Nuvvu Vasthavani లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Nuvvu Vasthavani లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

29, అక్టోబర్ 2022, శనివారం

Nuvvu Vasthavani : Meghamai Song Lyrics (మేఘమై నేను వచ్చాను)

చిత్రం: నువ్వు వస్తావని(2000)

రచన: చంద్ర బోస్

సంగీతం: ఎస్. ఏ . రాజ్ కుమార్

గానం: శంకర్ మహదేవన్



పల్లవి :

మేఘమై నేను వచ్చాను మెరుపులో నిన్ను వెతికాను

మేఘమై నేను వచ్చాను మెరుపులో నిన్ను వెతికాను ఎవరితో కబురే పంపను ఎన్నటికి నిన్ను చేరెదను ఓ ప్రియా... ఆ... ఓ ప్రియా... ఆ...

మేఘమై నేను వచ్చాను మెరుపులో నిన్ను వెతికాను

చరణం : 1

నిన్ను వలచి అన్ని మరచి కలతపడి నిలుచున్నా నిన్ను తలచి కనులు తెరచి కలలోనే ఉన్నా పాటే నే విన్నది మాటే రాకున్నది వేరే ధ్యాసన్నది ఏదీ లేకున్నది ఓ ప్రియా... ఆ... ఓ ప్రియా... ఆ...

మేఘమై నేను వచ్చాను మెరుపులో నిన్ను వెతికాను చరణం : 2

నినుచూడని కనులేనని కలవరించే హృదయం నిను వీడని నీ నీడలా సాగింది బంధం ప్రేమ బాధన్నది ఎంత తీయనైనది ఎండమావన్నది సెలయేరైనది


మేఘమై నేను వచ్చాను మెరుపులో నిన్ను వెతికాను ఎవరితో కబురే పంపను ఎన్నటికి నిన్ను చేరెదను ఓ ప్రియా... ఆ... ఓ ప్రియా... ఆ...

Nuvvu Vasthavani : Railu Bandini song lyrics (రైలుబండి నడిపేది)

చిత్రం: నువ్వు వస్తావని(2000)

రచన: చంద్ర బోస్

సంగీతం: ఎస్. ఏ . రాజ్ కుమార్

గానం: శంకర్ మహదేవన్




రైలుబండి నడిపేది పచ్చజెండాలే బ్రతుకుబండిని నడిపేది పచ్చనోటులే రైలుబండి నడిపేది పచ్చజెండాలే బ్రతుకుబండిని నడిపేది పచ్చనోటులే తళ తళ తళ మెరిసే నోటు తీర్చును లోటు పెళ పెళ పెళ లాడే నోటు పెంచును వెయిటు అరె బోల్ మేరే భాయ్ ఈ నోట్ కి జై అరె బోల్ మేరే భాయ్ నా మాటకి జై  రైలుబండి నడిపేది పచ్చజెండాలే బ్రతుకుబండిని నడిపేది పచ్చనోటులే డబ్బుంటే సుబ్బిగాడినే సుబ్బరావుగారంటారు డబ్బుంటే సుబ్బిగాడినే సుబ్బరావుగారంటారు ధనముంటే అప్పలమ్మనే అప్సరసని పొగిడేస్తారు కాషే ఉంటే ఫేస్ కు విలువస్తుంది నోటే ఉంటే మాటకు బలమొస్తుంది బైకు ఉంటే అమ్మాయే బీటే వేస్తుంది నీకు సైకిలుంటే ఆ పిల్లే సైడయ్ పోతుంది  బైకు ఉంటే అమ్మాయే బీటే వేస్తుంది నీకు సైకిలుంటే ఆ పిల్లే సైడయ్ పోతుంది రైలుబండి నడిపేది పచ్చజెండాలే బ్రతుకుబండిని నడిపేది పచ్చనోటులే ఏ భాష తెలియని డబ్బు అబద్దాన్ని పలికిస్తుంది అరరెరె..ఏ భాష తెలియని డబ్బు అబద్దాన్ని పలికిస్తుంది ఏ పార్టీకి చెందని డబ్బు ప్రభుత్వాన్ని పడగొడుతుంది డాలర్లయినా రష్యన్ రూబ్బులైనా డబ్బుంటేనే మనిషికి ఖానా ఫీనా చేతినిండా సొమ్ముంటే అమ్మో చిలకమ్మో ఊరినిండా చుట్టాలే అమ్మో చిట్టమ్మో చేతినిండా సొమ్ముంటే అమ్మో చిలకమ్మో ఊరినిండా చుట్టాలే అమ్మో చిట్టమ్మో రైలుబండి నడిపేది పచ్చజెండాలే బ్రతుకుబండిని నడిపేది పచ్చనోటులే తళ తళ తళ మెరిసే నోటు తీర్చును లోటు పెళ పెళ పెళ లాడే నోటు పెంచును వెయిటు అరె బోల్ మేరే భాయ్ ఈ నోట్ కి జై అరె బోల్ మేరే భాయ్ నా మాటకి జై  అరె బోల్ మేరే భాయ్ ఈ నోట్ కి జై అరె బోల్ మేరే భాయ్ నా మాటకి జై 

