చిత్రం: కొత్త బంగారులోకం (2008)
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం
సంగీతం: మిక్కీ.జె.మేయర్
నీ ప్రశ్నలు నీవే ఎవ్వరో బదులివ్వరుగా నీ చిక్కులు నీవే ఎవ్వరు విడిపించరుగా ఏ గాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా ఆగాలో లేదో తెలియదంటే చెల్లదుగా పది నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా అపుడో ఇపుడో కననే కనను అంటుందా ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా గుడికో జడకో సాగనంపక ఉంటుందా బతుకంటే బడి చదువా అనుకుంటే అతి సులువా పొరపడినా పడినా జాలిపడదే కాలం మనలాగా ఒక నిమిషం కూడా ఆగిపోదే నువ్వొచ్చేదాకా అలలుండని కడలేదని అడిగేందుకె తెలివుందా కలలుండని కనులేవని నిత్యం నిదరోమందా గతముందని గమనించని నడిరేయికి రేపుందా గతితోచని గమనానికి గమ్యం అంటూ ఉందా వలపేదో వల వేస్తోంది వయసేమో అటు తోస్తుంది గెలుపంటే ఏదో ఇంతవరకు వివరించే రుజువేముంది సుడిలోపడు ప్రతి నావ చెపుతున్నది వినలేవా పొరపాటున చెయి జారిన తరుణం తిరిగొస్తుందా ప్రతిపూటొక పుటగా తన పాఠం వివరిస్తుందా మనకోసమే తనలో తను రగిలే రవితపనంతా కనుమూసిన తరువాతనే పెనుచీకటి చెపుతుందా కడతేరని పయనాలెన్ని పడదోసిన ప్రణయాలెన్ని అని తిరగేసాయా చరిత పుటలు వెనుచూడక ఉరికే వెతలు తమ ముందు తరాలకు స్మృతుల చితులు అందించాలా ప్రేమికులు ఇది కాదే విధి రాత అనుకోదేం ఎదురీత పది నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా అపుడో ఇపుడో కననే కనను అంటుందా ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా గుడికో జడకో సాగనంపక ఉంటుందా బతుకంటే బడి చదువా అనుకుంటే అతి సులువా పొరపడినా పడినా జాలిపడదే కాలం మనలాగా ఒక నిమిషం కూడా ఆగిపోదే నువ్వొచ్చేదాకా