చిత్రం : నాయకుడు (1987)
గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.పి.శైలజ రచన : వెన్నెలకంటి సంగీతం : ఇళయరాజా ఏదో తెలియని బంధమిదీ.. ఏదో తెలియని బంధమిదీ.. ఎదలో ఒదిగే రాగమిదీ.. ఏదో తెలియని బంధమిదీ.. ఎదలో ఒదిగే రాగమిదీ.. ఏదో తెలియని బంధమిదీ.. పూజకు నోచని పూవును కోరి వలచిన స్వామివి నువ్వేలే.. ధూపం లేని అనురాగానికి ఊపిరి నీ చిరునవ్వేలే.. కోవెల లేనీ...ఈ..ఈ.. కోవెల లేని దేవుడవు గుండెల గుడిలో వెలిశావు.. పలికే జీవన సంగీతానికి వలపుల స్వరమై ఒదిగావు.. తనువు మనసు ఇక నీవే.. ఏ..ఏ.. ఏదో తెలియని బంధమిదీ.. ఏదో తెలియని బంధమిదీ.. ఎదలో ఒదిగే రాగమిదీ... ఏదో తెలియని బంధమిదీ.. వేసవి దారుల వేసటలోన వెన్నెల తోడై కలిసావు.. పూచే మల్లెల తీగకు నేడు పందిరి నీవై నిలిపావు.. ఆశలు రాలే...ఏ..ఏ.. ఆశలు రాలే శిశిరంలో..ఓ..ఓ..ఆమని నీవై వెలిసావు.. ఆలూమగల అద్వైతానికి అర్ధం నీవై నిలిచావు... తనువు మనసు ఇక నీదే.. ఏదో తెలియని బంధమిదీ.. ఏదో తెలియని బంధమిదీ .. ఎదలో ఒదిగే రాగమిదీ.. ఏదో తెలియని బంధమిదీ… ఆ..హ..హ..ఆ..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి