Maharshi లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Maharshi లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

24, ఏప్రిల్ 2022, ఆదివారం

Maharshi : Sumam Prati Sumam Song Lyrics (సుమం ప్రతి సుమం సుమం)

చిత్రం: మహర్షి (1987)

సాహిత్యం: నాయని కృష్ణమూర్తి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం,ఎస్.జానకి

సంగీతం: ఇళయరాజా




ఆఆఆఅ... ఆఆఆఅ.ఆఆఅ... ఆఆ.ఆఅ.ఆఆఆఆ... తననానననా తననాననా సుమం ప్రతి సుమం సుమం వనం ప్రతి వనం వనం సుమం ప్రతి సుమం సుమం వనం ప్రతి వనం వనం జగం అణువణువున కల కలలం భానోదయానా చంద్రోదయాలు సుమం ప్రతి సుమం సుమం వనం ప్రతి వనం వనం హ.హా అ.ఆ... ఆ... ఆ... ఆ ఆ... హ... ఆ... ఆ... ఆ వేణువా వీణియా. ఏవిటీ రాగము వేణువా వీణియా. ఏవిటీ రాగము అచంచలం సుఖం మధుర మధురం మయం బృదం తరం గిరిజ సురతం ఈ వేళ నాలో రాగోల్లసాలు... ఈ వేళ నాలో రాగోల్లసాలు కాదు మనసా... ఆ... ప్రేమ మహిమా. నాదు హృదయం భానోదయానా చంద్రోదయాలు సుమం ప్రతి సుమం సుమం వనం ప్రతి వనం వనం హాఆఆ. తార రత్తార రతార తారరత్తార రతార ఆ. ఆ.ఆ. ఆ. ఆ. ఆ. రంగులే రంగులు అంబరానంతట రంగులే రంగులు అంబరానంతట సగం నిజం సగం వరము అమరం వరం వరం వరం చెలియ ప్రణయం ఆ వేగమేది నాలోన లేదు ఆ వేగమేది నాలోన లేదు ప్రేమమయమూ... ఆ... ప్రేమ మయమూ నాదు హృదయం భానోదయానా చంద్రోదయాలు సుమం ప్రతి సుమం సుమం వనం ప్రతి వనం వనం సుమం ప్రతి సుమం సుమం వనం ప్రతి వనం వనం జగం అణువణువునా కలకలలం భానోదయానా చంద్రోదయాలు సుమం ప్రతి సుమం సుమం వనం ప్రతి వనం వనం



23, ఏప్రిల్ 2022, శనివారం

Maharshi : Konalo Song Lyrics (కోనలో సన్న జాజిమల్లి జాజిమల్లి )

చిత్రం: మహర్షి (1987)

సాహిత్యం: జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం,ఎస్.జానకి

సంగీతం: ఇళయరాజా



కోనలో సన్న జాజిమల్లి  జాజిమల్లి  మేనులో పొన్న పూలవల్లి పాలవల్లి వేణిలో కన్నె నాగమల్లి నాగమల్లి తేరులో అనురాగవల్లి రాగవల్లి కావ్యాలకే హో శ్రీకారమై హో కస్తూరి తాంబూలమీవే కోరుకో సన్న జాజిమల్లి  జాజిమల్లి  ఏలుకో కన్నె సోకులన్నీ సోకులన్నీ పాడుకో ప్రేమ కవితలన్నీ కవితలన్నీ వేసుకో పాలబుగ్గపైన రంగవల్లి మేని సోయగాలు ప్రేమ బంధనాలు మౌన స్వాగతాలు రాగ రంజితాలు సరసములో సమరములు సరసులకు సహజములు ప్రాభావాలలోన నవ శోభనాలు జాణ రాగదే రాగమై రాధవై కోరుకో సన్న జాజిమల్లి  జాజిమల్లి  ఏలుకో కన్నె సోకులన్నీ సోకులన్నీ పాడుకో ప్రేమ కవితలన్నీ కవితలన్నీ వేసుకో పాలబుగ్గపైన రంగవల్లి రాగాలనే హోయ్   బోయిలతో హోయ్ మేఘాల మేనల్లో రానా కోనలో సన్న జాజిమల్లి  జాజిమల్లి  మేనులో పొన్న పూలవల్లి పాలవల్లి వేణిలో కన్నె నాగమల్లి నాగమల్లి తేరులో అనురాగవల్లి రాగవల్లి కోయిలమ్మ రాగం కొండవాగు వేగం పారిజాత సారం ఏకమైన రూపం అధరముపై అరుణిమలు మధురిమకై మధనములు  నందనాలలోన రసమందిరాలలోన హాయిగా సాగగ చేరగా కోనలో సన్న జాజిమల్లి  జాజిమల్లి  మేనులో పొన్న పూలవల్లి పాలవల్లి వేణిలో కన్నె నాగమల్లి నాగమల్లి తేరులో అనురాగవల్లి రాగవల్లి కావ్యాలకే హో శ్రీకారమై హో కస్తూరి తాంబూలమీవే కోరుకో సన్న జాజిమల్లి  జాజిమల్లి  ఏలుకో కన్నె సోకులన్నీ సోకులన్నీ పాడుకో ప్రేమ కవితలన్నీ కవితలన్నీ వేసుకో పాలబుగ్గపైన రంగవల్లి

Maharshi : Urvashi Rambha Song Lyrics (ఊర్వశీ గ్లౌభా.. )

చిత్రం: మహర్షి (1987)

సాహిత్యం: జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం,కె.యస్.చిత్ర

సంగీతం: ఇళయరాజా



ఊర్వశీ గ్లౌభా.. ప్రేయసీ హ్రీ మా.. అస్మత్ విద్వత్ విద్యుత్ దీపిక త్వంయేవ.. రసవత్ విలసత్ విభవత్ గీతిక త్వంయేవ.. లసత్ చమత్కృతి నటత్ ప్రతిద్యుతి ఘనత్ హరిద్మణి త్వంయేవ.. చుంబద్ ప్రమోద జృంబద్ ప్రవాహ ధవళ గగనధురి త్వంయేవ.. భజే భజే భజరే భజే భజే... భజరే (భజించరే) - జపరే (జపించరే) భజ భజ భజ భజ - జప జప జప జప.. నమ్రామ్రద్రుమ తమ్రణవోద్యమ స్వరభుత్సుకసఖి త్వంయేవ.. నికట ప్రకట ఘట ఘటిత త్రిపుట స్పుట నినదనిధానం త్వంయేవ ...

Maharshi : Sahasam Naa Padam Song Lyrics (సాహసం నా పథం)

చిత్రం: మహర్షి (1987)

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం

సంగీతం: ఇళయరాజా



సాహసం నా పథం రాజసం నా రథం సాగితే ఆపడం సాధ్యమా పౌరుషం ఆయుధం పోరులో జీవితం కైవసం కావడం కష్టమా లోకమే బానిసై చేయదా ఊడిగం శాశనం దాటడం సఖ్యమా నా పదగతిలో ఏ ప్రతి ఘటన ఈ పిడికిటిలో తానొదుగునుగా సాహసం నా పథం  రాజసం నా రథం సాగితే ఆపడం సాధ్యమా నిశ్చయం నిశ్చలం నిర్బయం నా హయాం హా కానిదేముంది నే కోరుకుంటే బూని సాధించుకోనా లాభమేముంది కలకాలముంటే కామితం తీరకుండా తప్పనీ ఒప్పనీ తర్కమే చెయ్యను కష్టమో నష్టమో లెక్కలే వెయ్యను ఊరుకుంటే కాలమంతా జారిపోదా ఊహ వెంట నే మనసు పడితే ఏ కళలనైనా ఈ చిటిక కొడుతూ నే పిలవనా సాహసం నా పథం రాజసం నా రథం సాగితే ఆపడం సాధ్యమా పౌరుషం ఆయుధం పోరులో జీవితం కైవసం కావడం కష్టమా అదరనీ బెదరనీ ప్రవుత్తి ఒదగనీ మదగజమే మహర్షి వేడితే లేడి ఒడి చేరుతుందా..వేట సాగాలి కాదా ఓడితే జాలి చూపేన కాలం..కాలరాసేసి పోదా అంతము సొంతము పంతమే వీడను మందలో పందిలా ఉండనే ఉండను భీరువల్లే పారిపోనూ..రేయి ఒళ్ళో దూరిపోను నే మొదలుపెడితే ఏ సమరమైనా నా కెదురుపడునా ఏ అపజయం సాహసం నా పథం రాజసం నా రథం సాగితే ఆపడం సాధ్యమా పౌరుషం ఆయుధం పోరులో జీవితం కైవసం కావడం కష్టమా లోకమే బానిసై చేయదా ఊడిగం శాశనం దాటడం సఖ్యమా నా పదగతిలో ఏ ప్రతి ఘటన ఈ పిడికిటిలో తానొదుగునుగా సాహసం నా పథం  రాజసం నా రథం సాగితే ఆపడం సాధ్యమా

4, జూన్ 2021, శుక్రవారం

Maharshi : Matarani Mounamidi Song Lyrics (మాటరాని మౌనమిది మౌనవీణ గానమిది)

చిత్రం: మహర్షి (1987)

సాహిత్యం: వెన్నెలకంటి

గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం , ఎస్.జానకి

సంగీతం: ఇళయరాజా


మాటరాని మౌనమిది మౌనవీణ గానమిది [2] గానమిది నా ధ్యానమిది ధ్యానములొ నా ప్రాణమిది...  ప్రాణమైన మూగగుండె రాగమిది మాటరాని మౌనమిది మౌనవీణ గానమిది  [2] ముత్యాలపాటల్లొ కోయిలమ్మా..  ముద్దారపోసేది ఎప్పుడమ్మా ఆ పాలనవ్వుల్లొ వెన్నెలమ్మా..  దీపాలు పెట్టేది ఎన్నడమ్మా ఈ మౌనరాగాల ప్రేమావేశం ఏనాడో ఒకరి సొంతం ఆకాశదీపాలు జాబిలి కోసం.. నీకేల ఇంత పంతం నింగి నేల కూడేవేళ.. నీకు నాకు దూరాలేలా... అందరాని కొమ్మ ఇది... కొమ్మచాటు అందమిది.. మాటరాని మౌనమిది మౌనవీణ గానమిది చైత్రాన కూసేను కోయిలమ్మా... గ్రీష్మానికాపాట ఎందుకమ్మా రేయంత నవ్వేను వెన్నేలమ్మా... నీరెండకానవ్వు ఎందుకమ్మా రాగాల తీగల్లో వీణానాదం... కోరింది ప్రణయ వేదం వేశారు గుండెల్లొ రేగే గాయం.. పాడింది మధురగేయం ఆకాశానా తారాతీరం.. అంతేలేనీ ఎంతో దూరం మాటరాని మౌనమిది మౌనవీణ గానమిది అందరాని కొమ్మ ఇది... కొమ్మచాటు అందమిది.. కూడనిదీ జతకూడనిదీ.. చూడనిదీ మదిపాడనిదీ.. చెప్పరాని చిక్కుముడి వీడనిదీ మాటరాని మౌనమిది మౌనవీణ గానమిది అందరాని కొమ్మ ఇది... కొమ్మచాటు అందమిది.