Karthika Deepam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Karthika Deepam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

18, జనవరి 2025, శనివారం

Karthika Deepam : Nee Kougililo Taladachi Song Lyrics (నీ కౌగిలిలో తల దాచి)

చిత్రం : కార్తీక దీపం (1979)

గీత రచయిత : మైలవరపు గోపి

నేపధ్య గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి

సంగీతం : సత్యం



పల్లవి:

నీ కౌగిలిలో తల దాచి నీ చేతులలో కను మూసి
జన్మ జన్మకు జతగా మసలే వరమే నన్ను పొందనీ
నీ కౌగిలిలో తల దాచి నీ చేతులలో కను మూసి
జన్మ జన్మకు జతగా మసలే వరమే నన్ను పొందనీ
నీ కౌగిలిలో తల దాచి...

చరణం 1:

చల్లగ కాసే పాల వెన్నెల నా మనసేదో వివరించు
అల్లరి చేసే ఓ చిరుగాలి నా కోరికలే వినిపించు
నా కోవెలలో స్వామివి నీవై వలపే దివ్వెగ వెలిగించు
నీ కౌగిలిలో తల దాచి నీ చేతులలో కను మూసి
జన్మ జన్మకు జతగా మసలే వరమే నన్ను పొందనీ
నీ కౌగిలిలో తల దాచి...

చరణం 2:

నింగి సాక్షి.. నేల సాక్షి.. నిను వలచిన నా మనసే సాక్షి
మనసులోన మనుగడలోన నాలో నీవే సగపాలు
వేడుకలోను.. వేదనలోను... పాలు తేనెగ ఉందాము
నీ కౌగిలిలో తల దాచి... నీ చేతులలో కను మూసి
జన్మ జన్మకు జతగా మసలే... వరమే నన్ను పొందనీ
నీ కౌగిలిలో తల దాచి...

Karthika Deepam : Aaraneekuma Ee Deepam Song Lyrics (ఆరనీకుమా ఈ దీపం)

చిత్రం : కార్తీక దీపం (1979)

గీత రచయిత : దేవులపల్లి కృష్ణ శాస్త్రి

నేపధ్య గానం: ఎస్.జానకి, పి. సుశీల

సంగీతం : సత్యం


పల్లవి:

ఆ ఆ ఆ... ఆ ఆ ఆ...
ఆరనీకుమా ఈ దీపం కార్తీకదీపం
చేరనీ నీ పాదపీఠం కర్పూరదీపం
ఆరనీకుమా ఈ దీపం కార్తీకదీపం
చేరనీ నీ పాదపీఠం కర్పూరదీపం
ఇదే సుమా నా కుంకుమతిలకం
ఇదే సుమా నా మంగళసూత్రం
ఆరనీకుమా ఈ దీపం కార్తీకదీపం
చేరనీ నీ పాదపీఠం కర్పూరదీపం..

చరణం 1:

ఇంటిలోన నా పాప రూపున గోరంతదీపం
కంటికెదురుగా కనబడువేళల కొండంతదీపం
నా మనస్సులో వెలిగే దీపం
నా మనుగడ నడిపే దీపం
ఆరనీకుమా ఈ దీపం కార్తీకదీపం
చేరనీ నీ పాదపీఠం కర్పూరదీపం

చరణం 2:

ఆ ఆ ఆ... ఆ ఆ ఆ...
ఆకాశాన ఆ మణి దీపాలే ముత్తైదువులుంచారో
ఈ కోనేట్లో ఈ చిరుదివ్వెల చూసి చుక్కలనుకుంటారో
ఏమైనా ఏదైనా కోవెలలో కొలువై యుండే
దేవికి పట్టిన హారతులే
ఆరనీకుమా ఈ దీపం కార్తీకదీపం
చేరనీ నీ పాదపీఠం కర్పూరదీపం
చేరనీ నీ పాదపీఠం నా ప్రాణదీపం

చరణం 3:

ఆ ఆ ఆ... ఆ ఆ ఆ...
నోచిన నోములు పండెనని ఈ ఆనందదీపం
నా దాచిన కోర్కెలు నిండునని ఈ ఆశాదీపం
నా నోచిన నోములు పండెనని ఈ ఆనందదీపం
నా దాచిన కోర్కెలు నిండునని ఈ ఆశాదీపం
ఎచటైనా ఎప్పుడైనా నే కొలిచే కళ్యాణదీపం
నే వలచే నా ప్రాణదీపం
ఆరనీకుమా ఈ దీపం కార్తీకదీపం
చేరనీ నీ పాదపీఠం కర్పూరదీపం
చేరనీ నీ పాదపీఠం నా ప్రాణదీపం

17, జనవరి 2025, శుక్రవారం

Karthika Deepam : Ey Maata Aha Telusu Song Lyrics (ఏయ్ మాట ..అహ తెలుసు )

చిత్రం : కార్తీక దీపం (1979)

గీత రచయిత : మైలవరపు గోపి

నేపధ్య గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల

సంగీతం : సత్యం



పల్లవి: 

ఏయ్ మాట ..అహ తెలుసు 
అది కాదు..ఇంకేమిటి? 
చెపితే చాలదు కోరిక తీరదు 
ఇది విన్నదే రోజూ ఉన్నదే 
చెపితే చాలదు కోరిక తీరదు 
హా ఇది విన్నదే రోజూ ఉన్నదే 
ఏయ్ మాట ..అహ తెలుసు 
అది కాదు..ఇంకేమిటి? 
చెపితే చాలదు కోరిక తీరదు 

చరణం 1: 

