Intinti Ramayanam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Intinti Ramayanam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

18, ఆగస్టు 2021, బుధవారం

Inti Inti Ramayanam : Veena Venuvaina Song Lyrics (వీణ వేణువైన సరిగమ విన్నావా...)

చిత్రం: ఇంటింటి రామాయణం (1979)

సంగీతం: రాజన్ - నాగేంద్ర

సాహిత్యం: వేటూరి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి



వీణ వేణువైన సరిగమ విన్నావా... ఓ.. తీగ రాగమైన మధురిమ కన్నావా.. తనువు తహ తహలాడాల.. చెలరేగాల..చెలి ఊగాల ఉయ్యాలలీవేళలో వీణ వేణువైన సరిగమ విన్నావా... ఓ.. తీగ రాగమైన మధురిమ కన్నావా.. ఊపిరి తగిలిన వేళ .. నీ వొంపులు తిరిగిన వేళ ..

నా వీణ నీ వేణువే.. పలికే రాగమాల ఆ...ఆ... ల ల లా....ఆ... సోకులు రగిలిన వేళ ..ఆ.. చుక్కలు వెలిగిన వేళ ..లో

తనువులో అణువణువున జరిగే రాసలీల వీణ వేణువైన సరిగమ విన్నావా... ఓ.. తీగ రాగమైన మధురిమ కన్నావా..

యెదలో అందం యెదుట .. యెదుటే వలచిన వనిత..

నీ రాకతొ నా తోటలో వెలసే వనదేవత.. ఆ...ఆ... ల ల లా....ఆ... కదిలే అందం కవిత.. అది కౌగిలికొస్తే యువత ..

నా పాటలొ నీ పల్లవే నవత నవ్య మమత వీణ వేణువైన సరిగమ విన్నావా... ఓ.. తీగ రాగమైన మధురిమ కన్నావా.. తనువు తహ తహలాడాల.. చెలరేగాల..చెలి ఊగాల ఉయ్యాలలీవేళలో వీణ వేణువైన సరిగమ విన్నావా... ఓ.. తీగ రాగమైన మధురిమ కన్నావా..

Inti Inti Ramayanam : Mallelu Poose Song Lyrics (మల్లెలు పూసే..)

చిత్రం: ఇంటింటి రామాయణం (1979)

సంగీతం: రాజన్ - నాగేంద్ర

సాహిత్యం: వేటూరి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం




మల్లెలు పూసే.. వెన్నెల కాసే.. ఈ రేయి హాయిగా.. మల్లెలు పూసే వెన్నెల కాసే ఈ రేయి హాయిగా.. మల్లెలు పూసే వెన్నెల కాసే ఈ రేయి హాయిగా.. మమతలు వేయిగ పెనవేయి నన్ను తీయగా.. మల్లెలు పూసే వెన్నెల కాసే ఈ రేయి హాయిగా.. ముసి ముసి నవ్వులలో గుస గుస లాడినవే.. నా తొలి మోజులే నీ విరజాజులై.. ముసి ముసి నవ్వులలో గుస గుస లాడినవే.. నా తొలి మోజులే నీ విరజాజులై.. మిస మిస వన్నెలలో మిల మిల మన్నవిలే నీ బిగి కౌగిలిలో జాబిలి రాత్రులే.. కాటుకలంటుకున్న కౌగిలింత లెంత వింతలె.. మనసులు పాడే మంతనమాడే ఈ పూట జంటగా.. మమతలు వేయిగా పెనవేయి నన్ను తీయగా.. మల్లెలు పూసే వెన్నెల కాసే ఈ రేయి హాయిగా.. తొలకరి కోరికలే తొందర చేసినవే ఈ విరి శయ్యకే ఆవిరి తీరగా.. తొలకరి కోరికలే తొందర చేసినవే ఈ విరి శ య్యకే ఆవిరి తీరగా.. సొగసరి కానుకలే సొద పెడుతున్నవిలే యే తెర చాటునో ఆ చెర వీడగా.. అందిన పొందులోనే అందలేని విందులేయవే.. కలలిక పండే కలయిక నేడే కావాలి వేయిగా.. మమతలు వేయిగా పెనవేయి నన్ను తీయగా.. మల్లెలు పూసే వెన్నెల కాసే ఈ రేయి హాయిగా.. మమతలు వేయిగా పెనవేయి నన్ను తీయగా.. మల్లెలు పూసే వెన్నెల కాసే ఈ రేయి హాయిగా..