Nuvvu Vasthavani : Kalalonaina Song Lyrics (కలలోనైన కలగనలేదే నువ్వొస్తావని )

 

చిత్రం: నువ్వు వస్తావని(2000)
రచన: చంద్ర బోస్
సంగీతం: ఎస్. ఏ . రాజ్ కుమార్
గానం: ఎస్. పి. బాల సుబ్రహ్మణ్యం


పల్లవి: కలలోనైన కలగనలేదే నువ్వొస్తావని మెలకువలోనైన అనుకోలేదే నువ్వొస్తావని కలలోనైన కలగనలేదే నువ్వొస్తావని మెలకువలోనైన అనుకోలేదే నువ్వొస్తావని ఆ దేవుడు కరుణించి .. ఈ దేవత కనిపించి.. ఆనందం కలిగించి..ఈ బంధం కదిలొచ్చి.. ప్రేమ పైన నమ్మకాన్ని నాలో పెంచుతున్నది .. నను కమ్మనైన అమృతాల నదిలో ముంచుతున్నది.. ఓ హో ..ఓ ..హో .. హే ..హే ….హే హే ...! కలలోనైన కలగనలేదే నువ్వొస్తావని మెలకువలోనైన అనుకోలేదే నువ్వొస్తావని చరణం: చిన్ని పెదవి పైన ..పుట్టుమచ్చ కానా చిందుతున్న నవ్వులలోన స్నానాలాడనా....! కన్నె గుండెపైన పచ్చబొట్టు కానా మోగుతున్న సవ్వడి వింటూ మోక్షం పొందనా ....! జానకి నీడే..రాముని మేడ నీ జారిన పైటే నే కోరిన కోట తెలుగు భాష లోని వేల పదములు తరుగుతున్నవి...! నా వలపు భాష లోని చెలియ పదమే మిగిలివున్నది...! ఓ హో ..ఓ ..హో .. :: కలలోనైన :: చరణం: కాళిదాసు నేనై కవిత రాసుకోనా కాలి గోటి అంచులపైన హృదయం వుంచనా.….! భామదాసు నేనై ప్రేమ కోసుకోనా బంతిపూల హారాలేసి ఆరాధించనా...! నా చెలి నామం ..తారక మంత్రం …. చక్కని రూపం …జక్కన శిల్పం .. వంద కోట్ల చందమామలొకటై వెలుగుతుండగా.. ఈ సుందరాంగి చూపు సోకి కాదా బ్రతుకు పండగ .....! కలలోనైన కలగనలేదే నువ్వొస్తావని మెలకువలోనైన అనుకోలేదే నువ్వొస్తావని ఆ దేవుడు కరుణించి .. ఈ దేవత కనిపించి.... ఆనందం కలిగించి..ఈ బంధం కదిలొచ్చి.... ప్రేమ పైన నమ్మకాన్ని నాలో పెంచుతున్నది .. నను కమ్మనైన అమృతాల నదిలో ముంచుతున్నది......