చిత్రం: పెళ్లి చూపులు(2016)
రచన: శ్రేష్ఠ
గానం: హరి చరణ్ , ప్రణవి ఆచార్య
సంగీతం: వివేక్ సాగర్
మెరిసే మెరిసే మనసే మురిసే నీలా చెలిమి వలనే చిరు చిరు ఆశలు విరిసేగా కడలే యదలో మునకేసేనా తొలి తొలి గా... అఅఅఆఆఆ... ఆ అరె అరె భువి తిరిగెనులే తిరిగి తన దిశ మార్చి ఆ అలరారే అల ఎగిసే తానే తననే చేరి హృదయం లోలోనా పరిచే ఎన్నో వెలుతురులే మిణుగురులై ముసిరి ఎద నిమిరె కడలే యదలో మునకేసేనా చిగురులు తొడిగే లతలే అన్ని సీతాకోకలాయే తళతళలాడే చుక్కలనే తాకే నీలాకాశం చుట్టూరా తిరిగేస్తూ ఎంతశ్చర్యం జాబిలికే నడకలు నేర్పిoచే హా అరె అరె భువి తిరిగెనులే తిరిగి తన దిశ మార్చి ఆ అలరారే అల ఎగిసే తానే తననే చేరి కసురుతూ కదిలే కాలం ఏమైపోనట్టు… కొసరి కొసరి పలకరించు జల్లులిలా ఇన్నాళ్ళేమైనట్టు గగనం నయనం తెరువంగా మురిసే భువనమిల ఒకటై నడిచే అడుగులిక నిలవాలి కలకాలం మెరిసే మెరిసే మనసే మురిసే నీలా చెలిమి వలనే చిరు చిరు ఆశలు విరిసేగా తొలి తొలిగా... అఅఅఆఆఆ... ఆ అరె అరె భువి తిరిగెనులే తిరిగి తన దిశ మార్చి ఆ అలరారే అల ఎగిసే తానే తననే చేరి హృదయం లోలోనా పరిచే ఎన్నో వెలుతురులే మిణుగురులై ముసిరి ఎద నిమిరే
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి