Ladies Tailor లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Ladies Tailor లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

23, ఏప్రిల్ 2022, శనివారం

Ladies Tailor : Haayamma Haayamma Song Lyrics (హాయమ్మా హాయమ్మా హాయమ్మా)

చిత్రం: లేడీస్ టైలర్ (1986)

రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం , ఎస్.జానకి

సంగీతం: ఇళయరాజా  



హాయమ్మా హాయమ్మా హాయమ్మా హాయమ్మా హాయమ్మా హాయమ్మా హాయమ్మా హాయమ్మా హాయమ్మా హాయమ్మా హాయమ్మా హాయమ్మా అందాల బంధంలో వుందామా ఆనందం అందుకుందామా బంగారు స్వప్నాలు కందమా కౌగిళ్ళు పంచుకుందామా ఓయమ్మా ఓయమ్మా ఓయమ్మా ఓయమ్మా ఓయమ్మా ఓయమ్మా ఓయమ్మా ఓయమ్మా ఓయమ్మా ఓయమ్మా ఓయమ్మా ఓయమ్మా సింగారి గంగల్లే పొంగెను కంగారై గుండె కుంగెను శృంగార రంగాన చిక్కెను రంగేళి నీకే దక్కెను చరణం: 1

దరహాసమై నీ అధరాలపైనే ఉండమ్మా ఉండమ్మా ఉండమ్మా చిరవాసముండే సరళాక్షి నేనే ఔనమ్మా ఔనమ్మా ఔనమ్మా నను చూడు సయ్యమ్మ సయ్యమ్మ మనువాడు సయ్యమ్మ సయ్యమ్మ అలివేణి నాదమ్మ నాదమ్మ కలవాణి నీవమ్మ నీవమ్మ నీనుగానే ఎదనదిలో అలజడి ఏదో సుడితిరిగే నీవే జతవైతే కల తీరేను ఈవేళ "హాయమ్మా" చరణం: 2

మదిలోని బాల ఎదురైన వేళ హాయమ్మా హాయమ్మా హాయమ్మా పదహారువేళ మదిరాచులేలా హాయమ్మా హాయమ్మా హాయమ్మా మురిపాలు హాయమ్మా హాయమ్మా సరదాలు హాయమ్మా హాయమ్మా సరసాలు హాయమ్మా హాయమ్మా సగపాలు హాయమ్మా హాయమ్మా తరుణం నిన్నే పిలిచేనురా తరుణం నేడే కుదిరేనురా ఏడు జన్మాల నీ జోడు నేనేరా

హాయమ్మా హాయమ్మా హాయమ్మా హాయమ్మా హాయమ్మా హాయమ్మా హాయమ్మా హాయమ్మా హాయమ్మా హాయమ్మా హాయమ్మా హాయమ్మా

Ladies Tailor : Ekkada Ekkada Song Lyrics (ఎక్కడ ఎక్కడ ఎక్కడ )

చిత్రం: లేడీస్ టైలర్ (1986)

రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం

సంగీతం: ఇళయరాజా  



ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ దాక్కున్నావే లక్కుని తెచ్చే చుక్క ఎక్కువ చిక్కులు పెట్టక.. చిక్కవే చప్పున చక్కగ టక్కున టక్కరి పెట్ట.. నిన్ను పట్టేదెట్ట..ఎట్టా మచ్చున్న భామ... కనులకు కనరావా ఉన్నాను రావా.. నలు చెరగుల తిరుగుదు మరి ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ దాక్కున్నావే లక్కుని తెచ్చే చుక్క ఎక్కువ చిక్కులు పెట్టక... చిక్కవే చప్పున చక్కగ టక్కున టక్కరి పెట్ట... నిన్ను పట్టేదెట్ట..ఎట్టా ఆకారం చూస్తే... సరిపోదంట... ఒకటే గురుతు తెలిసేదేట్ట ఆకారం చూస్తే... సరిపోదంట... ఒకటే గురుతు తెలిసేదేట్ట ఈ మందలో... ఏ సుందరో.. తియ్యాలిలే కూపీ ఈ మందలో... ఏ సుందరో.. తియ్యాలి కూపీ గుట్టు మట్టూ తీసి.. పుట్టు మచ్చను చూసి టక్కున పట్టేయాలి... నక్కను తొక్కేయాలి పొరపడి పరులకు దొరకక ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ దాక్కున్నావే లక్కుని తెచ్చే చుక్క ఎక్కువ చిక్కులు పెట్టక.. చిక్కవే చప్పున చక్కగ టక్కున టక్కరి పెట్ట.. నిన్ను పట్టేదెట్ట..ఎట్టా మచ్చున్న భామ... కనులకు కనరావా ఉన్నాను రావా.. నలు చెరగుల తిరుగుదు మరి ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ దాక్కున్నావే లక్కుని తెచ్చే చుక్క ఎక్కువ చిక్కులు పెట్టక... చిక్కవే చప్పున చక్కగ టక్కున టక్కరి పెట్ట... నిన్ను పట్టేదెట్ట..ఎట్టా పద్మిని జాతి స్త్రీ పద్మిని జాతి స్త్రీ పద్మిని జాతి స్త్రీ శ్రీదేవి.. వాణి.. పశుపతి రాణి.. ఎదురై నిలిచే సమయములోనా శ్రీదేవి.. వాణి.. పశుపతి రాణి.. ఎదురై నిలిచే సమయములోనా ఎల్లాగని గుర్తించను.. శ్రీదేవిని.. ఆ దేవిని ఎల్లాగని గుర్తించను.. నాదేవి ఏదో గుర్తును గుట్టుగ దాచి.. అల్లరి పెట్టే వేళ.. ఎవ్వరి నవ్వులు నమ్మను.. గుండెను ఎవ్వరికివ్వను హరి హరి.. ఇక మరి... పని సరి ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ దాక్కున్నావే లక్కుని తెచ్చే చుక్క ఎక్కువ చిక్కులు పెట్టక.. చిక్కవే చప్పున చక్కగ టక్కున టక్కరి పెట్ట.. నిన్ను పట్టేదెట్ట..ఎట్టా మచ్చున్న భామ... కనులకు కనరావా ఉన్నాను రావా.. నలు చెరగుల తిరుగుదు మరి

15, జూన్ 2021, మంగళవారం

Ladies Tailor : Gopi Lolaa Song Lyrics ( గోపీలోల నీ పాల పఢామురా)

చిత్రం: లేడీస్ టైలర్ (1986)

రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం , ఎస్ పి శైలజ

సంగీతం: ఇళయరాజా  

 


గోపీలోల నీ పాల పఢామురా లీలాలొల అల్లాడుతున్నామురా చన్నీరులో వున్నామురా చిన్నారులం మన్నించరా భామా భామా తీరాన్ని చేరాలమ్మా పరువేకోరి చెయ్యేత్తి మొక్కలమ్మా అందాక మీ అందాలకు ఆ దిక్కులే దిక్కమ్మాలు "గోపీలోల" కృష్ణా కృష్ణా కృష్ణా కృష్ణా "2" మచ్చ మచ్చ మచ్చ మచ్చ "కృష్ణా" జాలిమాలిన ఈగాలి తేరిపార చూసి చిందేసే ఇలా మావిమాటున దాగుంటే కూతవేసి గువ్వలు నవ్వే గోలా తరుణిలో కరుణతో మోక్షంచూపే కిరణమై నిలిచానే తనువులో పుట్టేమాయను తెలుపగా పిలిచానే మోక్షం కన్న మానం మిన్న "గోపీలోల" వాడిపోని సిరులెన్నో పూలుపూచేటి కొమ్మ రెమ్మ గుమ్మ నేనుకోరే ఆ తార ఏది మీలోన భామా భామా భామా తగదురా ఇది మరి చోద్యంకాదా సొగసరి గోవిందా అందరు నీవారేగా ఒకరితో ముడివుందా చూసే కలలు ఎన్నో ఉన్నా చూపే హృదయం ఒకటే ఉందమ్మా "గోపీలోల"


Ladies Tailor : Porapaatidi Tadabaatidi Song lyrics (పొరపాటిది.. తడబాటిది)

చిత్రం: లేడీస్ టైలర్ (1986)

రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం , ఎస్.జానకి

సంగీతం: ఇళయరాజా  



పొరపాటిది.. తడబాటిది... గుంజీల్లే తీసేయ్యనా పొరపాటిది.. తడబాటిది... గుంజీల్లే తీసేయ్యనా ఏదోపాపం పసివాణ్ణి.. జాలీ చూపి..వదలండి మన్నించండి అతితెలివితో మతిపోయెనా నీ వేషం నా ముందరా అతితెలివితో మతిపోయెనా నీ వేషం నా ముందరా వలనుకొరికే చేప నేనూ ఎరను చూసీ మొసపొనూ వెకిలి వేషాలు ముదిరిపోతేను అసలు పాఠాలు నేర్పద యముడిలా వాడు వెనక ఉన్నాడు..  తెలుసునా.. తెలియజెప్పనా వొద్దు వొద్దు బాబోయి తప్పు కాయి తల్లోయి చెంపలేసుకుంటా గోడ కుర్చీ వేస్తా మొన్ననే నేను కళ్ళు తెరిచాను ఇంతలో నన్ను బూచాడికిచ్చెయకు అతితెలివితో మతిపోయెనా ఈ వేషం నా ముందరా అతితెలివితో మతిపోయెనా ఈ వేషం నా ముందరా పొనీ పాపం అనుకుంటే  ఓహో చనువే ముదిరిందే మర్యాదేనా పొరపాటిది.. తడబాటిది గుంజీల్లే తీసేయ్యనా అతితెలివితో మతిపోయెనా ఈ వేషం నా ముందరా విలువ తెలిసే వెతికి చేరా  బతుకు నీతో ముడిని వేశా దరికి జేరాను వరము వేడాను  కరుణతో దారి చూపవా మనసులో మాట తెలుసుకోవమ్మ  చెలిమితో కలిమి కురియవా చిన్నవాడా.. నిన్ను నమ్ముతాను లేవోయి  అల్లరెందుకింక పల్లకీని తేవోయి కోతి వేషాలు మానితే చాలు  నిన్ను వెన్నంటే ఉంటాను ఏనాడు పొరపాటిది.. తడబాటిది గుంజీల్లే తీసేయ్యనా అతితేలివితో మతిపోయెనా నీ వేషం నా ముందరా లాలాలాల.. వదలండీ...   లాలాలలలాలా ముదిరిందే మరియాదేనా..  లల్లలాలల.. తడబాటిది లాలాలా నా ముందరా..  లల్లలాలల.. తడబాటిది లాలాలా నా ముందరా