Peddannayya లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Peddannayya లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

20, నవంబర్ 2021, శనివారం

Peddannayya : Nee andamnta Song Lyrics ( నీ అందంత చింద)

చిత్రం: పెద్దన్నయ్య (1997)

సంగీతం: కోటి

గానం: S.P.బాలసుబ్రహ్మణ్యం,చిత్ర

సాహిత్యం: భువనచంద్ర


నీ అందంత చింద గొట్టి గంధమల్లె

పూసుకుంటా సందే ఎన్నెలలో

నీ నవ్వులన్నీ పువ్వులెత్తి

నచ్చినట్టు వెచ్చగుంట చిమ్మ చీకటిలో

ఆధరం మందారం మధురం తాంబూలం

అందం ఆనందం మాపటి మకరందం

పరువాల తొణికిస పదే పదనిస

జంట గుసగుసలో


నీ అందంత చింద గొట్టి గంధమల్లె

పూసుకుంటా సందే ఎన్నెలలో

నీ నవ్వులన్నీ పువ్వులెత్తి

నచ్చినట్టు వెచ్చగుంట చిమ్మ చీకటిలో




ఆమ్మో పెట్టప్ప కొండ ఆపై కొకమ్మా కొన

కన్నె చెట్టు తేనె పట్టు నాది

తేనెటీగ కుట్టి నంత తీపి

తోటమాలి చూపు ఎక్కడుందో

తోరణాల కాపు అక్కడుంది

నడుమెక్కడో వెతకాలి నడిబొడ్డునే అడగాలి

తొడిమెక్కడో తెలియాలి

తొలి సిగ్గునీ దులపాలి

అదిరింది చెలి ఓఓ ఓ ఓ ఓ


నీ అందంత చింద గొట్టి గంధమల్లె

పూసుకుంటా సందే ఎన్నెలలో

నీ నవ్వులన్నీ పువ్వులెత్తి

నచ్చినట్టు వెచ్చగుంట చిమ్మ చీకటిలో




ఆమ్మో నీ ముద్దు మోత

అసలే నా బుగ్గ లేత

రాజుకుంది అగ్గిపూల వోని

రాణి కోరే చుంబనాల బోణీ

నిన్ను చూడకుండా నీలవేణి

నిద్దరైనా పోనీ కోడెగాడ్ని

గువ్వెప్పుడో కూసింది గుట్టప్పుడే తెలిసింది

పొయ్యేప్పుడో రగిలింది

పొంగిప్పుడే తగిలింది

అదిరింది చలి ఓ ఓఓ ఓ ఓ ఓఓ



నీ అందంత చింద గొట్టి గంధమల్లె

పూసుకుంటా సందే ఎన్నెలలో

నీ నవ్వులన్నీ పువ్వులెత్తి

నచ్చినట్టు వెచ్చగుంట చిమ్మ చీకటిలో

ఆధరం మందారం మధురం తాంబూలం

అందం ఆనందం మాపటి మకరందం

పరువాల తొణికిస పదే పదనిస

జంట గుసగుసలో

29, జులై 2021, గురువారం

Peddannayya : Chikkindi Chemanthi Song Lyrics (చిక్కింది చామంతి పువ్వు)

చిత్రం: పెద్దన్నయ్య (1997)
సంగీతం: కోటి
సాహిత్యం: భువనచంద్ర
గానం: S.P.బాలసుబ్రహ్మణ్యం,చిత్ర


చిక్కింది చామంతి పువ్వు దాని బుగ్గల్లో దాక్కుంది నవ్వు పుట్టింది గుండెల్లో జివ్వు చూపు గాళాలు గుప్పించి రువ్వు వచ్చింది పచ్చిసు వయసు పిల్లకెట్టాగ తెలిపేది మనసూ నీ ఆశ ఇందాకే తెలుసు పైట పెట్టేసి చూసేయి సొగసు చిక్కింది చామంతి పువ్వు దాని బుగ్గల్లో దాక్కుంది నవ్వు పుట్టింది గుండెల్లో జివ్వు చూపు గాళాలు గుప్పించి రువ్వు అరె ఈ కొండ కోనల్లో పచ్చి నీరెండ ఛాయాల్లో నీలి చెలయేటి తరగల్లో ఒళ్లు తడిమేసుకుందామా హే నన్ను ఇట్టగా ఊరిస్తే ఒళ్ళు తడిమేసి కవ్విస్తే నేను ఉయ్యాలనైపోనా నీ ఒళ్లోన పడిపోనా అరె పిల్ల ఒళ్లోన పడితే వయ్యారమంతా వత్తేసి పట్టేయనా ఓసి నాజూకు తనమా నడుమొంపులోన నాట్యాలు చేసేయనా నువ్వు కొంగులు పట్టే కృష్ణుడు వైతే నీ రాధ నేనవ్వనా... చిక్కింది చామంతి పువ్వు దాని బుగ్గల్లో దాక్కుంది నవ్వు అరెరరె పుట్టింది గుండెల్లో జివ్వు చూపు గాళాలు గుప్పించి రువ్వు వచ్చింది పచ్చిసు వయసు పిల్లకెట్టాగ తెలిపేది మనసూ చిక్కింది చామంతి పువ్వు దాని బుగ్గల్లో దాక్కుంది నవ్వు పుట్టింది గుండెల్లో జివ్వు చూపు గాళాలు గుప్పించి రువ్వు సోకు మందార పువ్విచ్చి మోజు ముద్దుల్లో కరువచ్చే కోటి కల్యాణ రాగాలే నా ఎదలోన వినిపించే కన్నే గోదారి పొంగొచ్చే వెన్ను వనికేటి వయసొచ్చే మల్లే తీగల్లే కౌగిట్లో నువ్వు కులికేటి వేలొచ్చే నువ్వు అవునంటే చాలు చూస్తాను వీలు అందాల బావయ్యో నా పగడాల పెదవి పొగరంత కాస్తా చూసేయి ఓరయ్యో నిన్ను చుట్టేసి కట్టేసి వెన్నెల్లోనా ఏలేలో పాడేయనా చిక్కింది చామంతి పువ్వు దాని బుగ్గల్లో దాక్కుంది నవ్వు అమ్మోయమ్మ పుట్టింది గుండెల్లో జివ్వు చూపు గాళాలు గుప్పించి రువ్వు వచ్చింది పచ్చిసు వయసు పిల్లకెట్టాగ తెలిపేది మనసూ నీ ఆశ ఇందాకే తెలుసు పైట పెట్టేసి చూసేయి సొగసు

Peddannayya : Kalalo Kalyanamala Song Lyrics (కల్లో కళ్యాణమాల )

చిత్రం: పెద్దన్నయ్య (1997)
సంగీతం: కోటి
సాహిత్యం: వేటూరి
గానం: S.P.బాలసుబ్రహ్మణ్యం,చిత్ర



కల్లో కళ్యాణమాల మెరిసిన శుభవేళ కలలే నిజమైన వేళా మనువొక రసలీలా పరిచయమైనవి పరువాలు పరవశమైనవి హృదయాలు కంటికే దీపమై గగనము విడిచెను తారకా కల్లో కళ్యాణమాల మెరిసిన శుభవేళ సిరికోయిల చిలిపి వలపై పాడేనమ్మా యదలోయలా కనులే కలలై పండెనమ్మా నిను చేరితే మనసే వయసై పిలిచేనమ్మా నిదరోయినా సొగసే ఎదురై వలచేనమ్మా మనసే మనువాడగా.. జతగా పెనవేయగా ఊర్వసే ప్రేయసై వధువుగ వెలసెను కౌగిట కల్లో కళ్యాణమాల మెరిసిన శుభవేళ సిరిమల్లికా సిగలో వగలే చిలికేనమ్మ వరమాలిక వలపై వగలే విసిరేనమ్మా మధుమాసమే మనదై మధువే కురిసేనమ్మ సుముహూర్తమే శుభమై సుఖమై కుదిరేనమ్మా జరిగే మన పెళ్ళికి.... జగమే విరి పల్లకి ఏకమై పోయిన మమతలు వెన్నెల కాయగా కల్లో కళ్యాణమాల మెరిసిన శుభవేళ కలలే నిజమైన వేళా మనువొక రసలీలా పరిచయమైనవి పరువాలు పరవశమైనవి హృదయాలు కంటికే దీపమై గగనము విడిచెను తారకా కల్లో కళ్యాణమాల మెరిసిన శుభవేళ కలలే నిజమైన వేళా మనువొక రసలీలా

Peddannayya : Chakkilaala Chukka Song Lyrics (చక్కిలాల చుక్కా)

చిత్రం: పెద్దన్నయ్య (1997)
సంగీతం: కోటి
సాహిత్యం: వేటూరి
గానం: S.P.బాలసుబ్రహ్మణ్యం,
చిత్ర


హొయ్యప్పా హొయ్యప్పా హొయ్యప్పా హొయ్యప్పా చక్కిలాల చుక్కా చక్కగుందిరో పిక్కలావు చుస్తే తిక్కగుందిరో చక్కిలాల చుక్కా చక్కగుందిరో పిక్కలావు చుస్తే తిక్కగుందిరో ఈడు జున్నుముక్క తోడుపూల పక్క రెక్కనుంచి పిక్కదాకా దక్కదేమిరో చక్కనోడు ఎంతో టక్కరోడురో దిక్కులాగ నాకు దక్కినాడురో ఆకు లేని వక్క అందగాడి తిక్క మొక్కజొన్న చేను కాడ మొక్కులెందుకో హొయ్యప్పా హొయ్యప్పా హొయ్యప్పా హొయ్యప్పా (2) హొయ్యా హొయ్యా హొయ్యా హొయ్యా పాలబుగ్గ మీగడా పంచదార జల్లెడా నే పట్టబోతే జారిపోయి పక్కకొస్తే పారిపోయే కొత్త ఈడు కోమలాంగి అత్తలోరి అల్లుడా మల్లెపూల మల్లుడా నీ జట్టు నాకు జాతరాయే గుట్టుకాడ అల్లరాయే సూది కళ్ళ సుందరయ్యా తునా బొడ్డు తూనీగ వేస్తానమ్మ నా పాగ పూతరేకు పొత్తిళ్లలో గొబ్బిళ్ళమ్మ నీ పాగ కుచ్చిళ్ళమ్మ జారాక గొబ్బిళ్ళన్ని దోసిళ్ళలో భలిరా బస భలిరా దాని ఎటవాలు చూపు ఏందిరా చక్కనోడు ఎంతో టక్కరోడురో దిక్కులాగ నాకు దక్కినాడురో ఈడు జున్నుముక్క తోడుపూల పక్క రెక్కనుంచి పిక్కదాకా దక్కదేమిరో హొయ్యప్పా హొయ్యప్పా హొయ్యప్పా హొయ్యప్పా అల్లరింటి పిల్లడు గిల్లమంటే గిల్లడు నా కొత్తలన్ని పాతచేసి సిగ్గులన్ని పాతరేసి కోన సీమ కోడెగాడు ఇవ్వమంది ఇవ్వదు అవ్వ బువ్వ పెట్టదు నా ముద్దునాకు ఇవ్వదాయె ముద్దబంతు లాడదాయె పావు చీర పంకజాక్షి వయ్యారాల ఉయ్యాల ఒళ్ళో వేస్తా ఇయ్యాల నింగి నేల నీ నీడగా సంసారాల సందెల్లో సింగారాల చిందుల్లో నీకు నాకు గాలాడదు బిగిసే కసి గిలిలో కౌగిలింత పట్టు బాగనాడరా చక్కిలాల చుక్కా చక్కగుందిరో పిక్కలావు చుస్తే తిక్కగుందిరో ఆకు లేని వక్క అందగాడి తిక్క మొక్కజొన్న చేను కాడ మొక్కులెందుకో హొయ్యప్పా హొయ్యప్పా హొయ్యప్పా హొయ్యప్పా

హొయ్యప్పా హొయ్యప్పా హొయ్యప్పా హొయ్యప్పా