Okkadu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Okkadu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

29, జనవరి 2022, శనివారం

Okkadu : Nuvvu Em Maaya Chesavo Song Lyrics (నువ్వేమ్మాయ చేశావో)

చిత్రం : ఒక్కడు (2003)
సంగీతం : మణిశర్మ
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం: శ్రేయ ఘోషల్

నువ్వేమ్మాయ చేశావోగాని ఓ మనసా చెప్పమ్మా నిజాన్ని క్షణం ఆగనంటోంది ఓణి మరీ చిలిపిదీ వయసు బాణి హయ్యా హయ్యారే హయ్యారే హయ్యా చిందులేస్తున్న ఈ అల్లరి ఓ సయ్యా సయ్యారే సయ్యారే సయ్యా ఎటు పోతుందో ఏమో మరి నువ్వేమ్మాయ చేశావోగాని ఓ మనసా చెప్పమ్మా నిజాన్ని క్షణం ఆగనంటోంది ఓణి మరీ చిలిపిదీ వయసు బాణి ఔరా పంచకల్యాణి పైన వస్తాడంటా యువరాజు ఔనా నువ్వేమైనా చూశావా మైనా తెస్తున్నాడా ముత్యాల మేనా హయ్యా హయ్యారే హయ్యారే హయ్యా మొగలి పువ్వంటి మొగుడెవ్వరే ఓ సయ్యా సయ్యారే సయ్యారే సయ్యా మేళ తాళాల మనువెప్పుడే ఔరా పంచకల్యాణి పైన వస్తాడంటా యువరాజు ఔనా నువ్వేమైనా చూశావా మైనా తెస్తున్నాడా ముత్యాల మేనా కలా నువ్వు ఏ చాటునున్నా అలా ఎంత కవ్వించుతున్నా ఇలా నిన్ను వెంటాడి రానా ఎలాగైనా నిన్ను కలుసుకోనా హయ్యా హయ్యారే హయ్యారే హయ్యా ఆశ పడుతున్న ఈ నా మది ఓ సయ్యా సయ్యారే సయ్యారే సయ్యా అది తీరేది ఎపుడన్నది నువ్వేమ్మాయ చేశావోగాని ఓ మనసా చెప్పమ్మా నిజాన్ని క్షణం ఆగనంటోంది ఓణి మరీ చిలిపిదీ వయసు బాణి

24, జులై 2021, శనివారం

Okkadu : Atharintiki Song Lyrics (అత్తారింటికి నిన్నెత్తుకు పోతానుగా)

చిత్రం: ఒక్కడు(2003)

