Oohalu Gusagusalade లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Oohalu Gusagusalade లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

13, నవంబర్ 2021, శనివారం

Oohalu Gusagusalade : Inthakante Vere Song Lyrics (ఇంతకంటె వేరే అందగత్తెలు)

చిత్రం: ఊహలు గుసగుసలాడే (2014)

రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: కారుణ్య

సంగీతం: కళ్యాణి మాలిక్


ఇంతకంటె వేరే అందగత్తెలు

కనబడలేదని అనననుకో మరి

ఎందరెదురైనా సుందరాంగులు

తడబడి ఎరుగదు మనసీ మాదిరి

ఎందుకంటె ఏమో ఎందుకు అని

తెలియక తికమక పడుతున్నది మది

ఇంతకంటె వేరే అందగత్తెలు

కనబడలేదని అనననుకో మరి

ఎందరెదురైనా సుందరాంగులు

తడబడి ఎరుగదు మనసీ మాదిరి


కోపగించి బుంగమూతి పెట్టినా

నిరాకరించి పళ్ళు నూరి తిట్టినా

మహాద్భుతం అనేట్టుగానె ఉంది అనుకున్నా

ఇదేదో పిచ్చి కదా మరి అనెవ్వరైన అంటె

నిజమేనని ఒప్పేసుకుంట

అంతేగాని నీ వెనకనే పడిన మనసుని

ఒద్దొద్దు అని నేనేమైన ఆపగలనా

ఊ.. ఊ.. ఊ..


కత్రిన, కరీన అంటు కొంతమంది కోసమే కుర్రాళ్లు

అంత కొట్టుకుంటె లోకమందు ఇన్ని వేల జంటలుండవేమో

నా కళ్లతో చూస్తే సరి నిన్ను మించి మరొకరు లేరని అంటారు కద

ఎవ్వరైన అలా అన్నారని ఊరంత వచ్చి

నిన్నే నా కళ్లతోటి చూస్తానంటె చూడగలనా

ఊ.. ఊ.. ఊ..


ఇంతకంటె వేరే అందగత్తెలు కనబడలేదని

అనననుకో మరి ఎందరెదురైనా సుందరాంగులు

తడబడి ఎరుగదు మనసీ మాదిరి ఎందుకంటె ఏమో

ఎందుకు అని తెలియక తికమక పడుతున్నది మది

ఊ.. ఊ.. ఊ.. ఊ.. ఊ.. ఊ..

Oohalu Gusagusalade : Em Sandeham Ledu Song Lyrics (ఏం సందేహం లేదు)

చిత్రం: ఊహలు గుసగుసలాడే (2014)

రచన: అనంత శ్రీరామ్

గానం: కళ్యాణి కోడూరి, సునీత

సంగీతం: కళ్యాణి మాలిక్


ఏం సందేహం లేదు… ఆ అందాల నవ్వే ఈ సందళ్ళు తెచ్చింది ఏం సందేహం లేదు… ఆ కందేటి సిగ్గే ఈ తొందర్లు ఇచ్చింది… ఏం సందేహం లేదు… ఆ గంధాల గొంతె ఆనందాలు పెంచింది… నిమిషము నేల మీద నిలువని కాలి లాగ… మది నిను చేరుతోందే చిలకా..! తనకొక తోడు లాగ వెనకనే సాగుతోంది… హృదయము రాసుకున్న లేఖ… ఏం సందేహం లేదు… ఆ అందాల నవ్వే ఈ సందళ్ళు తెచ్చింది ఏం సందేహం లేదు… ఆ కందేటి సిగ్గే ఈ తొందర్లు ఇచ్చింది… వెన్నెల్లో ఉన్నా… వెచ్చంగా ఉంది నిన్నే ఊహిస్తుంటే… ఎందర్లో ఉన్నా… ఏదోలా ఉంది నువ్వే గుర్తొస్తుంటే… నా కళ్ళల్లోకొచ్చి… నీ కళ్ళాబి చల్లి ఓ ముగ్గేసి వెళ్ళావే… నిదరిక రాదు అన్న నిజముని మోసుకుంటూ… మది నిన్ను చేరుతుంది చిలకా..! తనకొక తోడు లాగ వెనకనే సాగుతుంది… హృదయము రాసుకున్న లేఖ… వెన్నెల్లో ఉన్నా… వెచ్చగా ఉంది నిన్నే ఊహిస్తుంటే… ఎందర్లో ఉన్నా… ఏదోలా ఉంది నువ్వే గుర్తొస్తుంటే… ఈ కొమ్మల్లో గువ్వ… ఆ గుమ్మంలోకెళ్ళి కూ అంటోంది విన్నావా… ఈ మబ్బుల్లో జల్లు… ఆ ముంగిట్లో పూలు పూయిస్తే చాలన్నావా… ఏమవుతున్నా గాని… ఏమైనా అయిపోనీ ఏం ఫరవాలేదన్నావా… అడుగులు వేయలేక అటు ఇటు తేల్చుకోక… సతమతమైన గుండె గనుక..! అడిగిన దానికింక బదులిక పంపుతుంది… పదములు లేని మౌన లేఖ…