోనా ఎట్టా దాచావో కాని ఇన్నాళ్ళుగా దోచుకుంటా ఇచ్చేయి దోరగా ఒళ్ళే వేడేక్కిఉంది చాన్నాళ్ళుగా అది చేసింది ఎంత చొరవ ఒడి చేరమంటు పిలిచింది ఆడతనమా నిను చూసినాక నా మనసు ఆపతరమా నీ కాలి మువ్వనైపోనా నువ్వు ఊగేటి ఊయలై రానా నీ పూలపక్కనైపోనా తమలపాకుల్లో వక్కనైరానా గోదారి తీరమా మంజీర నాదమా కవ్వింతలెందుకే హైరామా లేలేత నవ్వుల పింగాణి బొమ్మల అందాలు అందితే అల్లుకోనా బాగుంది వెన్నెల కూ అంది కోయిల కౌగిళ్ళలో నిన్ను హత్తుకోనా లిల్లీ పువ్వంటి సోకు నాదేనుగా మరి గిల్లి గిచ్చేయి తేరగా అగ్గే రేగింది నాలో చూసావుగా అది చేసింది ఎంత గొడవ చిరు చీకటింట చేరాలి కొంటెతనమా దరిచేరినాక పులకించు పూలవనమా నీ గోటి గాటునైపోనా మరి నీ గుండె గూటికే రానా ఆ గోరువంకనైపోనా చెలి ఈ వాగువంకనై రానా నాలోని భాగమా ఆ నీలి మేఘమా ఇచ్చాక ఎందుకో హైరానా లేలేత నవ్వుల పింగాణి బొమ్మల అందాలు అందితే అల్లుకోనా బాగుంది వెన్నెల కూ అంది కోయిల కౌగిళ్ళలో నిన్ను హత్తుకోనా ఏలో ఏలో ప్రేమా సరసాల సత్యభామ కోలో కోలో రామా నువ్వేలే కోనసీమ రంగేళి రూపమా బంగాళఖాతమా ఊరించి చేయకే హైరానా లేలేత నవ్వుల పింగాణి బొమ్మల అందాలు అందితే అల్లుకోనా బాగుంది వెన్నెల కూ అంది కోయిల కౌగిళ్ళలో నిన్ను హత్తుకోనా singers: udit narayan, kousalya