చిత్రం: మేజర్ చంద్రకాంత్ (1993)
సంగీతం:ఎం.ఎం.కీరవాణి
సాహిత్యం: ఎం.ఎం.కీరవాణి
గానం: ఏసుదాస్, కే.స్.చిత్ర
ఓ. ఓ. ఓ. ఓ. ముద్దుతో ఓనమాలు నేర్పించనా ఓ. ఓ. ఓ. ఓ. సిగ్గుల్లో ఆనవాలు చూపించనా భామా . ఆ. ఆ కౌగిళ్ళ బళ్ళోకి రా రా ప్రేమా ... ఈ జంట పలికింది నీ పాఠమేనమ్మ ఓ . ఓ. ఓ ... ఓ ముద్దుతో ఓనమాలు నేర్పించనా ఓ. ఓ. ఓ. ఓ సిగ్గుల్లో ఆనవాలు చూపించనా ఎంచక్క నా మనసే నీ కోసం పలకను చేశానమ్మా ఓపిగ్గ అ ఆ ఇ ఈ దిద్దే పనితనమే నీదమ్మా గాలికి సరిగమ నేర్పిన రాగములో ఈలలు వేసిన అల్లరి చదువులలో వందేళ్ళు వల్లిస్తే చాలు... ఎన్నో శృంగార నైషధాలు ప్రేమా ... ఆ... ఆ. నీ మౌనమొక భాషాగా చేసుకున్నాక ఓ. ఓ. ఓ. ఓ. ముద్దుతో ఓనమాలు నేర్పించనా ఓ. ఓ. ఓ. ఓ. సిగ్గుల్లో ఆనవాలు చూపించనా తెచ్చాను పెద్ద బాలశిక్ష మెదడుకి పెద్ద మేత వేసాను ముద్దు పాలశిక్ష పెదవుల తీపిరాత వరసలు కలిసే వచనం వింటావా చొరవలు పెరిగే సరదా చూస్తావా మధుర శృతుల లీల... ఇది మదన లయల గోల రోజూ ఉ ఉ అధరాల ముంగిళ్ళ ఎంగిళ్ళ కళ్ళాపి. ఓ. ఓ. ఓ. ఓ ముద్దుతో ఓనమాలు నేర్పించనా ఓ... ఓ. ఓ. ఓ సిగ్గుల్లో ఆనవాలు చూపించనా భామా ఆ ఆ కౌగిళ్ళ బళ్ళోకి రా రా ప్రేమా. ఆ. ఆ. ఈ జంట పలికింది నీ పాఠమేనమ్మ ఓ. ఓ. ఓ. ఓ. ముద్దుతో ఓనమాలు నేర్పించనా ఓ. ఓ. ఓ. ఓ. సిగ్గుల్లో ఆనవాలు చూపించనా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి