Prema Murthulu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Prema Murthulu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

23, మార్చి 2024, శనివారం

Prema Murthulu : Taraka Cheppadu Song Lyrics (తారక చెప్పదు ఏనాడు.)

చిత్రం: ప్రేమ మూర్తులు (1982)

రచన: వేటూరి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం,పి. సుశీల

సంగీతం: చక్రవర్తి




పల్లవి: లలలలలల... లలలలల... లలలలల... తారక చెప్పదు ఏనాడు... జాబిలి వెన్నెల వీడ్కోలు తారక చెప్పదు ఏనాడు... జాబిలి వెన్నెల వీడ్కోలు ఆకాశానికి ఆ రెండూ... దేవుడు పెట్టిన దీపాలు తారక అడగదు ఏనాడు... పున్నమి వెన్నెల వీడ్కోలు తారక అడగదు ఏనాడు... పున్నమి వెన్నెల వీడ్కోలు అనురాగానికి ఆ రెండూ... మమతల హారతి కాబోలు చరణం 1: ఉదయకాంతి నీ పెదవుల మెరిసి... తాంబూలంగా చూస్తుంటా నీలి మబ్బు నీ నీలాల కురులకే... చుక్క మల్లెలే అందిస్తా చిరుగాలులు నీ తాకిడిగా... సెలయేరులు నీ అలికిడిగా నాలో నిన్నే చూసుకుంటూ... కాలం ఇట్టే గడిపేస్తా కాలమంతా కరిగిపోయే కౌగిలింతలు నేనిస్తా  తారక అడగదు ఏనాడు... పున్నమి వెన్నెల వీడ్కోలు   ఆకాశానికి ఆ రెండూ... దేవుడు పెట్టిన దీపాలు చరణం 2: వేడి ఆశనై వేసవి గాలుల... వెచ్చని కబురులు పంపిస్తా కలల నీడలే కౌగిళ్లనుకొని... కలవరింతగా కలిసొస్తా నెలవంకలు నీ నవ్వులుగా... కలహంసలు నీ నడకలుగా కావ్యాలెన్నో రాసుకుంటూ... కవినే నీకై వినిపిస్తా కవితలాగా నిలిచిపోయే అనుభవాలే పండిస్తా తారక చెప్పదు ఏనాడు... జాబిలి వెన్నెల వీడ్కోలు ఆకాశానికి ఆ రెండూ... దేవుడు పెట్టిన దీపాలు తారక అడగదు ఏనాడు... పున్నమి వెన్నెల వీడ్కోలు అనురాగానికి ఆ రెండూ... మమతల హారతి కాబోలు


Prema Murthulu : Maavaru Bangaru Konda Song Lyrics (మా వారు బంగారు కొండా...)

చిత్రం: ప్రేమ మూర్తులు (1982)

రచన: వేటూరి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం,పి. సుశీల

సంగీతం: చక్రవర్తి



పల్లవి: మా వారు బంగారు కొండా... మా వారు బంగారు కొండా మనసైన అందాల దొంగా పొద్దైనా మాపైనా ఎవరున్నా ఏమన్నా కనుగీటుతు ఉంటారు నను వదలను అంటారు మా రాధా బంగారు కొండా.. మా రాధా బంగారు కొండా మనసైన అందాల దొంగా కడకొంగున కట్టేసి తన చుట్టు తిప్పేసి చిలిపిగ ఉడికిస్తుంది కిలకిల నవ్వేస్తుంది మా వారు బంగారు కొండా.. మా రాధా బంగారు కొండా చరణం 1: మురిపాలను కలబోసి చిరు ముద్దలు పెడుతుంటే కొనవేలు కొరికింది ఎవరో మలి సంధ్యల జిలుగులను మౌనంగా చూస్తుంటే అరికాలు గిల్లింది ఎవరో నిదురలోన నేనుంటే అదను చూసి ముద్దాడి ఒదిగిపోయి చూసింది ఎవరో ఆ తీయని చెలగాట ఆ తీరని దొంగాట ఆడింది ఇద్దరము అవునా.. హ ..హ..హ.. మా వారు బంగారు కొండా.. మా రాధా బంగారు కొండా చరణం 2: గుబురేసిన చీకట్లో గుబులేదో నటియించి గుండె మీద వాలిపోలేదా గుడిమెట్లు దిగుతుంటే పడిపోతావంటూ నా నడుముండి పెనవేయలేదా సీమంతం కావాలా శ్రీమతిగారు అంటే సిగ్గుతో తలవాల్చలేదా ఆ సిగ్గు ఏమందో ఆ మదిలో ఏముందో ఆనాడె తెలుసుకోలేదా.. హా...

మా రాధా బంగారు కొండా.. మా రాధా బంగారు కొండా మనసైన అందాల దొంగా కడకొంగున కట్టేసి తన చుట్టు తిప్పేసి చిలిపిగ ఉడికిస్తుంది కిలకిల నవ్వేస్తుంది

మా వారు బంగారు కొండా... మా వారు బంగారు కొండా మనసైన అందాల దొంగా పొద్దైనా మాపైనా ఎవరున్నా ఏమన్నా కనుగీటుతు ఉంటారు నను వదలను అంటారు

మా వారు బంగారు కొండా.. మా రాధా బంగారు కొండా