సంగీతం: మణి శర్మ

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: హరి హారన్, శ్రేయ ఘోషల్

ముత్తైదులంతా ముదమారా ఈ బాలకీ మంగళ స్నానాలు చేయించరే  శ్రీరామ రక్షణని క్షీరాబ్ది కన్యకి ముమ్మారు దిష్టి తీసి దీవించరే  మనసు పడే మగడొస్తాడని మేనంతా మెరిసింది  మిడిసిపడే మదిలో సందడి మేళాలై మోగింది  నీకు నాకు ముందే రాసుంది జోడీ  హరిలో రంగా హరి…వహ్ వాహంటూ చూస్తోంది ఈ పందిరి  బరిలో హోరాహోరీ..బహు బాగుంది బాజా బాజంతిరీ…  అత్తారింటికి నిన్నెత్తుకు పోతానుగా వచ్చానే హంసా వైభోగంగా  కన్యాదానమిస్తా కళ్యాణం సాక్షిగా దొరలా దోచుకుపో యమ దర్జాగా  గెలిచానే నీ హృదయం..కలకాలం ఈ విజయం నీతో పంచుకోనా…  ప్రియురాలా నా ప్రాణం నీ పాపిట సింధూరంగా నిలపనా  కలలన్నీ ఈ నిమిషం నిజమయ్యే సంతోషం నాలో దాచగలనా  దరిచేరే నీ కోసం చిరునవ్వుల నీరాజనం ఇవ్వనా  ముస్తాబు చెయ్యరటే ఈ ముద్దులగుమ్మకీ..  సిగ్గుపడు చెంపకి సిరిచుక్క దిద్దరే  పట్టుచీర కట్టరటే ఈ పుత్తడి బొమ్మకీ  తడబడు కాళ్లకి పారాణి పెట్టరే  వగలన్నీ నిగనిగలాడగా నన్నల్లే కౌగిళ్లు  నగలన్నీ వెలవెలబోవ చేరందే నీ ఒళ్లో  నాకే సొంతం కాని నీ సొమ్ములన్నీ ఒట్టేసి చెబుతున్నా..కడదాకా నడిపించే తోడై నేనున్నా  ఏడడుగుల పయనానా ఏడేడు లోకాలైనా దాటనా  వధువై ఎదురొస్తున్నా వరమాలై ఎద పైన వాలే ముహూర్తానా  వరసయ్యే వలపంతా చదివిస్తా వరకట్నంగా..సరేనా  ముక్కోటి దేవతలు మక్కువగా కలిపారే  ఎన్నెన్ని జన్మలదో ఈ కొంగుముడి  ముత్యాల జల్లులుగా అక్షింతలు వెయ్యాలే..  ముచ్చట తీరేలా అంతా రండి  ఏనాడూ ఎవరూ చేరని ఏకాంతం వెతకాలి  ఏ కన్నూ ఎపుడూ చూడని లోకంలో బతకాలి  పగలూ రేయీ లేని జగమేలుకోనీ  హరిలో రంగా హరి…వహ్ వాహంటూ చూస్తోంది ఈ పందిరి బరిలో హోరాహోరీ..బహు బాగుంది బాజా బాజంతిరీ… అత్తారింటికి నిన్నెత్తుకు పోతానుగా వచ్చానే హంసా వైభోగంగా కన్యాదానమిస్తా కళ్యాణం సాక్షిగా దొరలా దోచుకుపో యమ దర్జాగా  అత్తారింటికి నిన్నెత్తుకు పోతానుగా వచ్చానే హంసా వైభోగంగా కన్యాదానమిస్తా కళ్యాణం సాక్షిగా దొరలా దోచుకుపో యమ దర్జాగా 

Okkadu : Hay Rey Hai Song Lyrics (హయ్యా హయ్యారే)

చిత్రం: ఒక్కడు(2003)

సంగీతం: మణి శర్మ

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: కార్తీక్, చిత్ర

నువ్వేమ్మాయ చేశావోగాని ఓ మనసా చెప్పమ్మా నిజాన్ని క్షణం ఆగనంటోంది ఓణి మరీ చిలిపిదీ వయసు బాణి హయ్యా హయ్యారే హయ్యారే హయ్యా చిందులేస్తున్న ఈ అల్లరి ఓ సయ్యా సయ్యారే సయ్యారే సయ్యా ఎటు పోతుందో ఏమో మరి నువ్వేమ్మాయ చేశావోగాని ఓ మనసా చెప్పమ్మా నిజాన్ని క్షణం ఆగనంటోంది ఓణి మరీ చిలిపిదీ వయసు బాణి ఔరా పంచకల్యాణి పైన వస్తాడంటా యువరాజు ఔనా నువ్వేమైనా చూశావా మైనా తెస్తున్నాడా ముత్యాల మేనా హయ్యా హయ్యారే హయ్యారే హయ్యా మొగలి పువ్వంటి మొగుడెవ్వరే ఓ సయ్యా సయ్యారే సయ్యారే సయ్యా మేళ తాళాల మనువెప్పుడే ఔరా పంచకల్యాణి పైన వస్తాడంటా యువరాజు ఔనా నువ్వేమైనా చూశావా మైనా తెస్తున్నాడా ముత్యాల మేనా కలా నువ్వు ఏ చాటునున్నా అలా ఎంత కవ్వించుతున్నా ఇలా నిన్ను వెంటాడి రానా ఎలాగైనా నిన్ను కలుసుకోనా హయ్యా హయ్యారే హయ్యారే హయ్యా ఆశ పడుతున్న ఈ నా మది ఓ సయ్యా సయ్యారే సయ్యారే సయ్యా అది తీరేది ఎపుడన్నది నువ్వేమ్మాయ చేశావోగాని ఓ మనసా చెప్పమ్మా నిజాన్ని క్షణం ఆగనంటోంది ఓణి మరీ చిలిపిదీ వయసు బాణి

12, జులై 2021, సోమవారం

Okkadu : Hare Rama Song Lyrics (హరే రామ హరే రామ రామ రామ)

చిత్రం: ఒక్కడు(2003)

సంగీతం: మణి శర్మ

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: శంకర్ మహదేవన్

హరే రామ హరే రామ రామ రామ హరే హరే 

హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే

రాముణ్ణైన కృష్ణుణ్ణైన కీర్తిస్తూ కూర్చుంటామా 

వాళ్ళేం సాధించారో కొంచెం గుర్తిద్దాం మిత్రమా 

సంద్రం కూడ స్థంబించేలా మన సత్తా చూపిద్దామా 

సంగ్రామంలో గీతాపాఠం తెలుపమా!

చార్మినార్ చాటు కథకీ తెలియదీ నిత్య కలహం 

భాగమతి ప్రేమ స్మృతికి బహుమతీభాగ్యనగరం 

ఏ మాయ తంత్రం మతమై నాటి చెలిమిని చెరిపెర 

ఓం శాంతి మంత్రం మనమై జాతి విలువని నిలుపర

పసిడి పతకాల హారం కాదురా విజయతీరం 

ఆటనేమాటకర్ధం నిను నువే గెలుచు యుద్ధం 

శ్రీరామ నవమి జరిపే ముందు లంకను గెలవర 

ఈ విజయదశమి కావాలంటే చెడును జయించర

22, జూన్ 2021, మంగళవారం

Okkadu : Cheppave Chirugaali Song Lyrics (చెప్పవే చిరుగాలి)

 చిత్రం : ఒక్కడు

సంగీతం: మణి శర్మ

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం:ఉదిత్ నారాయణ్, సుజాత

చెప్పవే చిరుగాలి... చల్లగా ఎదగిల్లి చెప్పవే చిరుగాలి... చల్లగా ఎదగిల్లి ఎక్కడే వసంతాల కేళి....ఓ... చూపవే నీతో తీసుకెళ్ళి ఎక్కడే వసంతాల కేళీ... చూపవే నీతో తీసుకెళ్ళి చెప్పవే చిరుగాలి... చల్లగా ఎదగిల్లి ఎక్కడే వసంతాల కేళి....ఓ... చూపవే నీతో తీసుకెళ్ళి ఎక్కడే వసంతాల కేళి....ఓ... చూపవే నీతో తీసుకెళ్ళి ఆశ దీపికలై మెరిసే తారకలు చూసే కీర్తికలై విరిసే కోరికలు మనతో జతై సాగుతుంటే... హో... అడుగే అలై పొంగుతుంది ఓ ఓ.. ఓ ఓ ఓ.. ఓ....... చుట్టూ ఇంకా రేయున్నా... అంతా కాంతే చూస్తున్నా ఎక్కడ ఎక్కడ ఎక్కడ వేకువ అంటూ రెక్కలు విప్పుకు ఎగిరే కళ్ళు దిక్కులు తెంచుకు దూసుకుపోతూ ఉంటే... ఆపగలవ చీకట్లూ... కురిసే సుగంధాల హోళీ... ఓ... చూపదా వసంతాల కేళి కురిసే సుగంధాల హోళీ... ఓ... చూపదా వసంతాల కేళి చెప్పవే చిరుగాలి... చల్లగా ఎదగిల్లి యమునా తీరాల కధ వినిపించేలా రాధా మాధవులా జత కనిపించేలా పాడనీ వెన్నెల్లో ఈ వేళా... హో... చెవిలో సన్నాయి రాగంలా ఓ ఓ.. ఓ ఓ ఓ.. ఓ.... కలలే నిజమై అందేలా... ఊగే ఊహల ఉయ్యాల లాహిరి లాహిరి లాహిరి తారంగాల రాతిరి ఈదని ఆదరి ఈదే వేళ జాజిరి జాజిరి జాజిరి జానపదంలా... పొద్దే పలకరించాలి... ఊపిరే ఉల్లాసంగా తుళ్ళీ... ఓ... చూపదా వసంతాల కేళి ఊపిరే ఉల్లాసంగా తుళ్ళీ... ఓ... చూపదా వసంతాల కేళి చెప్పవే చిరుగాలి... చల్లగా ఎదగిల్లి ఎక్కడే వసంతాల కేళి....ఓ... చూపవే నీతో తీసుకెళ్ళి ఎక్కడే వసంతాల కేళి....ఓ... చూపవే నీతో తీసుకెళ్ళి