Jayam Manade Raa లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Jayam Manade Raa లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

23, మే 2022, సోమవారం

Jayam Manade Raa : Pelliki Bajha Mogindi Song Lyrics (పెళ్లికి బాజా మోగింది)

చిత్రం: జయం మనదే రా.. (2000)

సాహిత్యం: చంద్రబోస్

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కవిత కృష్ణమూర్తి

సంగీతం: వందేమాతరం శ్రీనివాస్



పెళ్లికి బాజా మోగింది కుమారి శ్రీమతి కానుంది పెళ్లికి బాజా మోగింది కుమారి శ్రీమతి కానుంది పట్టుపంచెకి పైట కొంగుకి ముడి పెట్టె గడియే ముందున్నది పందిట్లో వేలు పట్టేసేయ్ వచ్చై మెల్లోన మాలవేసేయ్ అందరిలో తాళి కట్టేసేయ్ మెచ్చై ఇల్లాలి పదవీ ఇచ్చయ్ పెళ్లికి బాజా మోగింది కుమారి శ్రీమతి కానుంది తాబుంలం తేగా తాపలే తుగా రావయ్య రావయ్య రావయ్య బావయ్య వడానం లాగ వాటేస్తా బాగా దానమ్మ దానమ్మ దానమ్మ దానిమ్మ కొక గల్లలో శుభలేఖలు రాసేస్తా ఈడు గుమ్మలో ఏడడుగు నడిపిస్తా వయ్యారం వరకట్నంలా ఇస్తా నీ వెనుకె వస్తా మెలలు కాలు పెట్టెసై హామ్ హాయ్ నా మనసు డోలు కొట్టై దినుకు దీనదీనతా మిడిదింట్లో కూత వేసేసై హాయ్ హాయ్ నా వయసు మోత మోసేయ్ ఓయ్… పెళ్లికి బాజా మోగింది కుమారి శ్రీమతి కానుంది అబ్బబ్బా హాయి అచ్చోచ్చే రేయి ఆరెయి ఆరెయి ఆరెయి అందాలే అందిస్తా చెయ్యి ఆడిస్తానోయి తోడేయి తోడేయి తోడేయి నా ఈడే పంటి ఘాటులో నీ పంటె పండిస్తా గోపి గుర్తులో నా ఓటె నీకెస్తా హేయ్ సొయగమే వండే వార్చే వంట శోభనమేనంటా నా కాలికి మెట్టెలు పెట్టెసేయ్ వచ్చే నా ఇంటిపేరు మార్చేయ్ నా వంటికి జోలలు కొట్టేసేయ్ విచ్చేయ్ నన్నింటివాన్ని చేసేయ్ పెళ్లికి బాజా మోగింది కుమారి శ్రీమతి కానుంది పెళ్లికి బాజా మోగింది కుమారి శ్రీమతి కానుంది పట్టుపంచెకి పైట కొంగుకి ముడి పెట్టె గడియే ముందున్నది పందిట్లో వేలు పట్టేసేయ్ వచ్చై మెల్లోన మాలవేసేయ్ అందరిలో తాళి కట్టేసేయ్ మెచ్చై ఇల్లాలి పదవీ ఇచ్చయ్ పెళ్లికి బాజా మోగింది కుమారి శ్రీమతి కానుంది

10, జులై 2021, శనివారం

Jayam Manade Raa : Chinni Chinni Asalanni Song Lyrics (చిన్ని చిన్ని ఆశలన్నీ)

చిత్రం: జయం మనదే రా.. (2000)

సాహిత్యం: కలేకూరి ప్రసాద్

గానం: వందేమాతరం శ్రీనివాస్

సంగీతం: వందేమాతరం శ్రీనివాస్


చిన్ని చిన్ని ఆశలన్నీ చిందులేసెనే

కమ్మనైన మనసులన్నీ కలిసి ఆడెనే ॥చిన్ని॥

ఊరు వాడ కలిసి జాతరయ్యి వచ్చెనే

తోడు నీడ కలిసి మహదేవుడయ్యెనే

ఆనందము ఆకాశము

సందడై సంద్రమై ఉప్పొంగెనే ॥చిన్ని॥


చరణం : 1

నీ చూపులు మా పల్లెలో తొలిగించు భేదాలు

నీ నవ్వులు మా గొంతులో పలికించు వేదాలు

చుట్టమయ్యి వస్తాడు పిలవంగ తలవంగ

పండగై ఉంటాడు ఆడంగ పాడంగ

కలగలిసి ఉండాలి దండుగా

కడదాక ఉంటాను అండగా

సాగరా చాటరా జయం మనదేరా! ॥చిన్ని॥


చరణం : 2

పంటలతో నేల తల్లి పొంగెనే

సంపదతో పల్లెలన్నీ నిండెనే

సాగరా చాటరా జయం మనదేరా!

