Maa Voori Maaraju లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Maa Voori Maaraju లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

25, డిసెంబర్ 2023, సోమవారం

Maa Voori Maaraju : Thakadheemtha Song Lyrics (తక థింత థింత తక)

చిత్రం: మా వూరి మారాజు (1994)

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర

సంగీతం: రాజ్ - కోటి




కోరస్: ఘణ ఘణ గంటలు గుండెలో మ్రోగెను మంగళ వాద్యములై గురువు గువ్వలు కమ్మగ పాడెను మన్మధ మంత్రములై అణువణువున అల్లరి మల్లెలు పూసెను ఆశల ఆమణియై పల్లవి: తక థింత థింత తక దిథోమ్ థోమ్ తక తదిగిన థోమ్ ఒక తోడు దొరికెనని కథం తొక్కినది పడుచుదనం సిరిమువ్వై చిలిపిమది ఉరికింది ఉప్పొంగి చెంగు చెంగుమని జతులాడినది శుభ తరుణం చూసుకొని తక థింత థింత తక దిథోమ్ థోమ్ తక తదిగిన థోమ్ ఒక తోడు దొరికెనని కథం తొక్కినది పడుచుదనం చరణం: 1 మెల్లగా మేలుకో ఈడులో కోరిక చల్లగా ఏలుకో కౌగిలే కోటగా ముళ్ళు వేయగ పిలిచింది పెళ్లి పందిరి వేడుక అల్లుకుందుకు రమ్మంది మల్లె పానుపు వేదిక ఇకపైన రేయిపగలు మనపాలి పూల పొదలు ఒక ప్రాణమైన వడిలో కలవాలి రెండు కథలు తక థింత థింత తక దిథోమ్ థోమ్ తక తదిగిన థోమ్ ఒక తోడు దొరికెనని కథం తొక్కినది పడుచుదనం చరణం: 2 నింగిలో రంగులే నేలపై వాలెనా గంగలో పొంగులే కన్నెగా మారెనా కోవెలే దరిచేరినది పావురానికి గూడుగా వెన్నెలే వడి చేరినది జీవితానికి తోడుగా ఎదురైన ఇంత సుఖమో ఏ పూర్వ పుణ్యఫలమో ఎదలోని వింత స్వరము ఏ వెనుక జన్మ వరమో తక థింత థింత తక దిథోమ్ థోమ్ తక తదిగిన థోమ్ ఒక తోడు దొరికెనని కథం తొక్కినది పడుచుదనం సిరిమువ్వై చిలిపిమది ఉరికింది ఉప్పొంగి చెంగు చెంగుమని జతులాడినది శుభ తరుణం చూసుకొని తక థింత థింత తక దిథోమ్ థోమ్ తక తదిగిన థోమ్ ఒక తోడు దొరికెనని కథం తొక్కినది పడుచుదనం






2, ఫిబ్రవరి 2022, బుధవారం

Maa Voori Maaraju : Amma Ninnokka Sari Song Lyrics (అమ్మా... నువ్వొక్కసారి బతకాలమ్మా...)

చిత్రం: మా వూరి మారాజు (1994)

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం

సంగీతం: రాజ్ - కోటి



పల్లవి:

అమ్మా... నువ్వొక్కసారి బతకాలమ్మా... నా గుండె చాటు బాధ నీకు చెప్పాలమ్మా.. నువ్వు లేవన్నది కల కావాలమ్మా... ఈ కంటిపాప రెప్పలేక ఉండలేదమ్మా... అమ్మా...అమ్మా...అమ్మా..... అమ్మా..నువ్వొక్కసారి బతకాలమ్మా.... నా గుండె చాటు బాధ నీకు చెప్పాలమ్మా... చరణం:1

అమ్మ పాలలోన కమ్మనైన ప్రేమ కుమ్మరించేనంట చిన్ననాడే గోరు ముద్దలతోనే కోటి ముద్దులు పెట్టి గుండే ఊయల చేసి ఊపే నా తల్లి తన మమతంతా చేరింది ఆ కాటికి సామ్రాజ్యాలే సరికావు ఆ ప్రేమకి ఏ దేవుడైన అమ్మ ప్రాణమిచ్చి వెళ్లడా.. అమ్మా....అమ్మా...అమ్మా...... అమ్మా...నువ్వొక్కసారి బతకాలమ్మా... నా గుండె చాటు బాధ నీకు చెప్పాలమ్మా... చరణం:2

పేగు తెంచుకున్నా ప్రేమ పంచుకున్నా అన్ని నాకు అమ్మే అనుకున్నా... జాలే లేని కాలం గుండే లేని దైవం చేసేనయ్యో మోసం తీరే ఈ బంధం యమపాశానికే ఇంత బలమున్నదా మన పాశాన్ని విడదీసి పోతున్నదా మా అమ్మనిచ్చి బ్రహ్మ రాత తిరిగి రాయడా అమ్మా..అమ్మా...అమ్మా.....