Khaidi No 786 లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Khaidi No 786 లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

6, ఏప్రిల్ 2022, బుధవారం

Khaidi No 786 : Chali Gali Kottindamma Song Lyrics (చలిగాలి కొట్టిందమ్మ)

 చిత్రం: ఖైదీ నెంబర్ 786 (1988)

రచన: భువన చంద్ర

గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం , ఎస్.జానకి

సంగీతం:రాజ్-కోటి



చలిగాలి కొట్టిందమ్మ అందెట్లో... ఎందిట్లో చెలిగాలి కుట్టిందమ్మ ఎందిట్లో... ఎందిట్లో ఎందిట్లో ఏమౌతాదో... అందిట్లో ఏమౌతాదో.. సందిట్లో వచ్చేదాక నేనెట్ట చెప్పేదమ్మో ఏ ముద్దు ఏ మూలున్న కొద్దోగొప్పో పారెయ్యాలమ్మో.. ఓ.. ఓ..ఓ..ఓ..ఓ.. చలిగాలి కొట్టిందమ్మ అందెట్లో... ఎందిట్లో చెలిగాలి కుట్టిందమ్మ ఎందిట్లో... ఎందిట్లో ఎందిట్లో ఏమౌతాదో... అందిట్లో ఏమౌతాదో.. సందిట్లో వచ్చేదాక నేనెట్ట చెప్పేదమ్మో ఏ ముద్దు ఏ మూలున్న కొద్దోగొప్పో పారెయ్యాలమ్మో.. ఓ.. ఓ..ఓ..ఓ..ఓ.. నా సలహా ఒకటే చలి వేళా ఓం నమః ఒడిలో చదవాలా నీ తరహా తెలిసే పిలగాడా యం యమః కలిశా కసితీరా ఆస్తో పాస్తో చదివించుకో కాస్తో కూస్తో కవ్వించుకో జోడు కుంపట్లు కావాలా ఈడె తంపట్లు వెయ్యాలా ఒకటే దుప్పట్లో దూరాలా నీ ముద్ద మందార గంధాలు పుయ్యాల ఓ..ఓ..ఓ..ఓ.. ఓ..ఓ..ఓ..ఓ.. Chaలిగాలి కొట్టిందమ్మ అందెట్లో.. ఎందిట్లో చెలిగాలి కుట్టిందమ్మ ఎందిట్లో.. ఎందిట్లో నా నడుమే కసిగా ఊగాలా నీ నడకే ఉసిగా సాగాలా నీ రుచులే ఒడిలో చూడాలా నా పెదవే తడిగా మారాలా పిచ్చో వెర్రో ప్రేమించనా గిల్లో గిచ్చో వేధించనా ఊరే పొద్దెక్కి పోవాలా ఈడే తెల్లారి పోవాలా చల్లో కొంకర్లు పోవాలా ఈ కొండకోనల్లో తుళ్ళింతలాడాలా ఓ...ఓ..ఓ... ఓ... ఓ.. ఓ... ఓ.. ఓ..

1, అక్టోబర్ 2011, శనివారం

Khaidi No 786 : Guvva Gorinka tho song lyrics (గువ్వా..గోరింకతో..)

చిత్రం: ఖైదీ నెంబర్ 786 (1988)

రచన: భువన చంద్ర

గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం , ఎస్.జానకి

సంగీతం:రాజ్-కోటి



పల్లవి :

గువ్వా..గోరింకతో.. ఆడిందిలే బొమ్మలాట నిండు..నా గుండెలో.. మ్రోగిందిలే వీణపాట ఆడుకోవాలి గువ్వలాగా పాడుకుంటాను నీ జంట గోరింకనై ! గువ్వా..గోరింకతో.. ఆడిందిలే బొమ్మలాట నిండు..నా గుండెలో.. మ్రోగిందిలే వీణపాట చరణం:1

జోడుకోసం గోడదూకే వయసిది తెలుసుకో అమ్మాయిగారు అయ్యోపాపం అంతతాపం తగదులే తమరికి అబ్బాయిగారు ఆత్రము..ఆరాటము..చిందే వ్యామోహం తూర్పులో..నిట్టూర్పులో..అంతా నీధ్యానం కోరుకున్నానని ఆటపట్టించకు చేరుకున్నానని నన్ను దోచెయ్యకు చుట్టుకుంటాను సుడిగాలిలా !! గువ్వా..గోరింకతో.. ఆడిందిలే బొమ్మలాట నిండు..నా గుండెలో.. మ్రోగిందిలే వీణపాట చరణం:2

కొండనాగు తోడుచేరే నాగిని బుసలలో వచ్చే సంగీతం సందెకాడ అందగత్తె కొంగులో ఉందిలే ఎంతో సంతోషం పూవులో మకరందము ఉందే నీకోసం తీర్చుకో ఆ దాహము వలపే జలపాతం కొంచెమాగాలిలే కోర్కె తీరేందుకు దూరముంటానులే దగ్గరయ్యేందుకు దాచిపెడతాను నా సర్వము !! గువ్వా..గోరింకతో.. ఆడిందిలే బొమ్మలాట నిండు..నా గుండెలో.. మ్రోగిందిలే వీణపాట ఆడుకోవాలి గువ్వలాగా పాడుకుంటాను నీ జంట గోరింకనై !