29, అక్టోబర్ 2022, శనివారం

Nuvvu Vasthavani : Meghamai Song Lyrics (మేఘమై నేను వచ్చాను)

చిత్రం: నువ్వు వస్తావని(2000)

రచన: చంద్ర బోస్

సంగీతం: ఎస్. ఏ . రాజ్ కుమార్

గానం: శంకర్ మహదేవన్

పల్లవి :

మేఘమై నేను వచ్చాను మెరుపులో నిన్ను వెతికాను

మేఘమై నేను వచ్చాను మెరుపులో నిన్ను వెతికాను ఎవరితో కబురే పంపను ఎన్నటికి నిన్ను చేరెదను ఓ ప్రియా... ఆ... ఓ ప్రియా... ఆ...

మేఘమై నేను వచ్చాను మెరుపులో నిన్ను వెతికాను

చరణం : 1

నిన్ను వలచి అన్ని మరచి కలతపడి నిలుచున్నా నిన్ను తలచి కనులు తెరచి కలలోనే ఉన్నా పాటే నే విన్నది మాటే రాకున్నది వేరే ధ్యాసన్నది ఏదీ లేకున్నది ఓ ప్రియా... ఆ... ఓ ప్రియా... ఆ...

మేఘమై నేను వచ్చాను మెరుపులో నిన్ను వెతికాను చరణం : 2

నినుచూడని కనులేనని కలవరించే హృదయం నిను వీడని నీ నీడలా సాగింది బంధం ప్రేమ బాధన్నది ఎంత తీయనైనది ఎండమావన్నది సెలయేరైనది

మేఘమై నేను వచ్చాను మెరుపులో నిన్ను వెతికాను ఎవరితో కబురే పంపను ఎన్నటికి నిన్ను చేరెదను ఓ ప్రియా... ఆ... ఓ ప్రియా... ఆ...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి