చిత్రం: ఖైదీ నెంబర్ 786 (1988)
రచన: భువన చంద్ర
గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం , ఎస్.జానకి
సంగీతం:రాజ్-కోటి
పల్లవి :
గువ్వా..గోరింకతో.. ఆడిందిలే బొమ్మలాట
నిండు..నా గుండెలో.. మ్రోగిందిలే వీణపాట
ఆడుకోవాలి గువ్వలాగా
పాడుకుంటాను నీ జంట గోరింకనై !
గువ్వా..గోరింకతో.. ఆడిందిలే బొమ్మలాట
నిండు..నా గుండెలో.. మ్రోగిందిలే వీణపాట
చరణం:1
జోడుకోసం గోడదూకే వయసిది తెలుసుకో అమ్మాయిగారు
అయ్యోపాపం అంతతాపం తగదులే తమరికి అబ్బాయిగారు
ఆత్రము..ఆరాటము..చిందే వ్యామోహం
తూర్పులో..నిట్టూర్పులో..అంతా నీధ్యానం
కోరుకున్నానని ఆటపట్టించకు
చేరుకున్నానని నన్ను దోచెయ్యకు
చుట్టుకుంటాను సుడిగాలిలా !!
గువ్వా..గోరింకతో.. ఆడిందిలే బొమ్మలాట
నిండు..నా గుండెలో.. మ్రోగిందిలే వీణపాట
చరణం:2
కొండనాగు తోడుచేరే నాగిని బుసలలో వచ్చే సంగీతం
సందెకాడ అందగత్తె కొంగులో ఉందిలే ఎంతో సంతోషం
పూవులో మకరందము ఉందే నీకోసం
తీర్చుకో ఆ దాహము వలపే జలపాతం
కొంచెమాగాలిలే కోర్కె తీరేందుకు
దూరముంటానులే దగ్గరయ్యేందుకు
దాచిపెడతాను నా సర్వము !!
గువ్వా..గోరింకతో.. ఆడిందిలే బొమ్మలాట
నిండు..నా గుండెలో.. మ్రోగిందిలే వీణపాట
ఆడుకోవాలి గువ్వలాగా
పాడుకుంటాను నీ జంట గోరింకనై !
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి