Mr. Pellam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Mr. Pellam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

29, డిసెంబర్ 2024, ఆదివారం

Mr. Pellam : Radhe Cheli Song lyrics (రాదే చెలి నమ్మరాదే)

చిత్రం: మిస్టర్ పెళ్ళాం (1993)

రచన: వేటూరి సుందర రామ మూర్తి

గానం: కె.యస్.చిత్ర

సంగీతం: ఎం. ఎం. కీరవాణి



రాదే చెలి నమ్మరాదే చెలి మగవారినిలా నమ్మరాదే చెలి రాదే చెలి నమ్మరాదే చెలి మగనాళి మనస్సమ్మరాదే చెలి నాడు పట్టు చీర కట్టవద్దు బరువన్నాడే నేడు నూలు చీరకే డబ్బులు కరువన్నాడే నెలతప్పిన నెలత తనకు పరువన్నాడే నేడు నెలబాలుని చేతికిస్తే బరువన్నాడే ముంగురులను చూసి నాడు మురిసిపోయాడే ఆ కురులకు విరులివ్వడమే మరిచిపోయాడే ప్రేమించు season లో పెద్ద మాటలు పెళ్ళయ్యాక plate ఫిరాయింపులు మొదటి వలపు మధుర కథలు మరచెను ఘనుడు మగవారినిలా నమ్మరాదే చెలి రాదే చెలి నమ్మరాదే చెలి మగవారినిలా నమ్మరాదే చెలి మాటల్తో కోట కట్టాడే అమ్మో నా మహారాణి నీవన్నాడే కాలు కింద పెడితేనే కందిపోవునన్నాడే వాలు తాకితే మోమున కాలు విరుగునన్నాడే కవ్వించుకున్నాడే కౌగిలి కోసం ఆ కాస్తా తీరాకా మొదటికే మోసం మనవి వినడు మనసు కనడు మాయల మొగుడు మగవారినిలా నమ్మరాదే చెలి రాదే చెలి నమ్మరాదే చెలి మగవారినిలా నమ్మరాదే చెలి రాదే చెలి నమ్మరాదే చెలి మగనాళి మనస్సమ్మరాదే చెలి తలలో నాలుకలా పూసలలో దారంబు మాట్టే సతి మదిలో నన్నెలగిడు పురుషుడు కలుగుట తొలి జన్మము నోమభయము తోయజనేత్రా తనుగా వలచిన వరుడేనా ఈ పురుషోత్తముడు వ్రతములు సలిపిన సతులకు గతి కలదా ఇలలో కలదో లేదో

Mr. Pellam : Mayadari Krishnayya Song Lyrics (ఆ...మాయదారి క్రిష్ణయ్య )

చిత్రం: మిస్టర్ పెళ్ళాం (1993)

రచన: ఆరుద్ర

గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం

సంగీతం: ఎం. ఎం. కీరవాణి



ఆ...మాయదారి క్రిష్ణయ్య ఎంతటి వాడు ఓరయ్యో ఆ...నాటకాల బూటకాల నీటుకాడు వాడు ఓరయ్యో ఆడడాన్ని చూసి ఆగలేడు వాడు జంట కోరి వెంట పడతాడు ఆశరేపుతాడు ఊసులాడుతాడు రాసక్రీడలాడు మంత్రగాడు తంత్రగాడు ఆ...మాయదారి క్రిష్ణయ్య ఎంతటి వాడు ఓరయ్యో నాటకాల బూటకాల నీటుకాడు వాడు ఓరయ్యో.. పొరిగింటి పాలు హరిలో రంగ హరి ఇరుగింటి పెరుగు హరిలో రంగ హరి పొరిగింటి పాలు ఇరుగింటి పెరుగు మరిగినాడు వెన్న దొంగ ఆ పాల కడలి హరిలో రంగ హరి యజమానుడైన హరిలో రంగ హరి ఆ పాల కడలి యజమానుడైన పరుల పాడి కోరనేల ఎంత వారి కైనా ఎదుటి సొమ్ము తీపి ఏమి దేవుడండీ అన్యులాస్థి మోజు జాస్తి ఆ...మాయదారి క్రిష్ణయ్య ఎంతటి వాడు ఓరయ్యో నాటకాల బూటకాల నీటుకాడుు వాడు ఓరయ్యో పదహారువేల హరిలో రంగ హరి సతులున్న వాడు హరిలో రంగ హరి పదహారువేల సతులున్న వాడు రాధ నేలా వీడడంట ఆ మేనయత్త హరిలో రంగ హరి తొలివలపు ఖాతా హరిలో రంగ హరి ఆ మేనయత్త తొలివలపు ఖాతా మొదటి ప్రేమ మరువడంట వాడి దివ్య లీల కావ్యగీత మాల చెప్పి నాను చాల పాడుకోండి భక్తులలా ఆ...మాయదారి క్రిష్ణయ్య ఎంతటి వాడు ఓరయ్యో నాటకాల బూటకాల నీటుకాడుు వాడు ఓరయ్యో గోపాల కృష్ణుడు పాక్షి గోవిందా కృష్ణుడు పాక్షి గోపాల కృష్ణుడు పాక్షి గోవిందా కృష్ణుడు పాక్షి గోపాల కృష్ణుడు పాక్షి గోవిందా కృష్ణుడు పాక్షి గోపాల కృష్ణుడు పాక్షి గోవిందా కృష్ణుడు పాక్షి గోపాలకృష్ణుడు పాక్షి.. గోవిందాకృష్ణుడు పాక్షి.. గోపాల కృష్ణుడు పాక్షి వా..కనూడై వెడలే... తాం తరికిటత ధీమ్ తకతకధిమి తా…

Mr. Pellam : Adagavayya Song Lyrics (అలా అడగవయ్య)

చిత్రం: మిస్టర్ పెళ్ళాం (1993)

రచన: ఆరుద్ర

గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, కె.యస్.చిత్ర

సంగీతం: ఎం. ఎం. కీరవాణి


పల్లవి :

అలా అడగవయ్య అయ్యగారి ఎక్కువేవిటో చెప్పమను ఆడవాళ్ళ తక్కువేవిటో అడగవయ్య అయ్యగారి ఎక్కువేవిటో చెప్పమను ఆడవాళ్ళ తక్కువేవిటో ఆ ఎక్కువేవిటో ఈ తక్కువేవిటో ఆ ఎక్కువేవిటో ఈ తక్కువేవిటో చరణం:1 పదునాలుగు భువనాలన్నీ పలిస్తున్నాను పరిపాలిస్తున్నాను ఆ భువనాలను దివనాలను నేను పోషిస్తున్నాను నేనే పోషిస్తున్నాను సిరి లేని హరి వట్టి దేశ దిమ్మరి సిరి లేని హరి వట్టి దేశ దిమ్మరి నేను అలిగి వెళ్ళానా తనకు లేదు టికానా ఓహో ఏడు కొండలవాడి కథా తల్లీ నువు చెప్పేది బాగుందమ్మా కానీ కానీ పెళ్లి కోసం తిప్పలు చేశాడండి అప్పులు నాతో పెళ్లి కోసం తిప్పలు చేశాడండి అప్పులు వడ్డీ కాసుల వాడా వెంకటరమణా గోవిందా గోవింద కొండ మీద నేను మరి కొండ కింద ఎవరో ... నువ్వు అడగవయ్యా నడిరేయి దాటగానే దిగి వచ్చేదెవరో దిగి వచ్చేదెవరో అడగవయ్య అయ్యగారి ఎక్కువేవిటో చెప్పమను ఆడవాళ్ళ తక్కువేవిటో ఆ ఎక్కువేవిటో ఈ తక్కువేవిటో ఆ ఎక్కువేవిటో ఈ తక్కువేవిటో చరణం:2 త్రేతాయుగమున నేను ఆ శ్రీరామచంద్రుడిని ఐనా సీతాపతి అనే పిలిచారండి మిమ్ము పిలిచారండి నరకాసుర వధ చేసిన కృష్ణుడిని తెలుసా సత్యభామని విల్లంబులు తెల్లంబుగ పట్టిన సత్యభామని వీరభామని భామగారి నోరు భలే జోరు జోరు మొగుడిని దానమిచ్చినారు మొగసాలకెక్కినారు ఆ తులాభారం అదో తలభారం ... భలే మంచి చౌక బేరము సవతి చెంత కాళ్ళ బేరము అయ్యా దొరగారి పరువు తులసీ దళం బరువు సత్యం సత్యం పునః సత్యం శ్రీ మద్ రమా రమణ గోవిందో హరిః

28, డిసెంబర్ 2024, శనివారం

Mr. Pellam : Sogasu choodatarama song lyrics (సొగసు చూడ తరమా.. )

చిత్రం: మిస్టర్ పెళ్ళాం (1993)

రచన: వేటూరి సుందర రామ మూర్తి

గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం

సంగీతం: ఎం. ఎం. కీరవాణి




సొగసు చూడ తరమా.. సొగసు చూడ తరమా ఆ ఆ నీ సొగసు చూడ తరమా ఆ ఆ (2) నీ ఆపసోపాలు నీ తీపిశాపాలు ఎర్రన్ని కోపాలు ఎన్నెన్నో దీపాలు అ౦దమే సుమా సొగసు చూడ తరామా ... నీ సొగసు చూడ తరమా ఆ ఆ అరుగు మీద నిలబడి నీ కురులను దువ్వే వేళ.. చేజారిన దువ్వేన్నకు బేజారుగ వ౦గినపుడు చిరుకోప౦ చీరకట్టి సిగ్గును చె౦గున దాచి ఫక్కుమన్న చక్కదన౦ పరుగో పరుగెత్తినపుడు ఆ సొగసు చూడ తరమా నీ సొగసు చూడ తరమా ఆ ఆ ... పెట్టి పెట్టని ముద్దును ఇట్టే విదిలి౦చికొట్టి గుమ్మెత్తే సోయగాన గుమ్మాలను దాటువేళ చె౦గుపట్టు పట్టి రారమ్మని చెలగాటకు దిగుతు౦టె తడిబారిన కన్నులతొ విడువిడుమ౦టున్నపుడు విడువిడుమ౦టున్నపుడు ఆ సొగసు చూడ తరమా నీ సొగసు చూడతరమా ఆ.. ఆ.. పసిపాపకు పాలిస్తు పరవశి౦చి ఉన్నపుడు, పెదపాపడు పాకివచ్హి, మరి నాకో అన్నపుడు మొట్టికాయ వేసి.. ఛి పొ౦డి. అన్నపుడు.. నా ఏడుపూ నీ నవ్వులూ.. హరివిల్లైవెలసినపుడు ఆ సొగసు చూడ తరమా. నీ సొగసు చూడ తరమా ఆ ఆ సిరిమల్లెలు హరివిల్లపు జడలోతురిమి, క్షణమే..యుగమై వేచి వేచి చలిపొ౦గును చెలికోకలముడిలొ అదిమి అలిసీ సొలసీ కన్నులువాచీ నిట్టూర్పుల నిశిరాత్రిలో నిదరోవుఅ౦దాలతో.. త్యాగరాజ కృతిలో సీతాకృతి కలిగిన ఇటువ౦టి సొగసుచూడతరమా నీ సొగసు చూడ తరమా ఆ ఆ