చిత్రం: జేబు దొంగ (1975)
సంగీతం: చక్రవర్తి
గాయకులు: ఎస్.పి. బాలసుబ్రమణ్యం, పి. సుశీల
రచన: ఆచార్య ఆత్రేయ
పల్లవి :
గోవిందా గోవిందా గుట్టుకాస్తా గోవిందా
లడ్డులాంటి పడుచు పిల్ల... అహ..లడ్డులాంటి పడుచుపిల్ల...
అర్ధరాత్రి దొరికిందంటే.. అంత కన్నా షోకుందా...
ఇంత కన్నా ఛాన్సుందా...అంత కన్నా షోకుందా...
ఇంత కన్నా ఛాన్సుందా...అంత కన్నా షోకుందా... ఇంత కన్నా ఛాన్సుందా...
గోవిందో... గోవిందా... కుర్రవాడూ గోవిందా.. కుర్రవాడూ గోవిందా
పిల్లగాలికి గుబులురేగి... పిల్లగాలికి గుబులురేగి
పిచ్చిపిచ్చి వేషాలేస్తే.. గూబ గుయ్యిమంటుందోయ్...
జలుబు వదిలిపోతుందోయ్..
గూబ గుయ్యిమంటుందోయ్...
జలుబు వదిలిపోతుందోయ్...
జలుబు వదిలిపోతుందోయ్...
గూబ గుయ్యిమంటుందోయ్... జలుబు వదిలిపోతుందోయ్
చరణం 1:
దాచేస్తే దాగేది కాదు అందం.. మార్చేస్తే మారేది కాదు రూపం...
దోచుకోను దొరికేది కాదు అందం.. మెచ్చుకుంటే లొంగేది కాదు రూపం...
ఆడపిల్లలింతేలే అడుగుతుంటే బెట్టులే... మెల్లంగ మెత్తబడి పోతారులే ...
కొంటె కుర్రాళ్లింతేలే వెంటబడి వస్తార్లే.. సై.. అంటే వెర్రిముఖం వేస్తారులే
ఆయ్ ఒక్కసారి సయ్యని చూడు.. గోవిందా.. ఆహ.. వచ్చాడయ్యా మొనగాడు గోవిందా
గోవింగో గోవిందా అహా.. గుట్టుకాస్తా గోవిందా...కుర్రవాడు గోవిందా
చరణం 2:
ఇమ్మంటే ఇచ్చేది కాదు మనసు
రమ్మంటే వచ్చేది కాదు వయసు
వద్దంటే ఉరికింది నాలో వయసు
వదలొద్దు అంటుంది నిన్నే మనసు...
చల్ల గాలి వేస్తుంది చలి ముంచుకొస్తుంది వేడెక్కి పోతుంది లోలోన
లోపలున్న చలిచలికి పైనవున్న వేడికి జత కుదిరిపోతుంది మనలోన
ఇంతకన్నా ఏం చెప్పేది.. గోవిందా.. అహ ఎందుకింక నేనాగేది.. గోవిందా ...
గోవిందో గోవిందా గుట్టు కాస్తా గోవిందా...
లడ్డులాంటి పడుచుపిల్ల... అహ..లడ్డులాంటి పడుచుపిల్ల...
అర్ధరాత్రి దొరికిందంటే
అంత కన్నా షోకుందా... ఇంతకన్నా ఛాన్సుందా...
అంతకన్నా షోకుందా... ఇంతకన్నా ఛాన్సుందా...
అంతకన్నా షోకుందా... ఇంతకన్నా ఛాన్సుందా...గోవిందో గోవిందా