Major Chandrakanth లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Major Chandrakanth లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

25, మార్చి 2022, శుక్రవారం

Major Chandrakanth : Neekavalasindhi Song Lyrics (నీక్కావలసింది నా దగ్గర ఉంది)

చిత్రం: మేజర్ చంద్రకాంత్ (1993)

సాహిత్యం: గురుచరణ్

సంగీతం: ఎం.ఎం. కీరవాణి

గానం: మనో , కె.యస్.చిత్ర



నీక్కావలసింది నా దగ్గర ఉంది నీక్కావలసింది నా దగ్గర ఉంది అందుకో చిరు కానుకా చూసుకో చలి వేడుకా ముందే తెలిసింది నీలో పస ఉంది ముందే తెలిసింది నీలో పస ఉంది అయ్యహో అభిసారిక అప్పుడే చలరేగకా ఆకు పోక చూసుకో కొరికేది ఏనాడు చెప్పుకో సోకు సున్నం రాసుకో సొగసంతా మడిచేసి ఇచ్చుకో సరాసరిగా రమ్మంటు నిన్నే పిలవాలి తొలిసారి అ ఆ నరనరాలా జుమ్మంటు నేనే తగలాలి ప్రతిసారి ధీమ్ తరికిట ధీమ్ తరికిట దీని కాలి అందెలు తాం తరికిట తాం తరికిట తాలమేయగా పలకాలి నీపాట పరువాల నా తోట చం చం చం నీక్కావలసింది నా దగ్గర ఉంది ముందే తెలిసింది నీలో పస ఉంది అయ్యహో అభిసారిక చూసుకో చలి వేడుకా ఆటు పోటూ గుండెలో అదిరింది కుర్రదాని వెన్నులో చాటు ఘాటు ముద్దులో మునిగాడు కుర్రాడు మత్తులో ఎడాపెడాగా ఈ మంచు ఇట్టా కురిసేనా తెలిసేనా అ ఆ తడి పొడిగా తెల్లార్లు నీతో తడిసేనా తరిమేనా ఝం జమ్మని ఝం జమ్మని జాజి పూల పూజలో ఘమ్ ఘుమ్మని ఘమ్ ఘుమ్మని మూడు రాత్రులు నలగాలి నీ ఈడు నాతోడు ఈ వేళ ఝం ఝం ఝం నీక్కావలసింది నా దగ్గర ఉంది నీక్కావలసింది నా దగ్గర ఉంది అందుకో చిరు కానుకా చూసుకో చలి వేడుకా ముందే తెలిసింది నీలో పస ఉంది ముందే తెలిసింది నీలో పస ఉంది అయ్యహో అభిసారిక అప్పుడే చలరేగకా

30, అక్టోబర్ 2021, శనివారం

Major Chandrakanth : Sukhibhava Sumangali Song Lyrics (సుఖీభవ సుమంగళీ )

చిత్రం: మేజర్ చంద్రకాంత్ (1993)

సాహిత్యం: జాలాది

సంగీతం: ఎం.ఎం. కీరవాణి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర



సుఖీభవ సుమంగళీ సుఖీభవా.ఆ. ఆ. సుశీలవై చిరావువై సుఖీభవా.ఆ. ఆ. ఈ బాల వాక్కు బ్రహ్మ వాక్కు ఒక్కటేననీ నిండుగా నూరేళ్లుగా ఉండి పొమ్మనీ సుఖీభవ సుమంగళీ సుఖీభవా.ఆ. ఆ. సుశీలవై చిరావువై సుఖీభవా.ఆ. ఆ. శతమానం భవతి అనీ నిన్ను దీవించీ గతకాలం స్మృతి లొనే బ్రతుకు సాగించి ఆ కుంకుమ రేకుల కెంపులు పూయగా ఆ పూసిన పువ్వుల నోములు పండగా కదలి రావమ్మా. ఆ.ఆ... ఈ బాల వాక్కు బ్రహ్మ వాక్కు ఒక్కటేననీ నిండుగా నూరేళ్లుగా ఉండి పొమ్మనీ సుఖీభవ సుమంగళీ సుఖీభవా.ఆ. ఆ. సుశీలవై చిరావువై సుఖీభవా.ఆ. ఆ. అనురాగం కోవెలలో ఆది దంపతులై కనులారా మిము చూసి జన్మ ధన్యమై ఒక జీవిత కాలం చాలని ప్రేమలో సుఖ శాంతులు విరిసే చల్లని తల్లిగా నిలిచి పోవమ్మా... ఆ... ఆ... ఈ బాల వాక్కు బ్రహ్మ వాక్కు ఒక్కటేననీ నిండుగా నూరేళ్లుగా ఉండి పొమ్మనీ సుఖీభవ సుమంగళీ సుఖీభవా.ఆ. ఆ. సుశీలవై చిరావువై సుఖీభవా.ఆ. ఆ.

2, ఆగస్టు 2021, సోమవారం

Major Chandrakanth : Uliki Padaku Allari Moguda Song Lyrics (ఉలికిపడకు అల్లరిమొగుడా ఊపరా ఉయ్యాల )

చిత్రం: మేజర్ చంద్రకాంత్ (1993)

సంగీతం:ఎం.ఎం.కీరవాణి

సాహిత్యం: రస రాజు

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర


ఉలికిపడకు అల్లరిమొగుడా ఊపరా ఉయ్యాల సరసమాడే సమయమిపుడా ఆపవే నీ గోల ముద్దులతోనే రుద్దు రుద్దు మద్దెలతాళం వద్దు వద్దు సరసుడవే...ఏ..ఏ.. ఉలికిపడకు అల్లరిమొగుడా ఊపరా ఉయ్యాల సరసమాడే సమయమిపుడా ఆపవే నీ గోల పెళ్ళై ఎన్నాళ్ళో కావొచ్చెనమ్మా మొగుడుండీ ఏ ఆటా ఆడించడమ్మా పేచీకి రానంటే ఓ ముద్దుగుమ్మా పేకాడుకుందాము కాసేపు ఓయమ్మా ముక్కాటకొస్తావా ఉయ్యాలో సై నీ ఆట కట్టిస్తా ఇయ్యాల ముక్కెంత చెప్పమ్మ ఉయ్యాలో ఆ కౌంటు నీకెంత ఇయ్యాలో ముద్దుకు కౌంటు వద్దు వద్దు హద్దులు దాటే పొద్దు పొద్దు మగసిరివే...ఏ..ఏ..!! ఉలికిపడకు అల్లరిమొగుడా ఊపరా ఉయ్యాల సరసమాడే సమయమిపుడా ఆపవే నీ గోల ముస్తాబు అయ్యారు అమ్మాయిగారు ఏంచేయమంటారో చెబుతారా మీరు అత్తరుబుడ్డికి అబ్బాయిగారు సీలూడదీస్తారా శ్రీవారు మీరు అందాక వచ్చాక ఉయ్యాలో నీకు అగచాట్లు తప్పేనా డియ్యాలో దొంగోడు దొంగాడే ఉయ్యాలో నాకు లొంగను అంటాదే ఇయ్యాల సర్దుకుపోతే ముద్దు ముద్దు అత్తరుతీసి రుద్దు రుద్దు సొగసరివే...ఏ...ఏ...!!


ఉలికిపడకు అల్లరిమొగుడా ఊపరా ఉయ్యాల సరసమాడే సమయమిపుడా ఆపవే నీ గోల ముద్దులతోనే రుద్దు రుద్దు మద్దెలతాళం వద్దు వద్దు సరసుడవే...ఏ..ఏ.. ఉలికిపడకు అల్లరిమొగుడా ఊపరా ఉయ్యాల సరసమాడే సమయమిపుడా ఆపవే నీ గోల

Major Chandrakanth : Muddutho Onamalu Song Lyrics (ముద్దుతో ఓనమాలు నేర్పించనా)

చిత్రం: మేజర్ చంద్రకాంత్ (1993)

సంగీతం:ఎం.ఎం.కీరవాణి

సాహిత్యం: ఎం.ఎం.కీరవాణి

గానం: ఏసుదాస్, కే.స్.చిత్ర



ఓ. ఓ. ఓ. ఓ. ముద్దుతో ఓనమాలు నేర్పించనా ఓ. ఓ. ఓ. ఓ. సిగ్గుల్లో ఆనవాలు చూపించనా భామా . ఆ. ఆ కౌగిళ్ళ బళ్ళోకి రా రా ప్రేమా ... ఈ జంట పలికింది నీ పాఠమేనమ్మ ఓ . ఓ. ఓ ... ఓ ముద్దుతో ఓనమాలు నేర్పించనా ఓ. ఓ. ఓ. ఓ సిగ్గుల్లో ఆనవాలు చూపించనా ఎంచక్క నా మనసే నీ కోసం పలకను చేశానమ్మా ఓపిగ్గ అ ఆ ఇ ఈ దిద్దే పనితనమే నీదమ్మా గాలికి సరిగమ నేర్పిన రాగములో ఈలలు వేసిన అల్లరి చదువులలో వందేళ్ళు వల్లిస్తే చాలు... ఎన్నో శృంగార నైషధాలు ప్రేమా ... ఆ... ఆ. నీ మౌనమొక భాషాగా చేసుకున్నాక ఓ. ఓ. ఓ. ఓ. ముద్దుతో ఓనమాలు నేర్పించనా ఓ. ఓ. ఓ. ఓ. సిగ్గుల్లో ఆనవాలు చూపించనా తెచ్చాను పెద్ద బాలశిక్ష మెదడుకి పెద్ద మేత వేసాను ముద్దు పాలశిక్ష పెదవుల తీపిరాత వరసలు కలిసే వచనం వింటావా చొరవలు పెరిగే సరదా చూస్తావా మధుర శృతుల లీల... ఇది మదన లయల గోల రోజూ ఉ ఉ అధరాల ముంగిళ్ళ ఎంగిళ్ళ కళ్ళాపి. ఓ. ఓ. ఓ. ఓ ముద్దుతో ఓనమాలు నేర్పించనా ఓ... ఓ. ఓ. ఓ సిగ్గుల్లో ఆనవాలు చూపించనా భామా ఆ ఆ కౌగిళ్ళ బళ్ళోకి రా రా ప్రేమా. ఆ. ఆ. ఈ జంట పలికింది నీ పాఠమేనమ్మ ఓ. ఓ. ఓ. ఓ. ముద్దుతో ఓనమాలు నేర్పించనా ఓ. ఓ. ఓ. ఓ. సిగ్గుల్లో ఆనవాలు చూపించనా

