చిత్రం : కాళహస్తి మహత్యం (1954)
సంగీతం : ఆర్. సుదర్శనం & ఆర్. గోవర్ధనం
గీతరచయిత : తోలేటి వెంకట రెడ్డి
గానం: ఘంటసాల
మాయజాలమున మునిగేవు నరుడా
మాయజాలమున మునిగేవు నరుడా
(నరుడా = నశించని వాడా) దారీ తెలియక తడబాటులేల !! || మాయాజాలమున... || జ్ఞాన నేత్రమున వెదకి చూడుమా
జ్ఞాన నేత్రమున వెదకి చూడుమా శాశ్వత జ్యోతి కనుగొనుమా
శాశ్వత జ్యోతి కనుగొనుమా 'జీవితసమర' - విహారములోన... దీక్షా ధైర్యం జయభేరిరా! (2) (సమరం లాగా అనిపించే జీవితం నిజానికి నీవు కోరుకుని వచ్చిన విహారమే. అది సరదాగా అనుభవిన్చవలసినది తప్ప హయ్యో ఇటేల వచ్చితి ఈశ్వరా అనుకోరాదు. అలా విహారం అని అనుభూతి చెందటానికి ఏం కావాలి అంటే దీక్షా ధైర్యం. అవి ఉంటే జయ భేరి మోగించటమే ఇంక ) జీవుడులో శివుడున్నాడు...రా జీవుడులో శివుడున్నాడు...నరుడా (నరుడా అని గుర్తు చెయ్యటం = నువ్వే ఆ నశించని తత్వానివి అని గుర్తు పెట్టుకో సుమా అని చెప్పటం) ఆ శివుడే జగదాధారిరా ! ... నీ జీవిత నిర్మాతవు నీవే - నీ కృషియే ఇల ఫలియించురా ! (2) మదిలో కల్లోలము విడరా (2) మనసునగల దేవుని గనరా (2) || మాయాజాలమున ||