Moodu mullu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Moodu mullu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

16, జులై 2022, శనివారం

Moodu Mullu : Nee Kosam Yavvanamantaa Song Lyrics (నీ కోసం యవ్వనమంతా)

చిత్రం: మూడు ముళ్ళు (1983)

రచన: వేటూరి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం,పి. సుశీల

సంగీతం: రాజన్–నాగేంద్ర


పల్లవి: నీ కోసం యవ్వనమంతా దాచాను మల్లెలలో నీ కోసం జీవితమంతా వేచాను సందెలలో మలి సందెలు మల్లెపూలు మనువాడిన వేళలలో.. నీ కోసం యవ్వనమంతా దాచాను మల్లెలలో నీ కోసం జీవితమంతా వేచాను సందెలలో చరణం 1: లాలాలాల..లాల్లలలా..లాలాలాల..లాల్లలలా లాలాలాల..లాలా... అటు చూడకు జాబిలి వైపు..కరుగుతుంది చుక్కలుగా.. చలి చీకటి చీర లోనే సొగసంతా దాచుకో అటు వెళ్ళకు దిక్కుల వైపు..కలుస్తాయి ఒక్కటిగా.. నా గుప్పెడు గుండె లోనే జగమంతా ఏలుకో నా హృదయం టూ-లెటు కాదు..మన జంటకి డ్యూయెటు లేదు ఆ మాటే విననూ..మాట పడనూ..ఊరుకోను! నీ కోసం జీవితమంతా వేచాను సందెలలో నీ కోసం యవ్వనమంతా దాచాను మల్లెలలో మలి సందెలు మల్లెపూలు మనువాడిన వేళలలో.. నీ కోసం జీవితమంతా వేచాను సందెలలో నీ కోసం యవ్వనమంతా దాచాను మల్లెలలో చరణం 2: అటు చూడకు లోకం వైపు..గుచ్చుతుంది చూపులతో.. ఒడి వెచ్చని నీడ లోనే బిడియాలని పెంచుకో అటు వెళ్ళకు చీకటి వైపు..అంటుతుంది ఆశలతో విరి సెయ్యల వేడి లోనే పరువాలను పంచుకో నా కొద్దీ కసి కాలేజీ..మానేస్తా నే మ్యారేజి మరులన్నీ మనవీ..అన్న మనవే..చేసుకున్నా! నీ కోసం యవ్వనమంతా దాచాను మల్లెలలో నీ కోసం జీవితమంతా వేచాను సందెలలో మలి సందెలు మల్లెపూలు మనువాడిన వేళలలో.. ఆహాహా..హాహాహా..లాలాల లాలలా... ఆహాహా..హాహాహా..లాలాల లాలలా...

30, మార్చి 2022, బుధవారం

Moodu mullu : Leta Chaligalulu Song lyrics (లేత చలి గాలులూ)

చిత్రం : మూడుముళ్ళు(1983)

సంగీతం : రాజన్-నాగేంద్ర సాహిత్యం : జ్యోతిర్మయి
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం,పి. సుశీల

లేత చలి గాలులూ హొయ్ దోచుకోరాదురా చలి వెలుగు వెన్నెలలు నిను తాకగా తగవురా లేత చలి గాలులూ హోయ్ దోచుకోలేవులే మన వలపు వాకిలిని అవి తాకగలేవులే లేత చలి గాలులూ హొయ్ దోచుకోరాదురా అందాల నా కురులతో వింజామరలు వీచనా అందాల నా కురులతో వింజామరలు వీచనా రాగం భావం స్నేహం మోహం నిన్నే వేడనా నీ కురులవీవనలకు నా హృదయమర్పించనా రూపం దీపం శిల్పం నాట్యం నీలో చూడనా కనుల భాష్పాలు హహహ కలల భాష్యాలు లలలా ఒహొహో వలపుగా సాగి వలలుగా మూగి కాలాన్ని బంధించగా లేత చలి గాలులు హొయ్ దోచుకోరాదురా చలి వెలుగు వెన్నెలలు నిను తాకగా తగవురా లేత చలి గాలులు దోచుకోలేవులే అధరాల కావ్యాలకు ఆవేశమందించనా అధరాల కావ్యాలకు ఆవేశమందించనా వలపే పిలుపై వయసే ముడుపై నిన్నే చేరనా మందార ముకుళాలతో పాదాలు పూజించనా అలనై కలనై విరినై ఝురినై నిన్నే కోరనా హృదయనాదాల హా.హా.హా.. మధురరాగాల..హాయ్ లలలా చిగురు సరసాల నవవసంతాల విరులెన్నో అందించగా లేత చలి గాలులు దోచుకోలేవులే మన వలపు వాకిలిని అవి తాకగలేవులే  ఆఅహాహాహా..ఊహు..హూ.హు.హు..