19, జులై 2021, సోమవారం

Major Chandrakanth : Punya Bhoomi Naa Desham Song Lyrics (పుణ్యభూమి నా దేశం నమో నమామీ)

చిత్రం: మేజర్ చంద్రకాంత్

సంగీతం:ఎం.ఎం.కీరవాణి

సాహిత్యం: జాలాది

గానం: S.P.బాలసుబ్రహ్మణ్యం 



పుణ్యభూమి నా దేశం నమో నమామీ ధన్య భూమి నా దేశం సదా స్మరామీ

పుణ్యభూమి నా దేశం నమో నమామీ ధన్య భూమి నా దేశం సదా స్మరామీ నన్ను కన్న నా దేశం నమో నమామీ, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామీ మహామహుల కన్న తల్లి నా దేశం మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయదేశం .... నా దేశం పుణ్యభూమి నా దేశం నమో నమామీ ధన్య భూమి నా దేశం సదా స్మరామీ అదిగో ఛత్రపతీ ధ్వజమెత్తిన ప్రజాపతి మతోన్మాద శక్తులు చురకత్తులు జడిపిస్తే మానవతుల మాంగళ్యం మంట కలుపుతుంటే ... ఆఆ.. ఆ క్షుద్ర రాజకీయానికి రుద్రనేత్రుడై లేచి మాతృ భూమి నుదిటిపై నెత్తురు తిలకం దిద్దిన మహా వీరుడు సార్వభౌముడు.. అడుగో అరి భయంకరుడు కట్ట బ్రహ్మన అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన..

అడుగో అరి భయంకరుడు కట్ట బ్రహ్మన అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన.. ఒరెయ్ ఎందుకు కట్టాలి రా శిస్తు... నారు పోసావా.. నీరు పెట్టావా.. కోత కోసావా కుప్ప నుల్చావా.. ఒరెయ్ తెల్ల కుక్క కష్ట జీవుల ముష్టి తిని బ్రతికే నీకు శిస్తెందుకు కట్టాలి రా.. అని పెల పెల సంకెళ్ళు తెంచి స్వరాజ్య పోరాటమెంచి,, ఉరికొయ్యల ఉగ్గు పాలు తాగాడు కన్న భూమి ఒడిలోనే ఒదిగాడు.. పుణ్యభూమి నా దేశం నమో నమామీ ధన్య భూమి నా దేశం సదా స్మరామీ నన్ను కన్న నా దేశం నమో నమామీ, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామీ అదిగదిగో అదిగదిగో ఆకాశం భళ్ళున తెల్లారి వస్తున్నాడదిగో మన అగ్గి పిడుగు అల్లూరి ఎవడు రా నా భరత జాతిని తత్వమడిగిన తుచ్చుడు ఎవడు ఎవడాపొగరు బట్టిన తెల్ల దొర గాడెవ్వడు బ్రతుకు తెరువుకు దేశమొచ్చి బానిసలుగా మమ్మునెంచి పన్నులడిగే కొమ్ములొచిన దమ్ములెవడికి వచ్చరా... బడుగు జీవులు బగ్గుమంటే ఉడుకు నెత్తురు ఉప్పెనైతే ఆ చండ్ర నిప్పుల తండ్ర గొడ్డలి పన్ను కడతది చూడరా.. అన్న ఆ మన్నెం దొర అల్లూరిని చుట్టు ముట్టి మంది మార్బలమెత్తి మర ఫిరంగులెక్కు పెట్టి వంద గుళ్ళు ఒక్కసారి పేల్చితే వందే మాతరం వందే మాతరం వందే మాతరం అన్నది ఆ ఆకాశం.. ఆజాదు హిందు ఫౌజు దళపతి నేతాజి.. అఖండ భరత జాతి కన్న మరో శివాజి.. సాయుధ సంగ్రామమే న్యాయమని.. స్వతంత్ర భారతావని మన స్వర్గమని.. ప్రతి మనిషొక సైనికుడై ప్రాణార్పన చెయ్యాలని హిందు ఫౌజు జైహింద్ అని గడిపాడు గగన సిగలకెగసి కనుమరుగై పోయడు జోహార్ జోహార్ సుభాష్ చంద్ర బోస్..

జోహార్ జోహార్ సుభాష్ చంద్ర బోస్.. గాంధీజి కలలు కన్న స్వరాజ్యం.. సాదించే సమరం లో అమర జ్యొతులై వెలిగే ద్రువతారలు కన్నది ఈ దేశం,, చరితార్దులకన్నది నా భారత దేశం.. నా దేశం