చిత్రం: మల్లీశ్వరి (1958)
రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం: ఘంటసాల & భానుమతి
సంగీతం: అద్దేపల్లి రామ రావు, సాలూరి రాజేశ్వర రావు
ఆకాశవీధిలో హాయిగా ఎగిరేవు దేశ దేశాలన్ని తిరిగి చూసేవూ ఏడ తానున్నాడో బావా (2) జాడ తెలిసిన పోయిరావా అందాల ఓ మేఘమాల (2) గగన సీమల తేలు ఓ మేఘమాల మా ఊరు గుడిపైన మసలి వస్తున్నావా మల్లి మాటేదైన నాతో మనసు చల్లగా చెప్పిపోవా నీలాల ఓ మేఘమాల రాగాల ఓ మేఘమాల మమతలెరిగిన మేఘమాల (2) నా మనసు బావకు చెప్పిరావా ఎన్నాళ్ళు నా కళ్ళు దిగులుతో రేపవలు (2) ఎదురుతెన్నులు చూచెనే బావకై చెదరి కాయలు కాచెనే అందాల ఓ మేఘమాల రాగాల ఓ మేఘమాల మనసు తెలిసిన మేఘమాలా మరువలేనని చెప్పలేవా మల్లితో మరువలేనని చెప్పలేవా కళ్ళు తెరచినగాని కళ్ళు మూసినగాని (2) మల్లి రూపే నిలిచెనే నా చెంత మల్లి మాటే పిలిచెనే జాలిగుండెల మేఘమాలా బావలేనిది బ్రతుకజాల జాలిగుండెల మేఘమాలా కురియు నా కన్నీరు గుండెలో దాచుకుని వానజల్లుగ కురిసిపోవా కన్నీరు ఆనవాలుగ బావబోల
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి