Nayakudu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Nayakudu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

23, మే 2022, సోమవారం

Nayakudu : Chalaki Chinnadi Song Lyrics (హొయ్యా హొయ్ )

చిత్రం : నాయకుడు (1987)

గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల

రచన : రాజశ్రీ

సంగీతం : ఇళయరాజా



హొయ్యా హొయ్ హొయ్ హొయ్యా హొయ్ హొయ్యా హొయ్ హొయ్ హొయ్యా హొయ్ చలాకి చిన్నది వుంది ...మజాలకు రమ్మంటుంది చలాకి చిన్నది వుంది ...మజాలకు రమ్మంటుంది ఒకే ఒకటి ఇమ్మంటుంది.... హొయ్యా హొయ్... అది ఏందది హొయ్ మసకేళ చూడు... నీకుంది తోడు రాచిలక అందం... రాతిరికే సొంతం చలాకి చిన్నది వుంది....మజాలకు రమ్మంటుంది ఒకే ఒకటి ఇమ్మంటుంది...హొయ్యా హొయ్.. అది ఏందది హొయ్ చూపులలోన చుక్కలు చూడాలి.. తజుం తజుం తజుం నీ చేతలలోన దిక్కులు అదరాలి.. తజుం తజుం తజుం అరె...చూపులలోన చుక్కలు చూడాలి.. తజుం తజుం తజుం నీ చేతలలోన దిక్కులు అదరాలి ... తజుం తజుం తజుం మోజులమాటున కసికసిగా ముద్దుల దొంతరివ్వాలి.. వెచ్చని వన్నెల చాటున నే ముచ్చటలాడుకోవాలి.. నువ్వు ఆడాలి.. నే పాడాలి.. పడవూగాలి హొయ్.. చలాకి చిన్నది వుంది....మజాలకు రమ్మంటుంది ఒకే ఒకటి ఇమ్మంటుంది...హొయ్యా హొయ్.. అది ఏందది హొయ్ హొయ్యా హొయ్.. అది ఏందది హొయ్ కోకా రైకా గుసగుసలాడేనే .. తజుం తజుం తజుం నా అల్లరి కోరిక ఎన్నెల కాసేనే.. తజుం తజుం తజుం అహ.. కోకా రైకా గుసగుసలాడేనే .. తజుం తజుం తజుం నా అల్లరి కోరిక ఎన్నెల కాసేనే .. తజుం తజుం తజుం నీలో ఒదిగి నిలువెల్లా ..అల్లుకుపోతా సిలకమ్మ గూటికి చేరే గువ్వల్లే ..ఒడిలో వాలవె చిట్టెమ్మ నువ్వు ఆడాలి ..నే పాడాలి... పడవూగాలి హొయ్.. చలాకి చిన్నది వుంది....మజాలకు రమ్మంటుంది చలాకి చిన్నది వుంది....మజాలకు రమ్మంటుంది ఒకే ఒకటి ఇమ్మంటుంది...హొయ్యా హొయ్.. అది ఏందది హొయ్.. మసకేళ చూడు... నీకుంది తోడు రాచిలక అందం... రాతిరికే సొంతం చలాకి చిన్నది వుంది....మజాలకు రమ్మంటుంది ఒకే ఒకటి ఇమ్మంటుంది...హొయ్యా హొయ్.. అది ఏందది హొయ్.... హొయ్యా హొయ్.. అది ఏందది హొయ్.

Nayakudu : Nee Gudu Chedirindi Song Lyrics (నీ గూడు చెదిరింది)

చిత్రం: నాయకుడు (1987)

సంగీతం: ఇళయరాజా

రచన: వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం



నీ గూడు చెదిరింది నీ గుండె పగిలింది ఓ చిట్టిపావురమా ఎవరు కొట్టారు ఎవరు కొట్టారు ఎవరు కొట్టారు నిన్నెవరు కొట్టారు ఎవరు కొట్టారు ఎవరు కొట్టారు కనులా నీరు రానీకు కానీ పయనం కడ వరకూ కదిలే కాలం ఆగేను కధగా నీతో సాగేను

Nayakudu : Udayinchu Suridu Song Lyrics (నీ గూడు చెదిరింది)

చిత్రం: నాయకుడు (1987)

సంగీతం: ఇళయరాజా రచన: వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్ గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం నీ గూడు చెదిరింది నీ గుండె పగిలింది ఓ చిట్టి పావురమా ఎవరు కొట్టారు? ఎవరు కొట్టారో? నిన్నెవరు కొట్టారో? ఎవరు కొట్టారో? ఎవరు కొట్టారో? కనులానీరు రానీకు కానీ పయనం కడ వరకు కదిలే కాలం ఆగేను కథగా నీతో సాగేను నీలాల కన్నుల్లో కన్నీటి ముత్యాలు నా చిట్టితల్లి నిన్నెవరు కొట్టారో? ఎవరు కొట్టారో? ఎవరు కొట్టారో? కనులానీరు రానీకు కానీ పయనం కడ వరకు కదిలే కాలం ఆగేను కథగా నీతో సాగేను ఉదయించు సూరీడు నిదురించెనే నేడు నా చిట్టితండ్రి ఎవరు కొట్టారో? ఎవరు కొట్టారో? ఎవరు కొట్టారో? కనులానీరు రానీకు కానీ పయనం కడ వరకు కదిలే కాలం ఆగేను కథగా నీతో సాగేను ఓ చుక్క రాలింది ఓ జ్యోతి ఆరింది కన్నీరే మిగిలింది కథ ముగిసింది కాలం తోడై కదిలాడు కథగా తానే మిగిలాడు మరణం లేని నాయకుడు మదిలో వెలుగై వెలిశాడు

