చిత్రం: పరువు ప్రతిష్ఠ (1999)
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి
సంగీతం: రాజ్ - కోటి
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర
పగలే వెన్నెలాయే జగమే మనదాయే సెగలే వెల్లువాయే అల్లరే పల్లవాయే స్వాతి జల్లై అల్లుకో నేస్తమల్లే ఆదుకో దాహమేసే దేహమిచ్చే స్వాగతాలే అందుకో పగలే వెన్నెలాయే జగమే మనదాయే సెగలే వెల్లువాయే అల్లరే పల్లవాయే
ప్రేమసీమ సొంతమాయె చందమామ జోడు సంబరాల సంగతే పాడవమ్మా పాడవమ్మా పాడవమ్మా రంగమంత సిద్ధమాయె చుక్కభామ వేడి యవ్వనాల యుద్ధమే చూడవమ్మా చూడవమ్మా చూడవమ్మా తపించు ప్రాయాలు తరించి పోవాలి. గమ్మత్తు గాయాలతో రహస్య రాగాలు తెగించి రేగాలి కౌగిళ్ళ గేయాలతో వానవిల్లై పెదవులు ముద్దునాటే పదునులో బాణమైనా గానమైనా తేనెకాటే తెలుసుకో
పగలే వెన్నెలాయే జగమే మనదాయే సెగలే వెల్లువాయే అల్లరే పల్లవాయే
మాయదారి సోయగాలు మోయలేక నీకు లేని పోని యాతనా కన్నెతీగా.. కన్నె తీగా.. కన్నె తీగా.. తీయనైన తాయిలాలు దాయలేక నీకు పాలు పంచి పెట్టనా తేనెటీగా తేనెటీగా తేనెటీగా సయ్యంటు వస్తాను చేయూత నిస్తాను. వెయ్యేళ్ళ వియ్యాలతో వయ్యారమిస్తాను ఒళ్ళోకి వస్తాను. నెయ్యాల సయ్యాటతో బంధనాలే సాక్షిగా మంతనాలే చేయగా మన్మధుణే మధ్యవరై ఉండమందాం చక్కగా
పగలే వెన్నెలాయే జగమే మనదాయే సెగలే వెల్లువాయే అల్లరే పల్లవాయే స్వాతి జల్లై అల్లుకో నేస్తమల్లే ఆదుకో దాహమేసే దేహమిచ్చే స్వాగతాలే అందుకో
పగలే వెన్నెలాయే జగమే మనదాయే సెగలే వెల్లువాయే అల్లరే పల్లవాయే