12, జులై 2021, సోమవారం

Okkadu : Hare Rama Song Lyrics (హరే రామ హరే రామ రామ రామ)

చిత్రం: ఒక్కడు(2003)

సంగీతం: మణి శర్మ

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: శంకర్ మహదేవన్


హరే రామ హరే రామ రామ రామ హరే హరే 

హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే


రాముణ్ణైన కృష్ణుణ్ణైన కీర్తిస్తూ కూర్చుంటామా 

వాళ్ళేం సాధించారో కొంచెం గుర్తిద్దాం మిత్రమా 

సంద్రం కూడ స్థంబించేలా మన సత్తా చూపిద్దామా 

సంగ్రామంలో గీతాపాఠం తెలుపమా!


చార్మినార్ చాటు కథకీ తెలియదీ నిత్య కలహం 

భాగమతి ప్రేమ స్మృతికి బహుమతీభాగ్యనగరం 

ఏ మాయ తంత్రం మతమై నాటి చెలిమిని చెరిపెర 

ఓం శాంతి మంత్రం మనమై జాతి విలువని నిలుపర


పసిడి పతకాల హారం కాదురా విజయతీరం 

ఆటనేమాటకర్ధం నిను నువే గెలుచు యుద్ధం 

శ్రీరామ నవమి జరిపే ముందు లంకను గెలవర 

ఈ విజయదశమి కావాలంటే చెడును జయించర

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి