Malleeswari లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Malleeswari లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

17, ఆగస్టు 2022, బుధవారం

Malleswari : Pilichina Biguvataraa Song Lyrics ( పిలచిన బిగువటరా ఔరర)

చిత్రం: మల్లీశ్వరి (1958)

రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి

గానం: భానుమతి 

సంగీతం: అద్దేపల్లి రామ రావు, సాలూరి రాజేశ్వర రావు



పిలచిన బిగువటరా ఔరర పిలచిన బిగువటరా ఔరర "పిలచిన" చెలువలు తామే వలచివచ్చిన పిలచిన బిగువటరా ఔరర భళిరా...రాజా.... ఈ నయగారము ఈ వయ్యారము "ఈ నయ" ఈ నవయవ్వనమానగ నిను నే పిలచిన బిగువటరా గాలుల తేలెను గాఢపు మమతలు నీలపు మబ్బుల నీడలు కదిలెను అందెల రవళుల సందడి మరి మరి "అందెల" అందగాడ ఇటు తొందరజేయగ పిలచిన బిగువటరా ఔరర

Malleswari : Aakasa Veedilo Song Lyrics (ఆకాశవీధిలో )

చిత్రం: మల్లీశ్వరి (1958)

రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి

గానం: ఘంటసాల & భానుమతి 

సంగీతం: అద్దేపల్లి రామ రావు, సాలూరి రాజేశ్వర రావు


ఆకాశవీధిలో హాయిగా ఎగిరేవు దేశ దేశాలన్ని తిరిగి చూసేవూ ఏడ తానున్నాడో బావా (2) జాడ తెలిసిన పోయిరావా అందాల ఓ మేఘమాల (2) గగన సీమల తేలు ఓ మేఘమాల మా ఊరు గుడిపైన మసలి వస్తున్నావా మల్లి మాటేదైన నాతో మనసు చల్లగా చెప్పిపోవా నీలాల ఓ మేఘమాల రాగాల ఓ మేఘమాల మమతలెరిగిన మేఘమాల (2) నా మనసు బావకు చెప్పిరావా ఎన్నాళ్ళు నా కళ్ళు దిగులుతో రేపవలు (2) ఎదురుతెన్నులు చూచెనే బావకై చెదరి కాయలు కాచెనే అందాల ఓ మేఘమాల రాగాల ఓ మేఘమాల మనసు తెలిసిన మేఘమాలా మరువలేనని చెప్పలేవా మల్లితో మరువలేనని చెప్పలేవా కళ్ళు తెరచినగాని కళ్ళు మూసినగాని (2) మల్లి రూపే నిలిచెనే నా చెంత మల్లి మాటే పిలిచెనే జాలిగుండెల మేఘమాలా బావలేనిది బ్రతుకజాల జాలిగుండెల మేఘమాలా కురియు నా కన్నీరు గుండెలో దాచుకుని వానజల్లుగ కురిసిపోవా కన్నీరు ఆనవాలుగ బావబోల