చిత్రం: నిరీక్షణ (1986)
రచన: ఆచార్య ఆత్రేయ
గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం , ఎస్. పి. శైలజ
సంగీతం: ఇళయ రాజా
పల్లవి :
తియ్యన్ని దానిమ్మ కొమ్మల్లోనంట చిన్నారి పొన్నారి చిలకల్ల జంట చేస్తున్న కమ్మని కాపురము చూస్తున్న కన్నుల సంబరము ప్రేమకు మందిరము తియ్యన్ని దానిమ్మ కొమ్మల్లోనంట చిన్నారి పొన్నారి చిలకల్ల జంట చేస్తున్న కమ్మని కాపురము చూస్తున్న కన్నుల సంబరము ప్రేమకు మందిరము తియ్యన్ని దానిమ్మ కొమ్మల్లోనంట చిన్నారి పొన్నారి చిలకల్ల జంట
చరణం : 1
ఒకదేహం ఒకప్రాణం తమ స్నేహంగా సమభావం సమభాగం తమ పొందుగా చిలకమ్మ నెయ్యాలే ఉయ్యాలగా చెలికాని సరసాలే జంపాలగా అనురాగం ఆనందం అందాలుగా అందాల స్వప్నాలే స్వర్గాలుగా ఎడబాసి మనలేని హృదయాలుగా ముడిపడ్డ ఆ జంట తొలిసారిగా గూడల్లుకోగా పుల్లల్లు తేగా చెలికాడు ఎటకో పోగా అయ్యో... పాపం... వేచెను చిలకమ్మ తియ్యన్ని దానిమ్మ కొమ్మల్లోనంట చిన్నారి పొన్నారి చిలకల్ల జంట
చరణం : 2
ఒక వేటగాడెందో వల పన్నగా తిరుగాడు రాచిలుక గమనించక వలలోన పడి తాను అల్లాడగా చిలకమ్మ చెలికాని సడి కానక కన్నీరు మున్నీరై విలపించగా ఇన్నాళ్ళ కలలన్నీ కరిగించగా ఎలుగెత్తి ప్రియురాలు రోదించగా వినలేని ప్రియుడేమో తపియించగా అడివంతా నాడు ఆ జంట గోడు వినలేక మూగైపోగా అయ్యో... పాపం... వేచెను చిలకమ్మ తియ్యన్ని దానిమ్మ కొమ్మల్లోనంట చిన్నారి పొన్నారి చిలకల్ల జంట చేస్తున్న కమ్మని కాపురము చూస్తున్న కన్నుల సంబరము ప్రేమకు మందిరము తియ్యన్ని దానిమ్మ కొమ్మల్లోనంట చిన్నారి పొన్నారి చిలకల్ల జంట