చిత్రం: క్షణ క్షణం(1991)
సంగీతం: ఎం. ఎం. కీరవాణి
సాహిత్యం: వెన్నెలకంటి
గానం: మనో, చిత్ర
యెడ కొసరాగా విసిరెను మధువుల వల అదిరిన పెదవులలో
జత కుదరగా ముసిరేను అలకల అల
చిలకలా పలుకులు చిలికిన చినుకులతో
తొలకరి సిరి జల్లులలో
చిత్రం: క్షణ క్షణం(1991)
సంగీతం: ఎం. ఎం. కీరవాణి
సాహిత్యం: వెన్నెలకంటి
గానం: మనో, చిత్ర
చిత్రం: క్షణ క్షణం (1989)
రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర
సంగీతం: ఎం.ఎం.కీరవాణి
అందనంత ఎత్తా తారాతీరం... సంగతేంటో చూద్దాం దా... ఆ అందమంత కొత్తా... తాళం తీస్తే సందె విందు సొంతం కాదా.... చిందే సరదా పొంగే వరదా... స్వర్గం మన సమీపమయ్యేంత... అందనంత ఎత్తా తారాతీరం... సంగతేంటో చూద్దాం దా... గువ్వ నీడలో గూడు కట్టుకో... కుర్రవేడిలో కుకూ..కూత పెట్టుకో... దిక్కులన్ని తెగించే వేగంతో... రెక్క విప్పు నిషాలెన్నో... గుప్పెడంత కులాసా గుండెల్లో... గుప్పుమన్న ఖుషీలెన్నో... తోటమాలి చూడకుండ... ఏటవాలు బాటవెంట... మొగ్గనవ్వు చేరుకుంటే... చుక్కలింట పండగంట.. కొంటె కోనలో కోట కట్టుకో... కొత్త కోకలో కో కో కోరికందుకో... కోల కళ్ల గులాబి గుమ్మంలో... కాచుకున్న కబుర్లెన్నో... కప్పుకున్న కిలాడి కొమ్మల్లో... గుచ్చుకున్న గుణాలెన్నో... లాగుతున్న గాలి వెంట... సాగుతున్న పూలమంట... తాకుతుంటే దాగదంట... ఆకశాన పాలపుంత... అందనంత ఎత్తా తారాతీరం... సంగతేంటో చూద్దాం దా... ఆ అందమంత కొత్తా... తాళం తీస్తే సందె విందు సొంతం కాదా...
చిత్రం: క్షణ క్షణం(1991)
సంగీతం: M.M.కీరవాణి
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం: బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
జాము రాతిరి..జాబిలమ్మ..
జోల పాడనా ఇలా..
జోరు గాలిలో..జాజి కొమ్మ..
జారనీయకే కలా..
వయ్యారి వాలు కళ్ళలోన..
వరాల వెండి పూల వాన..
స్వరాల ఊయలూగు వేళ..
జాము రాతిరి..జాబిలమ్మ..
జోల పాడనా ఇలా..
కుహు కుహు సరాగాలే శ్రుతులుగా..
కుశలమా అనే స్నేహం పిలువగా..
కిల కిల సమీపించే సడులతో..
ప్రతి పొద పదాలేవో పలుకగా..
కునుకు రాక బుట్ట బొమ్మ గుబులుగుందని..
వనము లేచి వద్దకొచ్చి నిద్రపుచ్చనీ..
జాము రాతిరి..జాబిలమ్మ..
జోల పాడనా ఇలా..
మనసులో భయాలన్నీ మరిచిపో..
మగతలో మరో లోకం తెరుచుకో..
కలలతో ఉషా తీరం వెతుకుతూ..
నిద్రతో నిషా రాణి నడిచిపో..
చిటికలోన చిక్కబడ్డ కటిక చీకటి..
కరిగిపోక తప్పదమ్మ ఉదయ కాంతికి..
జాము రాతిరి..జాబిలమ్మ..
జోల పాడనా ఇలా..
జోరు గాలిలో..జాజి కొమ్మ..
జారనీయకే కలా..
వయ్యారి వాలు కళ్ళలోన..
వరాల వెండి పూల వాన..
స్వరాల ఊయలూగు వేళ..