Prana Snehitulu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Prana Snehitulu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

7, ఆగస్టు 2021, శనివారం

Prana Snehitulu : Snehaanikanna minna song lyrics (స్నేహానికన్న మిన్న)

చిత్రం : ప్రాణస్నేహితులు ( 1988)

సంగీతం : రాజ్ - కోటి

గీతరచయిత : భువనచంద్ర 

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం


స్నేహానికన్న మిన్న లోకాన లేదురా స్నేహానికన్న మిన్న లోకాన లేదురా కడదాక నీడ లాగ నిను వీడి పోదురా నీ గుండెలో పూచేటిది నీ శ్వాసగా నిలిచేటిది ఈ స్నేహమొకటేనురా స్నేహానికన్న మిన్న లోకాన లేదురా... తులతూగే సంపదలున్నా స్నేహానికి సరిరావన్నా.. ఓ ... పలుకాడే బంధువులున్నా నేస్తానికి సరికారన్నా మాయ మర్మం తెలియని చెలిమే ఎన్నడు తరగని పెన్నిధిరా ఆ స్నేహమే నీ ఆస్తి రా నీ గౌరవం నిలిపేనురా సందేహమే లేదురా స్నేహానికన్న మిన్న లోకాన లేదురా కడ దాక నీడ లాగ నిను వీడి పోదురా... త్యాగానికి అర్ధం స్నేహం లోభానికి లొంగదు నేస్తం.. ఓ ప్రాణానికి ప్రాణం స్నేహం.. రక్తానికి రక్తం నేస్తం... నీది నాదను భేదం లేనిది నిర్మలమైనది స్నేహమురా ధ్రువతారలా స్థిరమైనది ఈ జగతిలో విలువైనది ఈ స్నేహమొకటేనురా... స్నేహానికన్న మిన్న లోకాన లేదురా కడ దాక నీడ లాగ నిను వీడి పోదురా నీ గుండెలో పూచేటిది నీ శ్వాసగా నిలిచేటిది ఈ స్నేహమొకటేనురా...