చిత్రం: మహర్షి (1987)
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం
సంగీతం: ఇళయరాజా
సాహసం నా పథం రాజసం నా రథం సాగితే ఆపడం సాధ్యమా పౌరుషం ఆయుధం పోరులో జీవితం కైవసం కావడం కష్టమా లోకమే బానిసై చేయదా ఊడిగం శాశనం దాటడం సఖ్యమా నా పదగతిలో ఏ ప్రతి ఘటన ఈ పిడికిటిలో తానొదుగునుగా సాహసం నా పథం రాజసం నా రథం సాగితే ఆపడం సాధ్యమా నిశ్చయం నిశ్చలం నిర్బయం నా హయాం హా కానిదేముంది నే కోరుకుంటే బూని సాధించుకోనా లాభమేముంది కలకాలముంటే కామితం తీరకుండా తప్పనీ ఒప్పనీ తర్కమే చెయ్యను కష్టమో నష్టమో లెక్కలే వెయ్యను ఊరుకుంటే కాలమంతా జారిపోదా ఊహ వెంట నే మనసు పడితే ఏ కళలనైనా ఈ చిటిక కొడుతూ నే పిలవనా సాహసం నా పథం రాజసం నా రథం సాగితే ఆపడం సాధ్యమా పౌరుషం ఆయుధం పోరులో జీవితం కైవసం కావడం కష్టమా అదరనీ బెదరనీ ప్రవుత్తి ఒదగనీ మదగజమే మహర్షి వేడితే లేడి ఒడి చేరుతుందా..వేట సాగాలి కాదా ఓడితే జాలి చూపేన కాలం..కాలరాసేసి పోదా అంతము సొంతము పంతమే వీడను మందలో పందిలా ఉండనే ఉండను భీరువల్లే పారిపోనూ..రేయి ఒళ్ళో దూరిపోను నే మొదలుపెడితే ఏ సమరమైనా నా కెదురుపడునా ఏ అపజయం సాహసం నా పథం రాజసం నా రథం సాగితే ఆపడం సాధ్యమా పౌరుషం ఆయుధం పోరులో జీవితం కైవసం కావడం కష్టమా లోకమే బానిసై చేయదా ఊడిగం శాశనం దాటడం సఖ్యమా నా పదగతిలో ఏ ప్రతి ఘటన ఈ పిడికిటిలో తానొదుగునుగా సాహసం నా పథం రాజసం నా రథం సాగితే ఆపడం సాధ్యమా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి