Nuvve Kavali లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Nuvve Kavali లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

20, మే 2022, శుక్రవారం

Nuvve Kavali : Ole Ole Ole Song lyrics (ఒలె ఒలె )

చిత్రం: నువ్వే కావాలి (2000)

రచన: భువన చంద్ర

గానం: రాధిక

సంగీతం: కోటి


ఒలె ఒలె ఓలా ఓలా గిలి గిలిగా ఉంది వేళ ఒలె ఒలె ఒలె ఓలా ఓలా గిలి గిలిగా ఉంది వేళ నిలబడలేనన్నది పైట నిదరన్నది లేదీ పూట సల సల సల కాగే వయసమ్మొ… ఏడ ఉన్నాడే ఏడ ఉన్నాడే ఏడ ఉన్నాడే కిలాడి ఏడ ఉన్నాడే జాజులన్నాడే మోజులన్నాడే తోడు రమ్మంటే కిలాడి జారుకున్నడే ఒలె ఒలె ఒలె ఓలా ఓలా గిలి గిలిగా ఉంది వేళ లైలా లైలా ఆగలేను అన్నాడే ఇంకా చెలియ ఏమీ ఏమీ చేసాడే కల్లోకొచ్చి కౌగిలించుకున్నాడే ఆపై చిలక ఏమీ చేసి పోయాడే చిరు నవ్వులు నవ్వాడే నడుముని తడిమేసాడే కిత కితలెడుతున్నాయన్నా వినుకోడె లవ్ యూ అంటూ గిల్లేసాడే ఏడ గిల్లాడే పిల్లా ఏడ గిల్లాడే హా కొంటె కుర్రాడే లేత బుగ్గ గిల్లాడే ఒలె ఒలె ఒలె ఓలా ఓలా గిలి గిలిగా ఉంది వేళ గదిలోకెల్తే తొంగి తొంగి చూసాడే ఆగే పిల్ల అప్పుడేమి చేసాడే నేనూ వస్తా తలుపు తీయమన్నడే అబ్బో దొంగ చూసి ఏమీ చేసాడే పొగారెక్కిన పిల్లాడే పగ బట్టి ఉన్నాడే సరాసాలిక వద్దన్నా సొద వినడే లవ్లీ అంటూ పడిపోయాడే ఏడ పడ్డాడే బుల్లి ఏడ పడ్డాడే ఆ గోడ మీదేక్కి కాలు జారీ

27, జూన్ 2021, ఆదివారం

Nuvve Kavali : Kallaloki Kallu Petti Chudavenduku (కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు)

చిత్రం: నువ్వే కావాలి (2000)

రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: కె.యస్.చిత్ర

సంగీతం: కోటి



కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు . మనం అన్నది ఒకే మాటని నాకిన్నాళ్ళూ తెలుసు నువ్వు నేను ఇద్దరున్నామంటే నమ్మనంటూ ఉంది మనసు కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు. ఈనాడే సరికొత్తగా మొదలైందా మన జీవితం గతమంటూ ఏంలేదని చెరిగిందా ప్రతి ఙాపకం కనులు మూసుకుని ఏం లాభం కలైపోదుగా ఏ సత్యం ఎటూ తేల్చని నీ మౌనం ఎటో తెలియని ప్రయాణం ప్రతి క్షణం ఎదురయే నన్నే దాటగలదా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు . గాలిపటం గగనానిదా ఎగరేసే ఈ నేలదా నా హృదయం నీ చెలిమిదా ముడివేసే ఇంకొకరిదా నిన్నామొన్నలనీ నిలువెల్ల నిత్యం నిన్ను తడిమే వేళ తడే దాచుకున్న మేఘంలా ఆకాశాన నువ్వు ఎటువున్నా చినుకులా కరగక శిలై ఉండగలవా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు మనం అన్నది ఒకే మాటని నాకిన్నాళ్ళూ తెలుసు నువ్వు నేను ఇద్దరున్నామంటే నమ్మనంటూ ఉంది మనసు ...

Nuvve Kavali : Anagana Akasam Undi Song Lyrics (అనగనగ ఆకాశం ఉంది)

చిత్రం: నువ్వే కావాలి (2000)

రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: కె.యస్.చిత్ర, జయ చంద్రన్

సంగీతం: కోటి


అనగనగ ఆకాశం ఉంది

ఆకాశంలో మేఘం ఉంది

మేఘం వెనక రాగం ఉంది

రాగం నింగిని కరిగించింది..

కరిగే నింగి చినుకయ్యింది..

చినుకే చిటపట పాటయ్యింది

చిటపట పాటే తాకిన నేల చిలకలు వాలే చెట్టయింది

నా చిలక నువ్వే కావాలి నా రా చిలక నవ్వే కావాలి

రాగాల పువ్వై రావాలి అనురాగాల మువ్వై మోగాలి...

అనగనగ ఆకాశం ఉంది

ఆకాశంలో మేఘం ఉంది

మేఘం వెనక రాగం ఉంది

రాగం నింగిని కరిగించింది..

కరిగే నింగి చినుకయ్యింది..

చినుకే చిటపట పాటయ్యింది

చిటపట పాటే తాకిన నేల చిలకలు వాలే చెట్టయింది

నా చిలక నువ్వే కావాలి నా రా చిలక నవ్వే కావాలి

రాగాల పువ్వై రావాలి అనురాగాల మువ్వై మోగాలి...



ఊగే కొమ్మల్లోన చిరుగాలి కవ్వాలి పాడి కచ్చేరి చేసే వేళల్లో

గుండెల గుమ్మల్లోన సరదాలే సయ్యాటలు ఆడి తాళాలే వేసే వేళల్లో

కేరింతలే ఏ దిక్కున కూస్తున్న కవ్వించగా.. ఆ.. ఆ.. ఆ..

ఆ.. ఆ.. ఆ ..


నీ చెలిమే చిటికేసి నను పిలిచే నీకేసి

నీ చెలిమే చిటికేసి నను పిలిచే నీకేసి

నువ్వు చెవిలోచెప్పే ఊసుల కోసం నేనొచ్చేసా పరుగులు తీసి ...

నా చిలక నువ్వే కావాలి నా రా చిలక నవ్వే కావాలి..

అనగనగ ఆకాశం ఉంది

ఆకాశంలో మేఘం ఉంది

మేఘం వెనక రాగం ఉంది

రాగం నింగిని కరిగించింది..

కరిగే నింగి చినుకయ్యింది..

చినుకే చిటపట పాటయ్యింది

చిటపట పాటే తాకిన నేల చిలకలు వాలే చెట్టయింది

నా చిలక నువ్వే కావాలి నా రా చిలక నవ్వే కావాలి

రాగాల పువ్వై రావాలి అనురాగాల మువ్వై మోగాలి...



చుక్కల్లోకం చుట్టూ తిరగాలి అనుకుంటూ ఊహ ఊరేగే వెన్నెల దారుల్లో

నేనున్నా రమ్మంటూ ఓ తార నా కోసం వేచి సావాసం పంచే సమయంలో

నూరేళ్ళకి సరిపోయే ఆశల్ని పండించగా ఆ...

ఆ స్నేహం చిగురించి ఏకాంతం పులకించి అనుబంధాలే సుమగంధాలై ఆనందాలే

విరబూస్తు ఉంటే ...

నా చిలక నువ్వే కావాలి నా రా చిలక నవ్వే కావాలి..

అనగనగ ఆకాశం ఉంది

ఆకాశంలో మేఘం ఉంది

మేఘం వెనక రాగం ఉంది

రాగం నింగిని కరిగించింది..

కరిగే నింగి చినుకయ్యింది..

చినుకే చిటపట పాటయ్యింది

చిటపట పాటే తాకిన నేల చిలకలు వాలే చెట్టయింది

నా చిలక నువ్వే కావాలి నా రా చిలక నవ్వే కావాలి

రాగాల పువ్వై రావాలి అనురాగాల మువ్వై మోగాలి..


26, జూన్ 2021, శనివారం

Nuvve Kavali : Ekkada Vunna Pakkana (ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది)

చిత్రం: నువ్వే కావాలి (2000)

రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: శ్రీరామ్ ప్రభు, గోపిక పూర్ణిమ

సంగీతం: కోటి



ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలీ.. ఇదేం అల్లరీ నా నీడైనా అచ్చం నీలా కనిపిస్తూ ఉంది అరే.. ఇదేం గారడీ నేను కూడా నువ్వయానా.. పేరు కైనా నేను లేనా.. దీని పేరేనా.. ప్రేమ అనే ప్రియ భావనా.. ఓ దీని పేరేనా ప్రేమ అనే ప్రియ భావనా.. ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలీ.. ఇదేం అల్లరీ నిద్దుర తుంచే మల్లెల గాలి వద్దకు వచ్చి తానెవరంది నువ్వే.. కదా.. చెప్పు ఆ పరిమళం వెన్నెల కన్నా చల్లగ ఉన్న చిరునవ్వేదో తాకుతు ఉంది నీదే.. కాదా.. చెప్పు ఆ సంబరం కనుల ఎదుట నువు లేకున్నా మనసు నమ్మదే చెబుతున్నా ఎవరు ఎవరితో ఎమన్నా నువ్వు పిలిచినట్టనుకున్నా ఇది హాయో ఇది మాయో నీకైనా తెలుసునా ఏమిటవుతుందో ఇలా నా ఎద మాటునా... ఓ... దీని పేరేనా ప్రేమ అనే ప్రియ భావనా.. ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలీ.. ఇదేం అల్లరీ నా నీడైనా అచ్చం నీలా కనిపిస్తూ ఉంది అరే.. ఇదేం గారడీ నేను కూడా నువ్వయానా.. పేరు కైనా నేను లేనా.. దీని పేరేనా.. ప్రేమ అనే ప్రియ భావనా.. ఓ దీని పేరేనా ప్రేమ అనే ప్రియ భావనా.. కొండల నుంచి కిందికి దూకే తుంటరి వాగు నాతో అంది నువ్వూ.. అలా.. వస్తూ ఉంటావనీ గుండెల నుంచి గుప్పున ఎగసే ఊపిరి నీకో కబురంపింది చెలీ.. నీకై.. చూస్తూ ఉంటాననీ మనసు మునుపు ఎపుడూ ఇంత ఉలికి ఉలికి పడలేదు కదా మనకు తెలియనిది ఈ వింతా ఎవరి చలవ ఈ గిలిగింత నాలాగే నీక్కూడా అనిపిస్తూ ఉన్నదా ఏమి చేస్తున్నా పరాకే అడుగడుగునా... ఓ... దీని పేరేనా ప్రేమ అనే ప్రియ భావనా.. ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలీ.. ఇదేం అల్లరీ నా నీడైనా అచ్చం నీలా కనిపిస్తూ ఉంది అరే.. ఇదేం గారడీ నేను కూడా నువ్వయానా.. పేరు కైనా నేను లేనా.. దీని పేరేనా.. ప్రేమ అనే ప్రియ భావనా.. ఓ దీని పేరేనా ప్రేమ అనే ప్రియ భావనా..