పగలంత నా మాట వింటావటా 
పడకిల్లు చేరంగ దయ రాదటా 
ఆ వేళలో నీకు ఇల్లాలిని 
ఈ ఝాము నీ పైన అధికారిని ఈ.. 
ఏయ్ మాట.. అహ తెలుసు 
అబ్బా అది కాదు..ఆ ఇంకేమిటి? 
చెపితే చాలదూ కోరిక తీరదూ 
ఇది విన్నదే రోజూ ఉన్నదే 

చరణం 2: 

అలకుంటే ఒక సారి నను దోచుకో 
కౌగిట బంధించి ముద్దాడుకో 
ఎన్నైనా చెపుతావు ఈ ఘడియలో 
చాలన్నదే లేదు నీ భాషలో.. 
ఏయ్ మాట.. అహా తెలుసు 
ఆ అది కాదు..హా ఇంకేమిటి? 
చెపితే చాలదూ కోరిక తీరదూ 
ఊహూ విన్నదే రోహూ ఉన్నదే 
ఆహా ఆహాహా ఆహా ఆహహా 
ఊహు హుహుహు ఊహు హుహుహు

Karthika Deepam : Chilakamma Palikindhi Song Lyrics (చిలకమ్మ పలికింది.. )

చిత్రం : కార్తీక దీపం (1979)

గీత రచయిత : నార్ల రామిరెడ్డి

నేపధ్య గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి

సంగీతం : సత్యం



పల్లవి :

చిలకమ్మ పలికింది.. చిగురాకు కులికింది
చిలకమ్మ పలికింది.. చిగురాకు కులికింది
చిరునవ్వు చిలికించవే.. నీ లేత సింగారమొలికించవే..
నీ లేత సింగార మొలికించవే..

గోరొంక కూసింది.. గోరింట పూసింది..
గోరొంక కూసింది.. గోరింట పూసింది
ముత్యాల మనసీయ్యరా... నీ తీపి ముద్దుల్లో ముంచెయ్యరా...
నీ తీపి ముద్దుల్లో ముంచెయ్యరా…


చరణం 1:

పాల బుగ్గ కందితే తెలిసింది పూల సిగ్గు పూచిందని...
ఆ ఆ హా..హ..హా..ఆ..హ...
పైట కొంగు జారితే తెలిసింది పిల్ల గాలి వీచిందని..
ఈ సిగ్గు బరువు నేనోపలేను... ఈ సిగ్గు బరువు నేనోపలేను
నీ కంటి పాపలో దాచుకో నన్నూ.. దాచుకో నన్నూ...

చిలకమ్మ పలికింది..చిగురాకు కులికింది
ముత్యాల మనసీయ్యరా... నీ తీపి ముద్దుల్లో ముంచెయ్యరా...
నీ తీపి ముద్దుల్లో ముంచెయ్యరా...

చరణం 2:

కోయిలమ్మ పాడితే తెలిసింది కొత్త ఋతువు వచ్చిందని...
ఆ ఆ..హా..హ..హా...ఆ..హ
కొండ వాగుదూకితే తెలిసింది.. కోడె వయసు పొంగిందని..
ఈ వయసు హోరు నేనాపలేను.. ఈ వయసు హోరు నేనాపలేను
నీ కౌగిలింతలో దోచుకో నన్నూ... దోచుకో నన్నూ..


చిలకమ్మ పలికింది.. చిగురాకు కులికింది
గోరొంక కూసింది.. గోరింట పూసింది
చిరునవ్వు చిలికించవే నీ లేత సింగారమొలికించవే..
నీ తీపి ముద్దుల్లో ముంచెయ్యరా...

Karthika Deepam : Chooda Chakkani Daana Song Lyrics (చూడచక్కనిదానా.. అహా)

చిత్రం : కార్తీక దీపం (1979)

గీత రచయిత : మైలవరపు గోపి

నేపధ్య గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల

సంగీతం : సత్యం



పల్లవి :  

అహ.. అహ.. అహ...
చూడచక్కనిదానా.. అహా
అహ.. చూపు బిత్తరిదానా
నీ మిసమిసలు.. ఈ రుసరుసలు చూస్తేనే మనసౌతోంది
అహ... చూడచక్కనిదానా.. అహా
అహ.. చూపు బిత్తరిదానా
నీ మిసమిసలు.. ఈ రుసరుసలు చూస్తేనే మనసౌతోంది
అహ... చూడచక్కనివాడా...
అహ.. చూపు కత్తెరవాడా
నీ రెపరెపలు.. ఈ తహతహలు చూస్తుంటే మతి పోతోంది
అహ... చూడచక్కనివాడా... ఆ.. ఆ.. ఆ..


చరణం 1 :

నీ సొగసులకు నా చూపులను నే కావలి పెడతానే
నీ పదవులపై నా పెదవులకు అహా  పెత్తనమిస్తానే 
చిలిపివయసు... కలికిమనసు
అహ.. చిలిపివయసు... కలికిమనసు...  పంచుకుంటానే.. హా...
అహ... చూడచక్కనిదానా.. అ.. ఆ.. ఆ..

చరణం 2 :

నువ్వు  కావాలన్న అందీఅందక ఆరడి చేస్తాను
నను కాదంటున్నా కలలో కలిసి అల్లరి పెడతాను
నిమిషమైనా వదలలేని
నిమిషమైనా వదలలేని... గారడి చేస్తాను
అరెరెరె.. అహ... చూడచక్కనిదానా..అహ.. చూపు కత్తెరవాడా
నీ మిసమిసలు.. ఈ రుసరుసలు చూస్తేనే మనసౌతోంది
నీ రెపరెపలు.. ఈ తహతహలు చూస్తుంటే మతి పోతోంది
చూడచక్కనిదానా... అహ.. చూడచక్కనివాడా... ఆ.. ఆ.. ఆ