Nayakudu : Sande Poddu Song Lyrics (సందెపొద్దు మేఘం)

చిత్రం : నాయకుడు (1987)

గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల

రచన : రాజశ్రీ

సంగీతం : ఇళయరాజా



🏃సందెపొద్దు మేఘం పూల జల్లు కురిసెను నేడూ... 🏃చల్లనైన మనసులు ఆడిపాడుతున్నవి చూడూ... 💃హోయ్ పలికెను రాగం సరికొత్త గానం 💃ఈ ఆనందం మా సొంతం 💃🏃మా సొంతం ఈ ఆనందం నిలవాలి ఇది కలకాలం 💃సందెపొద్దు మేఘం పూల జల్లు కురిసెను నేడూ... 💃చల్లనైన మనసులు ఆడిపాడుతున్నవి చూడూ..🏃.ఆ..🏃ఆ.. చరణం 1: 💃నీవు నడిచే బాటలోనా లేవు బాధలే.. 🏃తనక్కుధిన్ 🏃నేను నడిచే బాట మీకూ పూల పాన్పులే.. 💃తనక్కుధిన్ 💃ఒకటంటా ఇక మనమంతా లేదంటా చీకూచింతా 🏃సాధించాం ఒక రాజ్యాంగం సాగిస్తాం అది మనకోసం 💃వీసమైన లేదులే బేధ భావమే 🏃నీకు నాకు ఎన్నడూ నీతి ప్రాణమే 🏃💃తాం తదిద్ధీం ధీం తధిత్తాం ఆడి పాడుదాం 💃సందెపొద్దు మేఘం పూల జల్లు కురిసెను నేడూ... 💃చల్లనైన మనసులు ఆడిపాడుతున్నవి చూడూ... 🏃పలికెను రాగం సరికొత్త గానం 🏃నీ ఆనందం మా సొంతం 💃🏃మా సొంతం ఈ ఆనందం నిలవాలి ఇది కలకాలం

చరణం 2: 🏃పాలుతేనెల్లాగ మంచిని పంచు సోదరా.. 💃తనక్కుధిన్ 💃ఆదరించే దైవముంది కళ్ళముందరా.. 🏃తనక్కుధిన్ 🏃పూవులతో నువు పూజించు కర్పూరాన్ని వెలిగించూ 💃మమకారాన్ని పండించూ అందరికీ అది అందినూ 🏃వాడలోన వేడుకే తుళ్ళి ఆడెనూ 💃అంతులేని శోభలే చిందులేసెనూ 🏃💃తాం తదిద్ధీం ధీం తధిత్తాం ఆడి పాడుతాం 🏃సందెపొద్దు మేఘం పూల జల్లు కురిసెను నేడూ... 💃చల్లనైన మనసులు ఆడిపాడుతున్నవి చూడూ... 🏃పలికెను రాగం💃 సరికొత్త గానం 💃🏃ఈ ఆనందం మా సొంతం 💃🏃మా సొంతం ఈ ఆనందం నిలవాలి ఇది కలకాలం 💃🏃సందెపొద్దు మేఘం పూల జల్లు కురిసెను నేడూ... 💃🏃చల్లనైన మనసులు ఆడిపాడుతున్నవి చూడూ...

23, ఏప్రిల్ 2022, శనివారం

Nayakudu : Edo Teliyani Bandhamidi Song Lyrics (ఏదో తెలియని బంధమిదీ..)

చిత్రం : నాయకుడు (1987)

గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.పి.శైలజ రచన : వెన్నెలకంటి సంగీతం : ఇళయరాజా ఏదో తెలియని బంధమిదీ.. ఏదో తెలియని బంధమిదీ.. ఎదలో ఒదిగే రాగమిదీ.. ఏదో తెలియని బంధమిదీ.. ఎదలో ఒదిగే రాగమిదీ.. ఏదో తెలియని బంధమిదీ.. పూజకు నోచని పూవును కోరి వలచిన స్వామివి నువ్వేలే.. ధూపం లేని అనురాగానికి ఊపిరి నీ చిరునవ్వేలే.. కోవెల లేనీ...ఈ..ఈ.. కోవెల లేని దేవుడవు గుండెల గుడిలో వెలిశావు.. పలికే జీవన సంగీతానికి వలపుల స్వరమై ఒదిగావు.. తనువు మనసు ఇక నీవే.. ఏ..ఏ.. ఏదో తెలియని బంధమిదీ.. ఏదో తెలియని బంధమిదీ.. ఎదలో ఒదిగే రాగమిదీ... ఏదో తెలియని బంధమిదీ.. వేసవి దారుల వేసటలోన వెన్నెల తోడై కలిసావు.. పూచే మల్లెల తీగకు నేడు పందిరి నీవై నిలిపావు.. ఆశలు రాలే...ఏ..ఏ.. ఆశలు రాలే శిశిరంలో..ఓ..ఓ..ఆమని నీవై వెలిసావు.. ఆలూమగల అద్వైతానికి అర్ధం నీవై నిలిచావు... తనువు మనసు ఇక నీదే.. ఏదో తెలియని బంధమిదీ.. ఏదో తెలియని బంధమిదీ .. ఎదలో ఒదిగే రాగమిదీ.. ఏదో తెలియని బంధమిదీ… ఆ..హ..హ..ఆ..