Pelli Choopulu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Pelli Choopulu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

23, మార్చి 2024, శనివారం

Pelli Choopulu : Ee Babu Gariki Song Lyrics (ఈ బాబుగారికి పాత పాట)

చిత్రం: పెళ్లి చూపులు(2016)

రచన: రాహుల్ రామకృష్ణ

గానం: సూరజ్ సంతోష్

సంగీతం: వివేక్ సాగర్




ఈ బాబుగారికి పాత పాట పాడుతున్న జేబు మోతకి వరాలు కోరే కాసులంటే గారడంటా .. ఓ ఓ ఓ రాయబారమే బాబు గారి లోకమంతా మాయజాలమే తరాల నుండి తరలివచ్చే బంధువంటా... కళ్ళంత కధలులే ఖరీదు కానివే .. ఈ బాబుగారికి పాత పాట పాడుతున్న జేబు మోతకి వరాలు కోరే కాసులంటే గారడంటా .. ఆకలంటే ఆశ పరాయి కాని బాష ఖరాబు మోజు కోరదంటూ వినాలే .. సంబరాలకంట వయస్సులెందుకంటా నీ దారి చేరే మలుపులెన్నో రకాలే .. నిజాలు తెలిపే జాతకలే గారడంటా .. మనిషికి పరుగులాటలెన్నో కలలకు ఖర్చులారిపోయే .. మిగిలిన ఆశే నీ ధ్యాసే తరాజులైతే ..మనసుకి రుజువెలెన్నో కలిగే .. తదుపరి తాను పాడే పాటే ..తొలకరి తీపి జ్ఞాపకాలే విధే కదా ..అదే కథా ..ఈ మాయరా ఏం మాయరా ఏ దారి మలుపుకో రథాల జోరు రంగు పూసే జ్ఞాపకాలకో ఈ గుండె కదిపే రాగముంటే పాడరాదా ... ఆరే జ్ఞాపకాలని బాబు గారు కథలు చెప్పి పాడుతారని ఈ నింగి నేల వేచి చూసే లోకమాయ

29, నవంబర్ 2021, సోమవారం

Pelli Choopulu : Merise Merise Song Lyrics (మెరిసే మెరిసే )

చిత్రం: పెళ్లి చూపులు(2016)

రచన: శ్రేష్ఠ

గానం: హరి చరణ్ , ప్రణవి ఆచార్య

సంగీతం: వివేక్ సాగర్



మెరిసే మెరిసే మనసే మురిసే నీలా చెలిమి వలనే చిరు చిరు ఆశలు విరిసేగా కడలే యదలో మునకేసేనా తొలి తొలి గా... అఅఅఆఆఆ... ఆ అరె అరె భువి తిరిగెనులే తిరిగి తన దిశ మార్చి ఆ అలరారే అల ఎగిసే తానే తననే చేరి హృదయం లోలోనా పరిచే ఎన్నో వెలుతురులే మిణుగురులై ముసిరి ఎద నిమిరె కడలే యదలో మునకేసేనా చిగురులు తొడిగే లతలే అన్ని సీతాకోకలాయే తళతళలాడే చుక్కలనే తాకే నీలాకాశం చుట్టూరా తిరిగేస్తూ ఎంతశ్చర్యం జాబిలికే నడకలు నేర్పిoచే హా అరె అరె భువి తిరిగెనులే తిరిగి తన దిశ మార్చి ఆ అలరారే అల ఎగిసే తానే తననే చేరి కసురుతూ కదిలే కాలం ఏమైపోనట్టు… కొసరి కొసరి పలకరించు జల్లులిలా ఇన్నాళ్ళేమైనట్టు గగనం నయనం తెరువంగా మురిసే భువనమిల ఒకటై నడిచే అడుగులిక నిలవాలి కలకాలం మెరిసే మెరిసే మనసే మురిసే నీలా చెలిమి వలనే చిరు చిరు ఆశలు విరిసేగా తొలి తొలిగా... అఅఅఆఆఆ... ఆ అరె అరె భువి తిరిగెనులే తిరిగి తన దిశ మార్చి ఆ అలరారే అల ఎగిసే తానే తననే చేరి హృదయం లోలోనా పరిచే ఎన్నో వెలుతురులే మిణుగురులై ముసిరి ఎద నిమిరే

Pelli Choopulu : Chinuku Taake Song Lyrics (చినుకు తాకే జడిలో)

చిత్రం: పెళ్లి చూపులు(2016)

రచన: శ్రేష్ఠ

గానం: అమ్రితవర్షిణి

సంగీతం: వివేక్ సాగర్


చినుకు తాకే జడిలో చిగురు తొడిగే చెలిమే విరిసే హరివిల్లులే.. ఏదుట నిలిచే నిజమే కలలు పంచే తీరే చిలికే చిరునవ్వులే మునుపు కనుగొననీ ఆనందమేదో కలిగే నాలోన ఈ వేళనే యేగిసి ఉప్పొంగే ఊహల్లో మునిగీ ఉన్నాలే పలకరించే ఆశే పరవశాన్నే పెంచే చిలిపి కేరింతలా.. కలవరింతే తరిమే పరుగులేత్తే మనసే ఓడిసి పట్టేదెలా.. నాలో నేదాగే నిదురించు నన్నే తట్టి లేపింది నీవే సుమా... ఇంత అందంగా లోకాన్నీ నీదే చూస్తున్నా... నేనేనా ఇది అంటూ అనిపించినా అవునవును నేనే మరి కాదా.. చిత్రంగా నాకేనే కనిపించినా కవ్వించే చిత్రాన్నయి ఉన్నాగా.. నా దారినే మల్లించినా తుళ్లింతలా వరదలా... పాదాలనే నడిపించినే రహదారి నయ్యేవేలా... నేరుగా సరాసరి నేనిలా... మారగా మరి మరి తీరుగా... పలకరించే ఆశే పరవశాన్నే పెంచే చిలిపి కేరింతలా.. కలవరింతే తరిమే పరుగులేత్తే మనసే ఓడిసి పట్టేదెలా.. నాలో నేదాగే నిదురించు నన్నే తట్టి లేపింది నీవే సుమా... ఇంత అందంగా లోకాన్నీ నీదే చూస్తున్నా...