చిత్రం: మా వూరి మారాజు (1994)
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం
సంగీతం: రాజ్ - కోటి
పల్లవి:
అమ్మా... నువ్వొక్కసారి బతకాలమ్మా... నా గుండె చాటు బాధ నీకు చెప్పాలమ్మా.. నువ్వు లేవన్నది కల కావాలమ్మా... ఈ కంటిపాప రెప్పలేక ఉండలేదమ్మా... అమ్మా...అమ్మా...అమ్మా..... అమ్మా..నువ్వొక్కసారి బతకాలమ్మా.... నా గుండె చాటు బాధ నీకు చెప్పాలమ్మా... చరణం:1
అమ్మ పాలలోన కమ్మనైన ప్రేమ కుమ్మరించేనంట చిన్ననాడే గోరు ముద్దలతోనే కోటి ముద్దులు పెట్టి గుండే ఊయల చేసి ఊపే నా తల్లి తన మమతంతా చేరింది ఆ కాటికి సామ్రాజ్యాలే సరికావు ఆ ప్రేమకి ఏ దేవుడైన అమ్మ ప్రాణమిచ్చి వెళ్లడా.. అమ్మా....అమ్మా...అమ్మా...... అమ్మా...నువ్వొక్కసారి బతకాలమ్మా... నా గుండె చాటు బాధ నీకు చెప్పాలమ్మా... చరణం:2
పేగు తెంచుకున్నా ప్రేమ పంచుకున్నా అన్ని నాకు అమ్మే అనుకున్నా... జాలే లేని కాలం గుండే లేని దైవం చేసేనయ్యో మోసం తీరే ఈ బంధం యమపాశానికే ఇంత బలమున్నదా మన పాశాన్ని విడదీసి పోతున్నదా మా అమ్మనిచ్చి బ్రహ్మ రాత తిరిగి రాయడా అమ్మా..అమ్మా...అమ్మా.....
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి