చిత్రం : ప్రాణస్నేహితులు ( 1988)
గీత రచయిత : భువనచంద్ర
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం
సంగీతం : రాజ్ - కోటి
పల్లవి :
స్నేహానికన్న మిన్న లోకాన లేదురా స్నేహానికన్న మిన్న లోకాన లేదురా కడదాక నీడ లాగ నిను వీడి పోదురా నీ గుండెలో పూచేటిది నీ శ్వాసగా నిలిచేటిది ఈ స్నేహమొకటేనురా స్నేహానికన్న మిన్న లోకాన లేదురా...చరణం 1 :
తులతూగే సంపదలున్నా స్నేహానికి సరిరావన్నా.. ఓ ...
పలుకాడే బంధువులున్నా నేస్తానికి సరికారన్నా
మాయ మర్మం తెలియని చెలిమే ఎన్నడు తరగని పెన్నిధిరా
ఆ స్నేహమే నీ ఆస్తి రా నీ గౌరవం నిలిపేనురా
సందేహమే లేదురా
స్నేహానికన్న మిన్న లోకాన లేదురా
కడ దాక నీడ లాగ నిను వీడి పోదురా...
చరణం 2:
త్యాగానికి అర్ధం స్నేహం లోభానికి లొంగదు నేస్తం.. ఓ
ప్రాణానికి ప్రాణం స్నేహం.. రక్తానికి రక్తం నేస్తం...
నీది నాదను భేదం లేనిది నిర్మలమైనది స్నేహమురా
ధ్రువతారలా స్థిరమైనది ఈ జగతిలో విలువైనది
ఈ స్నేహమొకటేనురా...
స్నేహానికన్న మిన్న లోకాన లేదురా
కడ దాక నీడ లాగ నిను వీడి పోదురా
నీ గుండెలో పూచేటిది నీ శ్వాసగా నిలిచేటిది
ఈ స్నేహమొకటేనురా...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి