చిత్రం: జేబు దొంగ (1975)
సంగీతం: చక్రవర్తి
గాయకులు: ఎస్.పి. బాలసుబ్రమణ్యం, పి. సుశీల
రచన: ఆచార్య ఆత్రేయ
పల్లవి:
నీలాల నింగిలో.. మేఘాల తేరులో..
ఆ పాల పుంతలో..నీ కౌగిలింతలో..
నిలువెల్లా కరిగిపోనా.. నీలోనా కలిసిపోనా
నీలాల నింగిలో... మేఘాల తేరులో..
ఆ పాల పుంతలో ..నీ కౌగిలింతలో..
నిలువెల్లా కరిగిపోనా... నీలోనా కలిసిపోనా
నీలాల నింగిలో... మేఘాల తేరులో..ఓ..ఓ..
చరణం 1:
ఆ నింగికి నీలం నీవై... ఈ నేలకు పచ్చను నేనై
రెండూ కలిసిన అంచులలో.. రేపూ మాపుల సంధ్యలలో
ఎర్రని పెదవుల ముద్దులుగా నల్లని కన్నుల సుద్దులుగా
ఎర్రని పెదవుల ముద్దులుగా నల్లని కన్నుల సుద్దులుగా
మెల్లగ.. చల్లగ...
మెత్తగ.. మత్తుగ హత్తుకుపోయీ
నిలువెల్లా కరిగిపోనా నీలోనా కలిసిపోనా
నీలాల నింగిలో.. మేఘాల తేరులో...ఓ..ఓ..
చరణం 2:
ఆ హిమగిరి శిఖరం నీవై ...ఈ మమతల మంచును నేనై
ఆశలు కాచే వేసవిలో... తీరని కోర్కెల తాపంలో
శివపార్వతుల సంబరమై గంగా యమునల సంగమమై
శివపార్వతుల సంబరమై గంగా యమునల సంగమమై
ఉరకల..పరుగులా ..
పరువములోనా.. ప్రణయములోనా...
నిలువెల్లా కరిగిపోనా నీలోనా కలిసిపోనా
నీలాల నింగిలో.. మేఘాల తేరులో..
ఆ పాల పుంతలో..నీ కౌగిలింతలో..
నిలువెల్లా కరిగిపోనా.. నీలోనా కలిసిపోనా
ఆ పాల పుంతలో..నీ కౌగిలింతలో..
నిలువెల్లా కరిగిపోనా.. నీలోనా కలిసిపోనా
నీలాల నింగిలో.. మేఘాల తేరులో..
ఆహా హా ఓహో ఓ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి