Lahiri Lahiri Lahirilo లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Lahiri Lahiri Lahirilo లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

30, జూన్ 2021, బుధవారం

Lahiri Lahiri Lahiri Lo : Kalaloki Kalu Song Lyrics (కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడలేకున్నా)

చిత్రం: లాహిరి లాహిరి లాహిరిలో(2002)

సంగీతం: M.M.కీరవాణి

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం:ఉదిత్ నారాయణ్,చిత్ర



ఏ కలవరమా... ఓయ్ పరవశమా... కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడలేకున్నా చూడకుండా ఒక్క నిమిషం ఉండలేకున్నా పంచదార ఎంత తిన్నా చేదుగుందండి చింతపండే కారమయ్యి చంపుతుందండి అదేరా ప్రేమంటే కన్నా ఎదంతా వ్యాపించి నీ దుంప తెంచే ప్రేమ ప్రేమ....ప్రేమ..ప్రేమ చలిచలి గాలుల్లో వెచ్చగ ఉంటోందా ఎండను చూస్తే చలి వేస్తోందా ఎదురుగా నువ్వున్నా విరహం పుడుతోంది ఏ నిజమైనా కలగా వుంది విసుగేదో కలిగింది దిగులేదో పెరిగింది అసలేదో జరిగింది మతి కాస్తా పోయింది అదేరా ప్రేమంటే చిన్నా ఏదేదో చేసేసి నీ కొంప ముంచే ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ చిటపట చినుకుల్లో పొడి పొడిగుంటోందా చినుకే నీకు గొడుగయ్యిందా... నిద్దురలో వున్నా మెలకువలా వుంది మెలకువలోనే స్పృహ లేకుంది చూపేమో చెదిరింది మాటేమో వణికింది అడుగసలే పడనంది కుడి ఎడమై పోయింది అదేర ప్రేమంటే బచ్చా అలాగే వేధించి నీ అంతు చూసే ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ

Lahiri Lahiri Lahiri Lo : Nesthama Song Lyrics (నేస్తమా ఓ ప్రియనేస్తమా)

చిత్రం: లాహిరి లాహిరి లాహిరిలో(2002)

సంగీతం: M.M.కీరవాణి

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: సోను నిగమ్, సునీత



నేస్తమా ఓ ప్రియనేస్తమా ప్రియతమా నాలో ప్రాణమా నీలో ఉన్న నన్నే చూడనంటు పంతమా తెరచాటు దాటి దరిచేరుమా ఎడబాటు దూరం కరిగించుమా నేస్తమా ఓ ప్రియనేస్తమా నీ గుండెల్లో చూడమ్మా నేను లేనా ఏ మూలో నీ ఊపిరిలో వెతుకమ్మా చేరుకున్నా ఏనాడో మనసిచ్చావు నాకే కదా అది వదిలేసి పోతే ఎలా ఎక్కడున్నా చెలీ నీ యదా నిన్ను నా వైపు నడిపించదా వెళ్ళే దారులన్ని నన్ను చూపే వేళలో కనుమూసుకుంటే కనిపించనా యదలోని పాటై వినిపించనా నేస్తమా ఓ ప్రియనేస్తమా నా గుండెల్లో ఈ భారం దాటనంది ఈ దూరం నా ఊపిరిలో ఈ మౌనం పాడనంది ప్రియ గానం అన్నీ తెలిసున్న అనురాగమా నన్ను వెంటాడటం న్యాయమా రెప్ప వెనకాల తొలి స్వప్నమా ఉప్పు నీరై ఉబికిరాకుమా కమ్మని జ్ఞాపకంలా ఊహలో నిదురించుమా మనసందుకున్న మమకారమా మరిపించు వరమై దీవించుమా నేస్తమా ఓ ప్రియనేస్తమా ఆగుమా ఆశల వేగమా మానని గాయమింక రేపుతావా స్నేహమా ఈ జన్మకింతే మన్నించుమా మరు జన్మ ఉంటే నీదే సుమా