Kula Gothralu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Kula Gothralu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

7, ఏప్రిల్ 2022, గురువారం

Kula Gothralu : Ayyayyo Chethilo Dabbulo Poyane Song Lyrics (అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే)

చిత్రం: కుల గోత్రాలు (1962)

సాహిత్యం: కొసరాజు

గానం: ఘంటసాల, పి. సుశీల

సంగీతం: సాలూరి రాజేశ్వర రావు



అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే అయయ్యో జేబులు ఖాళీ ఆయెనే అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే అయయ్యో జేబులు ఖాళీ ఆయెనే ఉన్నది కాస్తా ఊడింది సర్వ మంగళం పాడింది ఉన్నది కాస్తా ఊడింది సర్వ మంగళం పాడింది పెళ్లాం మెళ్లో నగలతో సహా తిరుక్షవరమై పోయింది అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే అయయ్యో జేబులు ఖాళీ ఆయెనే ఆ మహా మహా నలమహారాజుకే తప్పలేదు భాయీ ఓటమి తప్పలేదు భాయీ మరి నువు చెప్పలేదు భాయీ అది నా తప్పుగాదు భాయీ తెలివి తక్కువగ చీట్ల పేకలో దెబ్బ తింటివోయీ బాబూ నిబ్బరించవోయీ అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే అయయ్యో జేబులు ఖాళీ ఆయెనే నిలువు దోపిడీ దేవుడికిచ్చిన ఫలితం దక్కేది ఎంతో పుణ్యం దక్కేది గోవిందా గోవిందా నిలువు దోపిడీ దేవుడికిచ్చిన ఫలితం దక్కేది ఎంతో పుణ్యం దక్కేది చక్కెర పొంగలి చిక్కేది ఎలక్షన్లలో ఖర్చుపెడితే ఎం.ఎల్.ఏ దక్కేది మనకు అంతటి లక్కేదీ అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే అయయ్యో జేబులు ఖాళీ ఆయెనే గెలుపూ ఓటమి దైవాధీనం చెయ్యి తిరగవచ్చు మళ్ళీ ఆడి గెల్వవచ్చు ఇంకా పెట్టుబడెవడిచ్చు ఇల్లు కుదవ చేర్చవచ్చు ఛాన్సు తగిలితే ఈ దెబ్బతో మన కరువు తీరవచ్చు పోతే అనుభవమ్ము వచ్చు చివరకు జోలె కట్టవచ్చు అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే అయయ్యో జేబులు ఖాళీ ఆయెనే

16, ఫిబ్రవరి 2022, బుధవారం

Kula Gothralu : Chilipi Kanula Thiyyani Chelikadaa Song Lyrics (చిలిపికనుల తీయని)

చిత్రం: కుల గోత్రాలు (1962)

సాహిత్యం: సి. నారాయణ రెడ్డి

గానం: ఘంటసాల, పి. సుశీల

సంగీతం: సాలూరి రాజేశ్వర రావు




పల్లవి:

చిలిపికనుల తీయని చెలికాడ నీ నీడను నిలుపుకొందురా... నిలుపుకొందురా వెల్గుల మేడ నీలికురుల వన్నెల జవరాల నీ కౌగిట నిలుపుకొందునే పూల ఉయ్యాల

చరణం 1:

కనుల ముందు అలలు పొంగెను ఓ.... మనసులోన కలలు పండెను అలలే కలలై కలలే అలలై అలలే కలలై కలలే అలలై గిలిగింతలు సలుపసాగెను            

చిలిపికనుల తీయని చెలికాడ నీ నీడను నిలుపుకొందురా...

చరణం 2:

కొండలు కోయని పిలిచినవి  ఆ.... గుండెలు హోయని పలికినవి   

కొండలు కోయని పిలిచినవి  ఆ.... గుండెలు హోయని పలికినవి  కోరికలన్నీ బారులు తీరి

కోరికలన్నీ బారులు తీరి గువ్వలుగా ఎగరుతున్నవి          

నీలికురుల వన్నెల జవరాల నీ కౌగిట నిలుపుకొందునే పూల ఉయ్యాల

చరణం 3:

జగము మరచి ఆడుకొందమా  ఆ... ప్రణయగాతి పాడుకొందమా

జగము మరచి ఆడుకొందమా  ఆ... ప్రణయగాతి పాడుకొందమా నింగీనేలా కలిసిన చోట 

నింగీనేలా కలిసిన చోట నీవు నేను చేరుకొందమా    

చిలిపికనుల తీయని చెలికాడ నీ నీడను నిలుపుకొందురా...