లల్లలాల లాలెలల్లా లాలెలల్లల్లే

నానా నాలె లాలె లాల్లలల్లల్లా

24, జూన్ 2021, గురువారం

Jayam Manade Raa : Meriseti Jaabili Nuvve Song Lyrics (మెరిసేటి జాబిలి నువ్వే కురిసేటి వెన్నెల నువ్వే)

చిత్రం: జయం మనదే రా.. (2000)

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: కుమార్ సాను, స్వర్ణలత

సంగీతం: వందేమాతరం శ్రీనివాస్



మెరిసేటి జాబిలి నువ్వే కురిసేటి వెన్నెల నువ్వే

నా గుండెల చప్పుడు నువ్వే

ఓ మై ఓ మై లవ్ నను లవ్ లో దించేశావ్

మనసైన వాడివి నువ్వే ప్రియమైన తోడువి నువ్వే

నా కన్నుల కాంతివి నువ్వే

ఓ మై ఓ మై లవ్ నను మైమరపించేశావ్

ఓ మై ఓ మై లవ్ టెల్ మీ టెల్ మీ నౌ

నా మీదుండే లవ్ ఏమిటంటుంది  ఏమేమి అడిగింది

ప్రేమ ఇమ్మంది ప్రేమందుకోమంది

మెరిసేటి జాబిలి నువ్వే కురిసేటి వెన్నెల నువ్వే

నా గుండెల చప్పుడు నువ్వే

ఓ మై ఓ మై లవ్ నను లవ్ లో దించేశావ్



అల్లుకో బంధమా 

ఒంటరి అల్లరి తీరేలా జతకానా జవరాలా

ఆదుకో ప్రణయమా 

తుంటరి ఈడుని ఈ వేళ ఓదార్చనా ప్రియురాలా

నా ఆశలన్ని నీ కోసమంటూ నీ దారి చూడని

నా శ్వాసలోని రాగాలు అన్ని నీ పేరు పాడనీ

మసక చీకట్లలో నా మనసు అందించనీ

ఓ మై ఓ మై లవ్ టెల్ మీ టెల్ మీ నౌ

నా మీదుండే లవ్ ఏమిటంటుంది ఏమేమి అడిగింది

ప్రేమ ఇమ్మంది ప్రేమందుకోమంది


మనసైన వాడివి నువ్వే ప్రియమైన తోడువి నువ్వే

నా కన్నుల కాంతివి నువ్వే

ఓ మై ఓ మై లవ్ నను మైమరపించేశావ్



కలిసిరా అందమా 

చుక్కల వీధిన విహరిద్దాం స్వర్గాలను చూసొద్దాం

కరగవే సందేహమా 

చక్కగ దొరికెను అవకాశం సరదాగా తిరిగొద్దాం

నీ వాలు కనులు నా పైన వాలి నను మేలుకొలపనీ

నీ వేలి కొనల నా మేను తాకి వీణల్లే మీటని

వయసు వాకిళ్లలో తొలి వలపు వెలిగించనీ

ఓ మై ఓ మై లవ్ టెల్ మీ టెల్ మీ నౌ

నా మీదుండే లవ్ ఏమిటంటుంది ఏమేమి అడిగింది

ప్రేమ ఇమ్మంది ప్రేమందుకోమంది

మెరిసేటి జాబిలి నువ్వే కురిసేటి వెన్నెల నువ్వే

నా గుండెల చప్పుడు నువ్వే

ఓ మై ఓ మై లవ్ నను లవ్ లో దించేశావ్

ఓ మై ఓ మై లవ్ టెల్ మీ టెల్ మీ నౌ

నా మీదుండే లవ్ ఏమిటంటుంది ఏమేమి అడిగింది

ప్రేమ ఇమ్మంది ప్రేమందుకోమంది